Wed. May 31st, 2023
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 21,2023:ఆదిపురుష్ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీరాముడుగా ప్రభాస్, సీతగా కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలలో నటించారు. ఈ చిత్రంలోని కొత్త పాట ‘జై శ్రీ రామ్ రాజా రామ్’ విడుదలైన కొన్ని గంటల్లోనే అందర్నీ ఆకట్టుకుంది.

ఈ పాటను అజయ్-అతుల్ స్వరపరిచారు. ఈ పాటలో శ్రీరాముడి అవతారంలో ప్రభాస్ కనిపించాడు. ఈ పాట మనోజ్ ముంతాషిర్ రాశారు. ఈ పాటను లైవ్ ఆర్కెస్ట్రాతో విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో గత 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన వీడియోగా మారింది.

అజయ్-అతుల్ మాట్లాడుతూ..” పాటను లాంచ్ చేస్తున్న సమయంలో తాము ఒక అద్భుత శక్తిని అనుభవించామని చెప్పారు. ఇప్పుడు ఈ పాట గత 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించారు. గణాంకాల ప్రకారం, ఆదిపురుష్ చిత్రానికి 2,62,91,237 వీక్షణలు, 4,84,186 లైక్‌లు వచ్చాయి. ఇది అక్షయ్ కుమార్ పాట క్యా లోగ్ తుమ్ కో పచ్చడ్ దియాను అధిగమించింది.