Sat. Sep 24th, 2022
APSRTC_buses
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,సెప్టెంబర్ 23,2022: మరో 263 అద్దె బస్సులకు టెండర్లను ఆహ్వానిస్తూ ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాల వారీగా అవసరమైన అద్దె బస్సులకు టెండర్లు దాఖలు చేసేందుకు ప్రకటన విడుదలైంది. వరుసగా నాలుగు ఏసీ స్లీపర్, ఆరు ఏసీ స్లీపర్, పన్నెండు సూపర్ లగ్జరీ, పదిహేను అల్ట్రా డీలక్స్, ముప్పై ఎక్స్‌ప్రెస్, తొంభై ఐదు అల్ట్రా పల్లె వెలుగు, డెబ్బై రెండు పల్లె వెలుగు, ఇరవై ఏడు మెట్రో ఎక్స్‌ప్రెస్, రెండు సిటీ ఆర్డినరీ బస్సులను లీజుకు తీసుకుని టెండర్లు ఆహ్వానించారు.

అద్దె బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసి బిడ్లు వేయవచ్చు. అక్టోబరు 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ టెండర్లలో పాల్గొనేవారు MSTC “e” కామర్స్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. రూట్‌లు, టెండర్ షరతులు, బస్సుల స్పెసిఫికేషన్‌లు, టెండర్ షెడ్యూల్, టెండర్ నిబంధనల వివరాల కోసం APSRTC వెబ్‌సైట్ http://apsrtc.ap.gov.inని సందర్శించవచ్చు.

APSRTC_buses


జిల్లాల వారీగా అద్దె బస్సుల టెండర్ల వివరాలు. శ్రీకాకుళం జిల్లా 23, విజయనగరం 12, పార్వతీపురం మన్యం 29, విశాఖపట్నం 42, అనకాపల్లి 16, తూర్పుగోదావరి 2, కాకినాడ 35, బీఆర్ అంబేద్కర్ కోనసీమ 24, పశ్చిమ గోదావరి29, కృష్ణా 4, ఎన్టీఆర్ 3, గుంటూరు 2, పలనాడు 2, నెల్లూరు 5, తిరుపతి 8, అన్నమయ్యలో 5, నంద్యాలలో 3, అనంతపురంలో 8, శ్రీ సత్యసాయి జిల్లాలో11ఉన్నాయి.