Sat. Apr 20th, 2024
AVATAR-2LAtest-c

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ, జనవరి 2,2023: వీకెండ్ కావడంతోపాటు కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది అవతార్- 2 మూవీ.

రణవీర్ సింగ్ ‘సర్కస్’, ‘దృశ్యం 2’ న్యూ ఇయర్ రేసులో పోటీ పడ్డాయి. ఈ నేపథ్యంలో అవతార్- 2 సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ ను రాబట్టింది.

అవతార్ -2..

జేమ్స్ కామెరూన్ చిత్రం ‘అవతార్ -2’ కొత్త సంవత్సరం మొదటి రోజున బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా మంచి వసూళ్లను సాధించింది.

రిలీజ్ అయ్యి మూడవ వారానికి చేరుకున్నప్పటికీ ఏ చిత్రం దాని కలెక్షన్స్ దరిదాపుల్లోకి చేరుకోవడంలేదు.

ఈ చిత్రం శనివారం 4.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆదివారం వచ్చిన మొదటి లెక్కల ప్రకారం, దాని వసూళ్లు 16.50 కోట్లు.

మూడువారాల మొత్తం కలెక్షన్ 333.25 కోట్ల రూపాయలకు చేరుకొంది.

మరోపక్క రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సర్కస్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు.

ఈ చిత్రంలో రణవీర్ సింగ్ , వరుణ్ శర్మ ద్విపాత్రాభినయం చేసారు, కానీ అది ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించడంలో విఫలమైంది.

‘సర్కస్’..

AVATAR-2LAtest-c

‘సర్కస్’కి న్యూ ఇయర్ సెలవులు ఉండడం వల్ల థీయోటర్లలో జనాలు కనిపించారు. శనివారం 1.55 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఆదివారం 2.20 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘సర్కస్’ మొత్తం వసూళ్లు 35 కోట్లకు చేరింది.

దృశ్యం-2..

అజయ్ దేవగన్ దృశ్యం-2 సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి.

ఈ చిత్రం విడుదలైన ఆరవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతోంది.

శనివారం నాడు 1.2 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆదివారం వచ్చిన లెక్కల ప్రకారం 1.90 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా మొత్తం వసూళ్లు 234.60 కోట్ల రూపాయలకు చేరాయి.

వేడ్..

రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా నటించిన చిత్రం ‘వేడ్’ మరాఠీ చిత్రం. ఈ సినిమాతో రితేష్ మరాఠీ సినిమాకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదలైంది. వేడ్ మూవీ శుక్రవారం రూ.2.30 కోట్లు రాబట్టగా, శనివారం రూ.3.20 కోట్లు వసూలు చేసింది.

ఆదివారం వచ్చిన లెక్కల ప్రకారం రూ.4.90 కోట్ల మేర వసూళ్లు కాగా, ఇప్పుడు ఈ సినిమా టోటల్ కలెక్షన్ 10.40 కోట్లుగా ఉంది.