Sat. Apr 20th, 2024
ajay-banga

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 23,2023: ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా అజయ్ బంగాను నియమించారు. ఆయన్నుఅమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నామినేట్ చేశారు. అజయ్ బంగా మాస్టర్ కార్డ్ కు గతంలో సీఈవోగా పనిచేశారు.

ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడిగా మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా నియమితులయ్యారు. ఈ మేరకు వైట్‌హౌస్‌ సమాచారం ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగాను అమెరికాఅధ్యక్షుడు జో బిడెన్ నామినేట్ చేశారు.

ajay-banga

ఈ విషయాన్ని వైట్ హౌస్ తెలిపింది. గత వారం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు గా ఉన్న డేవిడ్ మాల్పాస్ తన పదవికి రాజీనామా చేశారు. దీని తర్వాత, త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయవచ్చని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కొత్త అధ్యక్షుడి నియామకంపై జో బిడెన్ మాట్లాడుతూ అజయ్ బంగా ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించే సమర్థుడని అన్నారు. 2016లో అజయ్ బంగాకు పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయనకు 63 ఏళ్లు. కాగా అజయ్ బంగా ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు.