రాష్ట్రంలో మిడ్-మార్కెట్ క్లౌడ్‌లో వ్యాపార పరివర్తనను వేగవంతం చేయడంలో హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్‌ఎపి (SAP) ‘మొబైల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’

Business Featured Posts Life Style Technology Trending TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 12,2022:క్లౌడ్ అడాప్షన్‌ను మరింత విస్తృతం చేసేందుకు,మిడ్-మార్కెట్ఎంటర్‌ప్రైజెస్‌లలో వ్యాపార పరివర్తనను వృద్ధి చేసేందుకు ఎస్‌ఎపి (SAP) ఇండియా తన ఇమ్మర్సివ్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ‘ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌ప్రెస్’ను హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.

తెలంగాణ రాష్ట్రం 2.6 million MSMEsలను కలిగి ఉంది,భారతదేశ స్థూల జాతీయో త్పత్పతికి కీలక సహకారాన్ని అందిస్తోంది.ఇందులో ఆటోమోటివ్,గ్రీన్ టెక్,ఏరోస్పేస్ & డిఫెన్స్, లాజిస్టిక్స్, రత్నాలు & ఆభరణాలు, ఐటీ-ఐటీఈలు(IT-ITeS), ఎఫ్ఎంసిజీ తదితర పరిశ్రమలు, రంగాలు ఉన్నాయి. వ్యాపారాలు న్యూ నార్మల్ స్థితికి అనుగుణం గా చేరుకోవడంతో,ఆవిష్కరణ మరియు శక్తితో కూడిన సవాళ్లు, దానికి అనుగుణమైన నూతన వాతావరణాన్ని సృష్టించడం అత్యవసరం. ‘ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌ప్రెస్’తో, రాష్ట్రంలోని ఎస్‌ఎంఇలు ఖర్చు ప్రభావం,చురుకుదనం,వ్యాపార స్థితిస్థాపకతను పెంచడానికి డిజిటల్ సొల్యూషన్‌లను,విస్తృత శ్రేణి ‘రైజ్ విత్ ఎస్ఏపి (RISE with SAP) ఆఫర్‌లను ఎలా వినియోగించుకోవచ్చనే దాని గురించి ప్రత్యక్ష వీక్షణను పొందుతారు.

ఈ సందర్భంలో ఎస్ఏపి (SAP) భారత ఉపఖండం మిడ్-మార్కెట్ విభాగాధికారి రాజీవ్ సింగ్ మాట్లాడుతూ: ‘‘మా వినియోగదారుల్లో 80% కన్నా ఎక్కువగా ఎస్ఎంఇలు ఉండటంతో, ఎస్ఏపి (SAP) దేశంలో ఈ విభాగానికి డిజిటల్ పరివర్తన తీసుకు రావడంలో ముందంజలో ఉంది. మేము వారి సాంకేతిక అవసరాలు,ప్రత్యేక వ్యాపార అవసరాలను పూర్తిగా అర్థం చేసుకున్నాము.అత్యాధునిక డిజిటల్ పరిష్కారాలు ,క్లౌడ్ టెక్నాలజీని వారి ఇళ్ల వద్దకే అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా, మేము తెలంగాణ ఎస్‌ఎంఇలను విస్తృతం చేసేందుకు,తెలివైన, స్థిరమైన ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చేందుకు వారి అన్వేషణలో సహకారాన్ని అందిస్తున్నాము’’ అని వివరించారు.

వినియోగదారుని జీవితకాలపు విలువను పెంపొందించడంపై దృష్టి సారించిన ఈ ప్రయత్నం దిగువ పేర్కొన్న 3 స్తంభాలపై నిర్మించబడింది:ఎ. ఎక్స్‌పీరియన్స్ సెంటర్: ట్రావెలింగ్ సెంటర్‌గా రూపొందించబడిన ఈ బస్సులో రైజ్ విత్
ఎస్ఎపి, ఎస్‌ఎపి డిజిటల్ కోర్, ప్రొక్యూర్‌మెంట్, కస్టమర్,పీపుల్ ఎక్స్‌పీరియన్స్
సొల్యూషన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు ఉన్నాయి. వారి క్లౌడ్ మైగ్రేషన్ ,డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలను ఇందులో వేగవంతంగా చేసుకోవచ్చు.

బి. భవిష్యత్తు నైపుణ్య రూపకల్పన: ఎస్ఎపి (SAP) ఇండియా స్థానిక పరిశ్రమ/వాణిజ్య సంఘాలు,ద్యాసంస్థలతో కలిసి యువ విద్యార్థులకు క్లౌడ్ సాంకేతికత శక్తిని వ్యాపారా లను వృద్ధి చేసేందుకు పరిమాణాన్ని పెంచేందుకు సహాయపడగలదో ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. సి. డ్రైవింగ్ సస్టైనబిలిటీ: బస్సు ప్రయాణిం చే ప్రతి కిలోమీటరుకు, కార్బన్ అడుగుజాడలను అధిగమించేందుకు ఎస్ఎపి ఇండియా ఒక మొక్కను నాటుతుంది.

ఈ బస్సు 7,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది, ఎస్ఎంఇలకు క్లౌడ్ ఆధారిత డిజిటల్ కోర్ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి ప్రణాళిక రూపొందించుకునేందుకు ,మరింత వేగంగా స్వీకరించేందుకు ఎలా సహాయపడుతుందనే అంశాలను ప్రత్యక్షం గా తెలుసుకోవచ్చు. ఇది ఇంటరాక్టివ్ ప్రోడక్ట్ డెమోలు, వర్చువల్ రియాలిటీ ఎగ్జిబిష న్,ఇన్ఫర్మేటివ్ సెషన్‌లతో కలిసి ఉంటుంది.

మరిన్ని వివరాలకు Transformation Express Website చూడండి.
SAP News Centerను సందర్శించండి.
Twitter, Instagram, Facebook,LinkedInలో ఎస్ఏపిని అనుసరించండి