Thu. Mar 28th, 2024
abhayanjaneyaswamy_ammapalli

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 27,2023: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)రాష్ట్ర నాయకులు బుక్కవేణుగోపాల్ ఆధ్వర్యంలో అమ్మపల్లిలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి.

abhayanjaneyaswamy_ammapalli

ఉదయం అభయ ఆంజనేయ స్వామివారి అభిషేకాలతో ప్రారంభమైన వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ కుటుంబ సమేతంగా మహా హోమం నిర్వహించారు.

abhayanjaneyaswamy_ammapalli

రాష్ట్ర ప్రజలు స్వామి వారి అభయంతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని బుక్క వేణుగోపాల్ భక్తులకు పంపిణీ చేశారు.