Thu. Dec 1st, 2022
kamal-watch-co
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్18,2022: హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కమల్‌ వాచ్‌ కో మరో అడుగువేసింది. అత్తాపూర్‌లో కమల్‌వాచ్‌ కో 47వ స్టోర్‌ ను లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి మన్నారా చోప్రా, రితిక చక్రవర్తి, కష్రాఫ్‌ హాజరై నూతన షోరూంను లాంఛనంగా ప్రారంభించారు.

అత్యున్నత నాణ్యత కలిగిన టైమ్‌ పీసెస్‌ను ఎంచుకోవడంలో నగరవాసులకు సహాయపడుతుంది. దాదాపు 5వేలకు పైగా విభిన్న మోడల్స్‌ డిస్‌ప్లే కలిగిన కలిగిన కమల్‌ వాచ్‌ కో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వాచ్‌ డీలర్లలో ఒకటిగా వెలుగొందుతోంది. లగ్జరీ వాచ్‌ల కొనుగోలు, రిపేర్ సేవలను అందిస్తోంది కమల్‌ వాచ్‌ కో.

kamal-watch-co

హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో 1969లో కుటుంబ వ్యాపారంగా తమ కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ, ఖచ్చితత్త్వం, మెరుగైన సేవల ద్వారా నగర వాసులను ఆకట్టుకొగిలింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కమల్‌ వాచ్‌ కో సంస్థకు 46 షోరూమ్‌లు ఉన్నాయి. దాదాపు 50ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులు వాచ్‌ల ఎంపికలో వినియోగదారులకు ఇక్కడ సహాయపడగలరు.

అన్ని స్థాయిల్లోనూ నమ్మకం, మెరుగైన సేవల ద్వారా వినియోగ దారులకు సేవలుఅందిస్తూ మహోన్నతమైన అనుభవాలను అందిస్తుంది. కమల్‌ వాచ్‌ కంపెనీ దాదాపు 70కు పైగా ప్రతిష్టాత్మక వాచ్‌ బ్రాండ్‌లకు నిలయంగా ఉంది. ప్రీమియం స్విస్‌ టైమ్‌ పీస్‌లు, వింటేజ్‌ ఎనలాగ్‌ వాచ్‌లు, సమకాలీన డిజిటల్‌ వాచ్‌లు , విప్లవాత్మక స్మార్ట్‌వాచ్‌లను కమల్‌ వాచ్‌ కో అందిస్తోంది.

kamal-watch-co

అంతేకాదు రోలెక్స్‌, ఒమెగా, రాడో, లాంజిన్స్‌, టాగ్‌ హ్యుర్‌, టిస్సో, సీకో, అర్మానీ ఎక్సేంజ్‌, మైఖేల్‌ కోర్స్‌, ఫోసిల్‌, ఎంపొరియో అర్మానీ, టామీ హిల్‌ఫిగర్‌ మొదలైన బ్రాండ్ల వాచ్‌లు ఇక్కడ లభ్యమవుతాయి. ప్రతి వాచ్‌ బ్రాండ్‌ వారెంటీతో పాటుగా కమల్‌ వాచ్‌ కంపెనీ భరోసా ఇస్తుంది.