Thu. Dec 1st, 2022
facts-about-diwali
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్, హైదరాబాద్,అక్టోబర్ 24,2022: దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి, దీపావళిని వెలుగులు విరజిమ్మే పండుగ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది చీకటిపై కాంతి లేదా చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం, దీపావళి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. దీపావళి పండుగ అనేది కేవలం ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు.. ఐదు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకుంటారు.  

చాలా మంది ప్రజలు, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల నుండి ఒకే రోజు దీపావళి జరుపుకుంటారు, ఉత్తర ,వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు, ధన్‌తేరస్ నుండి భాయ్ దూజ్ వరకు. దీపావళి కూడా ప్రజలకు దాని ప్రాముఖ్యతతో జరుపుకుంటారు. కొందరు దీనిని రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినట్లుగా భావిస్తారు, కొందరు దీనిని నరకాసురుడు అనే రాక్షసుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు.

facts-about-diwali


ప్రఖ్యాతి గాంచిన స్వర్ణ దేవాలయానికి పునాది కూడా దీపావళి నాడు పడిందని చాలామందికి తెలియదు. ఈ పండుగను కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కూడా జరుపుకుంటారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న లీసెస్టర్ నగరం ప్రతి సంవత్సరం పెద్ద దీపావళి వేడుకలను నిర్వహిస్తుంది. భారతదేశంతో పాటు, శ్రీలంక, పాకిస్తాన్, థాయిలాండ్, ఫిజీ, ఇండోనేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇది జాతీయ సెలవుదినంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, మొదటి దీపావళిని సుమారు 2,500 సంవత్సరాల క్రితం జరుపుకున్నారు. దీపావళి అమావాస్య రాత్రి వస్తుంది,

ధన్వంతరీ త్రయోదశి

దంతేరస్ అని కూడా అంటారు. వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలంటుంటారు. అయితే ఈ రోజు ఎంతో ప్రధానమైంది. ‘ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ‘ధన్వంతరీభగవాన్’ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు.

facts-about-diwali

నరక చతుర్దశి

నరక యాతనల నుంచి రక్షించమని యముడి ప్రీతి కోసం, పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము ) ను పాలించే ‘నరకుడు’ నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుతశక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య- పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు కాముకత్వంతో అనుభవించేవాడు.

facts-about-diwali

నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు ( రాచకన్యలు ) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి-భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు – సత్యభామ (భూదేవీ అవతారం)తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున ఇది ‘నరక చతుర్దశి’.

దీపావళీ

రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం, నరకుని బాధల నుంచి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం – లక్ష్మీ స్వరూపం – ఐశ్వర్య స్వరూరం – జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు రాసుకుంటారు.

బలిపాఢ్యమి

వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని ‘మూడు అడుగుల’ నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి, ‘ఇంతింతైవటు డింతైనభోరాశిపైనల్లంతై’ అన్నట్లుగా ఒక పాదంతో భూమిని , ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన ‘త్రివిక్రముడు’ వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం.

యమద్వితీయ

facts-about-diwali

సూర్య భగవానునికి యముడు – శనిదేవుడు ఇద్దరు పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు – యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తనపని ( జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు. చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని బతిమాలింది.

facts-about-diwali

చెల్లెలు కార్తీక శుద్ఘ విదియ , మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు.