Thu. Mar 28th, 2024
arrest

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ ,నవంబర్ 12,2022: నవంబర్ 10వ తేదీ రాత్రి సమయంలో న్యూ ఆర్.ఆర్.పేట కు చెందిన కోపురి దేవదాసు అను వ్యక్తి భవానిపురం పోలీస్ స్టేషన్ కు వచ్చి తన కుమారుడు కోపురి రమేష్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు భవానిపురం అవుట్ ఏజెన్సీ, హరిజనవాడ లోని ఒక ఇంటిలో హత్య చేసి చంపినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన భవానిపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా సూచనల మేరకు పశ్చిమ ఏ.సి.పి. డా.కె.హనుమంత రావు పర్యవేక్షణలో భవానిపురం ఇనస్పెక్టర్ ఉమర్ వారి సిబ్బందితో పలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానితులపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలకు అందిన సమాచారం మేరకు భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పున్నమిఘాట్ ఏరియాలో అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు.

arrest

నిందితులు:

  1. విజయవాడ, భవానీపురం, ప్రియదర్శని కాలనీ, కి చెందిన గుంటూరు ప్రవీణ్ (25 సం.)
  2. విజయవాడ, భవానీపురం, ప్రియదర్శని కాలనీ, కి చెందిన గంటా సాయి కిరణ్ రెడ్డి, @ నరేష్, (24 సం.)
  3. విజయవాడ, భవానీపురం, అవుట్ ఏజెన్సీ కి చెందిన సుంకర గౌతమ్ @ చినబాబు, (24 సం.)
  4. విజయవాడ, జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ కి చెందిన యర్రాస్వామి సువర్ణ రాజు, @ ప్రసన్న (23సం.)
  5. విజయవాడ, భవానీపురం, హరిజనవాడ కి చెందిన కొమ్ము జోసెఫ్(45 సం.)

విచారణలో హతుడు కోపురి రమేష్ గత 6 నెలలుగా తన భార్యతో ఉన్న మనస్పర్ధల కారణం గా భార్యను వదలి అజిత్ సింగ్ నగర్ లో తన తల్లి తండ్రుల వద్ద ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. గత కొన్ని నెలలుగా ఈ కేసులో ప్రధాన నిందుతుడు అయిన గుంటూరు ప్రవీణ్ కుమార్ తో సన్నిహితం గా ఉంటూ ఇద్దరు కలిసి మెలిసి ఉంటున్నాడు.

అదేవిధంగా ది 07.11.2022 తేది ఉదయం కోపురి రమేష్ సింగ్ నగర్ నుండి తన ఇంటిదగ్గర నుంచిబయలు దేరి అక్కడక్కడ తిరిగి రాత్రి 8 గంటలకు భవానిపురం హరిజనవాడ లోని గుంటూరు ప్రవీణ్ ఇంటికి వచినట్లు అప్పటికే అక్కడ గుంటూరు ప్రవీణ్ తన స్నేహితులు అయిన గంటా సాయి కిరణ్ రెడ్డి @ నరేష్, సుంకర గౌతమ్ @ చిన్నబాబు, యరసాని సువర్ణ రాజు @ ప్రసన్న, కొమ్ము జోసెఫ్ కొంతమంది ఉన్నారు.

arrest

హతుడు రమేష్ వచ్చిన తరువాత వారందరూ కలిసి మాట్లాడుకొనే సమయంలో రమేష్, ప్రవీణ్ తల్లిని అసభ్య కరమైన రీతిలో తిట్టిగా..ఇరువురు గొడవ పడ్డారు ఆసమయంలో మధ్యలో సర్ది చెప్పడానికి వెళ్ళిన ప్రవీణ్ స్నేహితులను కూడా రమేష్ తిట్టాడు. అప్పుడు ప్రవీణ్ రమేష్ ను కర్రతో, చేతులతో కొట్టాడు. అక్కడే ఉన్న ప్రవీణ్ స్నేహితులు కుడా ప్రవీణ్ కు సహకరించారు.

ప్రవీణ్,అతని స్నేహితులు కొట్టిన దెబ్బలకు రమేష్ మరణించాడు. అనంతరం ప్రవీణ్ రమేష్ బాడీని రెండు రోజులపాటు తన ఇంటిలోనే వుంచాడు.ఈ క్రమం లో నిందితులను ఈ రోజు పున్నమిఘాట్ ఏరియాలో అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు.