మ్యాంగో ఫియస్టాని ప్రకటించిన అమేజాన్ ఫ్రెష్

Business Featured Posts Life Style National Technology Top Stories Trending TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, 18 ఏప్రిల్ 2022: భారతదేశంలో వేసవిలో అభిమానించే ‘మామిడి పండ్ల ‘ రాకకి ఆహ్వానం పలకడానికి, అమేజాన్ ఫ్రెష్ ప్రతి వారాంతం గొప్ప డీల్స్ తో ఈరోజు మ్యాంగో ఫియస్టాని ప్రకటించింది,మే 2022 చివరి వరకు ఈ సంబరంకొనసాగుతుంది. కస్టమర్స్ సఫేదా, బంగినపల్లి,బాదామి, సింధూర, తోతాపురి, అల్ఫాన్సో,ఇంకా ఎన్నో రకాలకు చెందిన కార్బైడ్ రహితమైన,సురక్షితంగా పండించిన, ఉన్నతమైన నాణ్యత గల తాజా మామిడి పండ్లు నుండి ఎంచుకోవచ్చు. బెంగళూరులో ఉన్న కస్టమర్స్ కోసం అమేజాన్ ఫ్రెష్ కర్ణాటక అల్ఫాన్సో, రస్ పురి, కలాపద్ వంటి ప్రాంతీయ రకాల్ని,కొల్ కత్తాలో ఉన్న కస్టమర్స్ కోసం గులాబ్ ఖాస్, పెర్కూల్ మన్ వంటి రకాల్ని కూడా కస్టమర్స్ కోసం అందిస్తోంది.

కస్టమర్స్ రత్నగిరిలోని అమేజాన్ కలక్షన్ సెంటర్ నుండి నేరుగా సంపాదించిన సంప్రదాయబద్ధమైన మామిడి పండ్లు రత్నగిరి అల్ఫాన్సో, దేవ్ ఘడ్ అల్ఫాన్సో,
సేంద్రీయ అల్ఫాన్సో,ప్రీమియం కేసర్ వంటి రకాల్ని కూడా కస్టమర్స్ ఆనందించవ చ్చు. ఫియస్టా సమయంలో కస్టమర్స్ బ్యాంక్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్,బహుమతులు వంటి ఇతర ప్రయోజనాల్ని కూడా 10 % అదనపు డిస్కౌంట్ వరకు పొందవచ్చు. బెంగళూరు, ఢిల్లీ, ఫరీదాబాద్,గురుగ్రామ్, గజియాబాద్, నోయిడా, అహ్మదాబాద్, మైసూర్ , జైపూర్, ముంబయి, హైదరాబాద్, చెన్నై, పూణె, కొల్ కత్తా,ఛంఢీఘర్ సహా ప్రముఖ 15+ నగరాలలో ఉన్న కస్టమర్స్ ఉదయం 6 గంటలు నుండి ఆరంభమై అర్థరాత్రి వరకు కొనసాగే రెండు నుండి మూడు గంటల డెలివరీ వేళల్లో ఉన్నతమైన నాణ్యత గల తాజా మామిడి పండ్లని కూడా ఆనందించవచ్చు.

