Oorjha Cafe | ఊర్ఝా కేఫ్‌ ప్రారంభించిన న‌టుడు శివ‌బాలాజీ..

Business Celebrity Life Featured Posts food news Life Style National Recipes Top Stories Trending
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 26, 2021: ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారానికి చిరునామా అయిన ఊర్ఝా కేఫ్, క‌స్ట‌మ‌ర్ల‌కు మరిన్నిసేవలు అందించేందుకు హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ న‌టుడు, బిగ్ బాస్-1 విజేత శివ‌బాలాజీ ఈ కేఫ్ ను ప్రారంభించారు. మిస్టిక్ వెల్‌నెస్ ఇంట‌ర్నేష‌న‌ల్ (ప్రైవేట్) లిమిటెడ్ వారు దీన్ని మొద‌లుపెట్టారు. ఇటాలియ‌న్, మెడిట‌రేనియ‌న్, ఆసియా వంటి రుచుల‌తో కూడిన రుచిక‌ర‌మైన ఆహారం ఊర్ఝా కేఫ్‌లో అందుబాటులో ఉంది. వీటిలో సూప్‌లు, స‌లాడ్లు, సాండ్‌విచ్‌లు, పాస్తా, సిజ్ల‌ర్లు, బ‌ర్గ‌ర్లు, ప‌వ‌ర్‌-ప్యాక్డ్ భోజ‌నాలు అన్నీ ఉంటాయి. ఇవ‌న్నీ న‌మ్మ‌లేనంత అద్భుత‌మైన రుచుల‌తో ల‌భిస్తాయి. వీటికితోడు మ‌న‌సును ఉల్లాస‌ప‌రిచే ఎసార్టెడ్ గ్రీన్ టీ కూడా ఉంటుంది. ఊర్ఝా కేఫ్ మేనేజింగ్ పార్ట‌న‌ర్ పృథ్వీరాజ్, రానా టీఎంటీ ఎండీ సునీల్ త‌దిత‌రులు ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

కేఫ్ ప్రారంభం సంద‌ర్భంగా ఊర్ఝా కేఫ్ హెడ్ షెఫ్ కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ, “మ‌నిషి ఆరోగ్య‌వంతంగా ఉండేందుకు తోడ్ప‌డే పోష‌కాల‌ను అందించి, త‌ద్వారా శక్తినిచ్చేవే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారప‌దార్థాలు. నీళ్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రోటీన్, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ లాంటివి ఆరోగ్య‌క‌ర‌మైన‌, స‌మ‌తుల ఆహారానికి కీల‌క ప‌దార్థాలు. ఊర్ఝా కేఫ్‌లో వండి, వ‌డ్డించే ప‌దార్థాల్లో మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండ‌టానికి కావ‌ల్సిన పోష‌క‌ప‌దార్థాలు అన్నీ ఉంటాయి” అని తెలిపారు.

ఊర్ఝాకేఫ్‌.. ఓపెన్ ఎయిర్ కేఫ్‌లో ఇక్క‌డ మంచి రుచిక‌ర‌మైన ఆహారాన్ని ఆస్వాదించ‌గ‌ల‌రు. అన్నింటికంటే ముఖ్యంగా, చాలా ప్ర‌శాంతవాతావరణంలో ఇక్క‌డే ప‌ని కూడా చేసుకోవ‌చ్చు” అని ఆయ‌న వివ‌రించారు. ఆరోగ్యం, అందంతోపాటు మంచి రుచి కావాల‌నుకునేవారి కోసం ఆహార ప‌దార్థాలు త‌యారుచేయ‌డంలో కిష‌న్ రెడ్డికి అపార అనుభ‌వం, నైపుణ్యం ఉన్నాయి. కస్ట‌మ‌ర్ల కోసం ప్రారంభ‌మైన ఊర్ఝా కేఫ్‌లోనే ఒక డైటీషియ‌న్ కూడా ఉన్నారు. క‌స్ట‌మ‌ర్ల శ‌రీర‌తత్వం, వారి అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏం తినాలో చెబుతారు. ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌ర‌మైన డైట్ భోజ‌నం, కార్బోహైడ్రేట్లు త‌క్కువ‌గా ఉండే భోజ‌నం, ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే అథ్లెటిక్ భోజ‌నం, కీటో డైట్ భోజ‌నం, బ‌రువు త‌గ్గ‌డానికి విభిన్న‌మైన ద్ర‌వాహార ప్ర‌ణాళిక‌లు.. ఇలా చాలా ఇక్క‌డ ఉంటాయి.