365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,తిరుపతి, జూలై 4,2022: శ్రీవారికి లడ్డూ అంటే ఎంతో ఇష్టం. అంతటి రుచు ఉండడంతో చిన్నా,పెద్దా అనే తేడాల్లే కుండా అందరూ బాగా ఇష్టపడుతారు. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతుంది. తిరుపతి లడ్డూ 1940లో భక్తులకు అందించడం మొదలైంది. లడ్డూ విక్రయాలు మొదలై ప్రస్తుతం 82ఏళ్లు అవుతోంది. శ్రీవారికి సమర్పించే నైవేద్యల్లో అనేక రకా లున్నాయి. సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహర పడి(క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో ప్రసాదాలు విక్రయించ డంలో భాగంగా బూందీ తీపి ప్రసాదంగా ప్రారంభించింది. అది చివరకు 1940లో లడ్డూగా మారింది.
Continue Reading