అమేజాన్ ఫ్రెష్ పై మామిడి పండ్ల రసాల రకాల్ని కూడా అన్వేషించండి:
*తాజా ఆల్ఫాన్సో మామిడి పండ్లు – సమృద్ధిగా, క్రీమీగా ఉండే ఆల్ఫాన్సో మామిడి పండ్లు మంచి సువాసన కలిగి ఉంటాయి, తియ్యదనం, సమృద్ధి,రుచిలో ఈ పండు రకాల్లోనే అత్యంత గొప్పదిగా పరిగణించడుతుంది. మామిడి పండ్లని ఎన్నో విధాల ఉపయోగించవచ్చు. దీనిని కోయవచ్చు,ముక్కలు చేయవచ్చు, షేక్స్ గా, రసాలుగా, సలాద్ గా తీసుకోవచ్చు, ఐస్ క్రీంస్ తో ,ఇతర డిజర్ట్స్ తో కూడా వడ్డించవచ్చు. ఈ మామిడి పండ్లని చల్లని, పొడి ప్రదేశంలో భద్రపరచాలి.
*రసం నిండిన బాదామి మామిడి పండ్లు – బాదామి మామిడి పండ్లు లేత పసుపు రంగులో ఉంటాయి, వాటి తొక్క పలుచగా ఉంటుంది కాబట్టి పండ్ల గుజ్జు మృదుత్వం గుర్తించడం సులభం. పండ్ల గుజ్జు ఆకర్షణీయమైన పసుపు రంగు నుండి నారింజ రంగులో ఉంటుంది,పండు తియ్యగా,రసం నిండి ,అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. దీనిని ముక్కలు చేయడం ద్వారా ఆనందించవచ్ లేదా నేరుగా పండు
గుజ్జుని పీల్చవచ్చు. మీరు దీనిని లస్సీ లేదా రసం రూపంలో కూడా తీసుకోవచ్చు.
*విటమిన్స్ సమృద్ధిగా గల సఫేదా/బంగినపల్లి మామిడి పండు – అమేజాన్ పై లభించే సఫేదా మామిడి పండ్లు, సహజంగా పండినవి,100 శాతం కార్బైడ్ రహితమైనవి. వేసవిలో ఆనందాన్నిచ్చే వీటిలో విటమిన్ ఏ, సీ, ఐరన్, ఫోలేట్ మెగ్నీషియంలు సమృద్ధిగా ఉంటాయి,ముదురు పసుపు రంగులో ఉంటాయి.
*బంగారు సౌందర్యం, తోతాపురి మామిడి పండు – ఈ మామిడి పండ్లు పెద్దగా,బంగారు పసుపు వర్ణంలో ఉంటాయి. అవి దీర్ఘచతురస్రాకారంలో , పక్షి ముక్కు వలే చివర వైపు కొనదేలి ఉంటాయి.పండు చర్మం సాధారణంగా మందంగా ఉంటుంది, రంగు ఆకుపచ్చ నుండి పసుపు రంగులోకి మారవచ్చు. మామిడి పండ్లలో 20కి పైగా వేర్వేరు విటమిన్స్,మినరల్స్ ఉంటాయి . తాజా మామిడి పండ్లు పొలాలు నుండి నేరుగా సంపాదించబడతాయి, మామిడి పండ్లు పరిపూర్ణమైనవిగా నిర్థారించడానికి ఎఫ్ఎస్ఎ స్ఏఐ నియమాల్ని అనుసరించే సదుపాయం కేంద్రాల్లో వేరు చేయబడి గ్రేడ్ చేయబడతాయి.

*తియ్యని సింధూర (లాల్ బాగ్) మామిడి పండు – సింధూర మామిడి పొడవైన ఆకారంలో ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ పండుకు గల ఎంతో రుచి ,తియ్యదనం వలన ఇది హనీ మ్యాంగోగా కూడా ప్రసిద్ధి చెందింది.అమేజాన్ ఫ్రెష్ పై లభించే విస్త్రతమైన మామిడి పండ్లని ఎంచుకోవడాన్ని అన్వేషించడానికి ఇక్కడ
లింక్ పై క్లిక్ చేయండి.బాధ్యత లేదని వెల్లడింపు : ఉత్పత్తి వివరాలు, వర్ణన,ధరలు విక్రేతలు అందచేసినవి. ఉత్పత్తుల ధరలు,వాటి వర్ణనలో అమేజాన్ ప్రమేయం లేదు,విక్రేతలు అందచేసిన ఉత్పత్తి సమాచారం,ఖచ్చితత్వం కోసం అమేజాన్ బాధ్యతవహించదు.