Thu. Dec 1st, 2022
Urvasivo-Rakshasivo-Review
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,4 నవంబర్ 2022: అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త సినిమాతో అల్లు శిరీష్‌ ఎంట్రీ ఇచ్చారు. ట్రెయిలర్ లోనే అంచనాలను పెంచిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మంచి స్టాండర్డ్స్ తో ఎంటర్ టైనింగ్ గా ఉంది.

ఊర్వశివో రాక్షసివో సినిమా కథ:


శ్రీ (అల్లు శిరీష్) అండ్ సింధు (అను ఇమ్మాన్యుయేల్) ఒక ఐటీ ఆఫీసులో కలిసి పని చేస్తారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. వారి సంబంధం కొంతకాలం సంతోషంగా కొనసాగుతుంది. అయితే ఈ జంట వివాహ జీవితంలో అసలు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను దంపతులు ఎలా అధిగమిస్తారు, వారి జీవితంకోసం వారు ఏ జీవన విధానాన్ని ఎంచుకున్నారు..? అనేది ఊర్వశివో రాక్షసివో మిగిలిన కథనం.

Urvasivo-Rakshasivo-Review

శ్రీగా అల్లు శిరీష్ పాత్రను చాలా బాగా చూపించాడు. అతని కామిక్ టైమింగ్ స్క్రీన్‌పై బెస్ట్‌గా నిలుస్తుంది. శిరీష్ అన్ని కామెడీ సన్నివేశాల్లో కనిపిస్తాడు. శిరీష్, ఒక మధ్యతరగతి వ్యక్తిగాకనిపించాడు. అను ఇమ్మాన్యుయేల్‌ను ఆకట్టుకోవడానికి అతని ప్రయత్నాలు భలే సరదాగా ఉంటాయి.

సింధుగా అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ – కెమిస్ట్రీ రెండింటినీ పర్ఫెక్షన్‌గా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా శిరీష్‌తో రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె సినిమా మొత్తం చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా కనిపిస్తుంది. వెన్నెల కిషోర్,సునీల్ చాలా ఆకట్టుకున్నారు. వీరి సంభాషణ లతో నవ్వుల పువ్వులను పూయిస్తారు.

హైలైట్స్ :


రాకేష్ శశి రచన సినిమాకు ప్రధాన బలం. ఊర్వశివో రాక్షసివో అనేది లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల చుట్టూ తిరిగే ఒక రొమాంటిక్ సినిమా. ఈ చిత్రంలో అనేక వినోదభరితమైన సన్నివేశాలు ఉన్నాయి, కథతోపాటు మంచి ఆసక్తికరమైన సన్నివేశాలను రాకేష్ తీర్చి దిద్దారు. ముఖ్యంగా నేటితరం యువతను లక్ష్యంగా చేసుకుని చేసిన పలు సీన్స్ అదిరిపోయాయి. రాకేష్ శశి తన మేకింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు.

ప్లస్ పాయింట్స్ ..


అచ్చు రాజమణి కొన్ని చక్కటి బాణీలు సమకూర్చారు. సిద్ శ్రీరామ్ స్వరంతో ధీమ్తాననా మెలోడీసాంగ్ అద్భుతంగా ఉంది. ఆకట్టుకునే విజువల్స్‌ కూడా చాలా బాగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. యువతకు మంచి మెసేజ్ ఇవ్వాలనే లక్ష్యంతో రూపొందిన ఈ సినిమా అందరినీ అలరిస్తుంది.

Urvasivo-Rakshasivo-Review

ఊర్వశివో రాక్షసివో సినిమా తారాగణం:అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, సునీల్ , రచయిత- దర్శకుడు – రాకేష్ శశి. నిర్మాణ సంస్థలు – GA2 పిక్చర్స్ అండ్ శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సంగీత దర్శకుడు – అచ్చు రాజమణి.