Thu. Mar 28th, 2024
new-3D-glasses

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 16,2022: వరల్డ్ నే మోస్ట్ కాస్ట్లీయేస్ట్ బార్కోలేజర్ 3డీ గ్లాసు తొలిసారి ప్రసాద్ ఐమ్యాక్స్ థీయేటర్ లో avatar-2 సినిమా కోసం సరికొత్త 3D కంటి అద్దాలను ప్రవేశపెట్టారు.

అత్యాధునిక సాంకేతి కతతో రూపొందించిన అవతార్- 2 సినిమాను అంతే స్థాయిలో వీక్షించేలా లేటెస్ట్ 3డీ గ్లాసెస్ అందించనున్నారు.

ఈరోజు విడుదల యిన అవతార్ -2 సినిమాకు ఈ గ్లాసెస్ ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు. ఈ గ్లాసెస్ను బెల్జియం నుంచి తీసుకొచ్చారు.

ఒక్కో గ్లాస్ (స్పెడ్స్) ధర రూ.4వేలు.మరో విశేషం ఏమిటంటే.. దేశంలోనే అత్యంత పెద్ద స్క్రీన్.. ప్రపంచంలోనే అతి పొడవైన ఐమ్యాక్స్ స్క్రీన్ పై ఈ సినిమా ప్రదర్శించారు.

630 సీటింగ్ కెపాసిటీతో స్క్రీన్ 64 అడుగుల ఎత్తు, 101.6 అడు గుల వెడల్పుతో భారీ తెరను ఏర్పాటు చేశారు. 

new-3D-glasses

కెనాడాకు చెందిన ప్రొజెక్షన్ స్క్రీన్ తయారీదారు ఆస్ట్రాంగ్ ఎండీఐ ద్వారా ప్రసాద్ మల్టీప్లెక్స్ కోసం స్క్రీన్ ప్రత్యేకంగా రూపొందించారు.

స్పీకర్లు క్యూఎస్సీ ఆడియో.. ప్లేబ్యాక్ కోసం, డాల్బీ సీపీ950 సౌండ్ ప్రాసెసర్ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ 3డీ గ్లాసెస్ సరికొత్త అనుభూతి పొందామని ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు.