Thu. Apr 25th, 2024
Onions_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 13,2023: సహజ ఔషధాలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగ కరంగా ఉంటుంది. కొన్నిరకాల ఆహారాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఉల్లిగడ్డ ని తినడం వల్ల శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుంది. వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

పచ్చి ఉల్లిపాయ వడదెబ్బ నుంచి కాపాడడమేకాకుండా శరీరానికి చలువ చేస్తుంది. ఇది కాకుండా, పచ్చి ఉల్లిపాయను అనేక వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు. తరచుగా మహిళలు జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడటానికి పచ్చి ఉల్లిపాయ రసాన్ని కూడా ఉపయోగిస్తారు.

Onions_365

కానీ పచ్చి ఉల్లిపాయ ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుందని కాదు. కొన్నిసార్లు ఉల్లిని ఎక్కువగా తీసుకోవడం హానికరం. ఉల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులపై ప్రభావం చూపుతుంది, కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

ఉల్లిపాయల్లో..

ఉల్లిపాయల్లో సోడియం, పొటాషియం, ఫోలేట్లు, విటమిన్లు ఎ, సి ,ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా ఉల్లిపాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ కార్సినోజెనిక్ గుణాలు కూడా ఉల్లిపాయల్లో ఉన్నాయి. ఉల్లిపాయ ఒక రకమైన సూపర్ ఫుడ్.

ఉల్లిపాయ క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం నుంచి రక్షిస్తుంది. ఒక నివేదిక ప్రకారం, ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్స్ లక్షణాలు ఉన్నాయి, ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

అంతే కాకుండా, ఉల్లిపాయ థియో సల్ఫైట్స్ తీసుకోవడం రక్తం స్థిరత్వాన్ని నిర్వహిస్తుంది. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

Onions_365

పచ్చి ఉల్లిపాయ క్యాన్సర్‌తో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది క్యాన్సర్ కణాలు పెరగడానికి అనుమతించదు. క్యాన్సర్‌తో పోరాడే శక్తిని కూడా పెంచుతుంది. ఎముకలను బలపరుస్తుంది.

ఉల్లిగడ్డలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎముకల కోసం పాల ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పటికీ, ఉల్లిపాయల వినియోగం ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. ఉల్లిపాయల్లో కూడా క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.

జుట్టు కోసం..

ఉల్లిపాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, ఇవి జుట్టు బలంగా పెరగడానికి ఉపయోగపడతాయి. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, మెరిసేలా ఉండడమే కాకుండా, వేగంగా పెరగడంతోపాటు రక్తప్రసరణ పెరిగి శిరోజాలకు బలం చేకూరుతుంది. జుట్టు నెరవడం లేదా చుండ్రు అనేది ఒక సాధారణ సమస్యలను పరిషరించడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుంది.

ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు..

Onions_365

చక్కెర తక్కువగా ఉన్నవారు ఉల్లిపాయల వినియోగాన్ని తగ్గించాలి. ఎందుకంటే ఉల్లిపాయ చక్కెర స్థాయిని చాలా వరకు తగ్గిస్తుంది. ఉల్లిపాయను గర్భిణీ స్త్రీలు తక్కువగా తినాలి, ఎందుకంటే ఉల్లిపాయ కడుపులో ఒక్కోసారి మంటగా అనిపిస్తుంది, ఇది ప్రసవ సమయంలో నొప్పిగా మారుతుంది. గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. మీకు సందేహాలుంటే వైద్యనిపుణులు సంప్రదించండి.

ప్రేగులపై.. 

పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలో, ప్రేగులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని కారణంగా క్రమంగా కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయట.