హైదరాబాద్‌ వండర్‌లా ‘సమ్మరెలా ఫియెస్టా’తో వేసవి తాపాన్ని అధిగమించండి

Business Entertainment Featured Posts Life Style National Trending TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హెదరాబాద్,ఏప్రిల్ 18,2022: భారతదే శంలోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ తన హైదరాబాద్‌ పార్క్‌లో మే 31 వరకు ‘సమ్మర్‌లా ఫియస్టా’ని నిర్వహిస్తోంది. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో వండర్‌లా ఉత్తేజకరమైన ల్యాండ్ ,వాటర్ రైడ్‌ల థ్రిల్‌తో పాటు లైవ్ ప్రదర్శనలు, స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్, ఫన్ గేమ్‌లు, స్ట్రీట్ మ్యాజిక్ తదితర అనేక రకాల కార్యకలాపాలను వండర్‌లా నిర్వహిస్తోంది. అలాగే, వినియోగదారులకు పెయిడ్ పిక్ అప్ అండ్ డ్రాప్ సదుపాయాన్ని అందుబా టులోకి తీసుకు వచ్చింది.అదనంగా, వండర్‌లా కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను రూపొందించింది.

టిక్కెట్ కౌంటర్‌లో తమ కళాశాల ఐడిని చూపించి, 22 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న విద్యార్థులు ఎంట్రీ టిక్కెట్‌లపై 20% తగ్గింపును పొందవచ్చు.టిఎస్ఆర్‌టిసి (TSRTC) బస్సు ద్వారా వండర్‌లా హైదరాబాద్‌కు ప్రయాణించే వినియోగదారులకు
పార్క్ ఎంట్రీ టిక్కెట్‌లపై 15% తగ్గింపు పొందుతారు. వండర్‌లా టికెట్ కౌంటర్‌లో బస్సు టిక్కెట్‌లను చూపించి ఈ తగ్గింపును అందుకోవచ్చు.ఇవే కాకుండా, మీరు పార్కును సందర్శించేందుకు 5 రోజుల ముందుగా ఆన్‌లైన్‌లో ప్లాన్ చేసుకుంటే, 10% ఎర్లీ బర్డ్ ఆఫర్ పొందవచ్చు.

భౌతిక దూరానికి సంబంధించిన ప్రోటోకాల్‌కు అనుగుణంగా వండర్‌లా తన విజిటర్లను తమ ఆన్‌లైన్ పోర్టల్ https://bookings.wonderla.com/ ద్వారా ముందుగా తమ ఎంట్రీ టిక్కెట్లను .బుక్ చేసుకోమని ప్రోత్సహిస్తుంది. మరిన్ని వివరాల కోసం వండర్‌లా వెబ్‌సైట్‌ను చూడండి:
https://www.wonderla.com/, లేదా 08414676300 , 08414676333కు కాల్
చేయండి.