Fri. Apr 26th, 2024
"andaru bagundali andulo nenundali "streaming on october 28th In Aha

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 26,2022: మలయాళం లో బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలిచిన ‘వికృతి’ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్‌ చేసి తెరకెక్కించిన యూత్‌ ఫుల్‌ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’.

"andaru bagundali andulo nenundali "streaming on october 28th In Aha

అలీ సమర్పణలో అలీవుడ్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై అలీ, నరేష్‌ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్‌, శ్రీ చరణ్‌ ఆర్‌. లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 28న ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్‌, టీజర్‌ను ఘనంగా లాంచ్‌ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, స్టార్‌ కామెడియన్‌ బ్రాహ్మానందం చేతుల మీదుగా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ చిత్ర ట్రైలర్‌, టీజర్‌ ను లాంచ్‌ చేశారు. వీరితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

“అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టైటిల్‌ వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మలయాళం లో చూసిన “వికృతి” సినిమా నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో తనే నిర్మాతగా మారి సీనియర్‌ నటులందరినీ తీసుకొని తీసిన ఈ సినిమాకు కొత్త దర్శకుడిని, మ్యూజిక్‌ డైరెక్టర్‌ను పరిచయం చేయడం గొప్ప విషయం అని దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

మేము ఆలీతో తీసిన బ్లాక్ బస్టర్ యమలీల నెక్ట్స్‌ ఇయర్‌కు 30 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆలీ ఇప్పటికీ ఫ్రెష్‌ గా ఉన్నాడు. నటుడుగా వెయ్యి చిత్రాలకు పైగా నటించిన ఆలీ ఈ చిత్రం ద్వారా సొంత బ్యానర్‌ పెట్టి సినిమా నిర్మించే స్థాయికి ఎదిగడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి.

"andaru bagundali andulo nenundali "streaming on october 28th In Aha

నేను, అలీ ఒకే టైమ్‌లో కేరీర్‌ స్టార్ట్‌ చేశాము. అలీ, నేను కలసి చూసిన మెదటి సినిమా ‘మనీ’. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గార్లు యమలీల సినిమా ద్వారా ఆలీని హీరోగా పరిచయం చేశారని బ్రహ్మానందం అన్నారు. అప్పట్లో అది ఒక ల్యాండ్‌ మార్క్‌ గా నిలిచిందని అలా ఎదుగుతూ వచ్చిన ఆలీ ఈ రోజు మంచి సబ్జెక్టు సెలెక్ట్‌ చేసుకొని, చాలా మంది సీనియర్‌ నటులతో తీసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని బ్రహ్మానందం అన్నారు.

“మలయాళం లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరేష్ గారు నేను పోటాపోటీగా నటించాము . 27 ఏళ్ల తరువాత మంజు భార్గవి గారితో కలిసి మళ్ళీ నటించడం ఆనందంగా ఉంది. ఒక మంచి వాతావరణంలో దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు..డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

అందరూ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నారు, ఇందులో నటించిన వారందరూ ఎంతో సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 28న ఆహా లో విడుదల అవుతున్న ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుందని నటుడు నిర్మాత ఆలీ అన్నారు.

చిత్ర నిర్మాత కొణతాల మోహనన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ కథకు ఈ టైటిల్‌ కరెక్ట్‌ యాప్ట్‌ అని పెట్టాము. ఇలాంటి సినిమా చేసే అవకాశం కల్పించిన ఆలీ గారికి ధన్యవాదములు. మేము అడిగిన వెంటనే నటించడానికి అంగీకరించిన నటీ నటులు అందరికీ ధన్యవాదములు. ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి” సినిమా అందరిచేత ఆహా అనిపించుకుంటుందని అన్నారు.

"andaru bagundali andulo nenundali "streaming on october 28th In Aha

చిత్ర దర్శకుడు శ్రీపురం కిరణ్‌ మాట్లాడుతూ..1200 సినిమాలు చేసిన అలీ గారు మొదటి సారి నిర్మాతగా మారి చేస్తున్న ఈ సినిమాకు నేను దర్శకుడు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఎంతో మంది సీనియర్‌ యాక్టర్స్‌ ఉన్నా అందరూ నాకు ఫుల్‌ సపోర్ట్‌ చేశారు.ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి కెమెరా వర్క్, రాకేశ్ ప‌ళిడ‌మ్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. ఇలా అందరి సహకారంతో పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఈ నెల 28న ఆహాలో విడుదల కానుంది.ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వాదంచాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటుడు పృథ్వీ మాట్లాడుతూ…ఆలీ నటుడుగా నవ్వించడం మనందరికీ తెలుసు అయితే ఎవరైనా కష్టాల్లో వున్నట్టు తెలిస్తే సాయం చేసే గొప్ప గుణం కలిగిన ఆలీ తీసిన సినిమా ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.తనే నిర్మాత గా మారి నిర్మించిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.

నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ..సోషల్ మీడియాని అందరూ నెగిటివ్ గానే ఎక్కువగా వాడుతున్నారు. ఒక్క సారి పాజిటివ్ గా వాడండి అందరూ బాగుంటారని ఆయనఅన్నారు.