Thu. Apr 18th, 2024
91 Springboard Startup Agreement with Google
91 Springboard Startup Agreement with Google
91 Springboard Startup Agreement with Google

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ 6 జూన్,2021: 91స్ప్రింగ్‌బోర్డ్, భారతదేశ మార్గదర్శక సహోద్యోగ సంఘం, ‘స్టార్టప్ స్ప్రింట్’ ప్రారంభించటానికి గూగుల్ ఫర్ స్టార్టప్స్ (GfS) తో భాగస్వామ్యం చేసుకుంది.ఈ వర్చువల్ ప్రోగ్రామ్ ఆధునిక డిజిటల్ బిజినెస్ టూల్స్ ను నేర్చుకోవడంలో సహాయపడటం ద్వారా భారతదేశంలోని వివిధ స్టార్టప్‌లకు ,వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్‌లో వారి వ్యాపారాలను వృద్దిచేయడానికి విస్తరించడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఎక్కువ మంది ప్రజలు ఆన్‌లైన్‌లో సమయం గడపడం ద్వారా డిజిటల్ ఎకానమీ వృద్ధితో, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా స్టార్టప్‌లకు సహాయపడటం ఈ చొరవ లక్ష్యం.

91 Springboard Startup Agreement with Google
91 Springboard Startup Agreement with Google

వ్యాపారవేత్తలు , ఆధునిక స్టార్టప్‌లు స్టార్టప్ స్ప్రింట్ ద్వారా, వివిధ నాలెడ్జ్-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లను, నూతన సాంకేతిక నైపుణ్యాలను , మార్గదర్శకత్వాన్ని పొందగలవు. ఇది వారి వ్యాపారాలను క్రమబద్ధీకరించడానికి, క్రొత్త ప్రణాళికలను రూపొందించడానికి , డిజిటల్ టూల్స్ ,ఛానెల్‌లను ఉపయోగించి అభివృద్ధి చెందుతున్న కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడుతుంది.ఇది 18 జూన్ నుంచి ప్రారంభామ కానున్నది, ఇందులో భాగంగా స్టార్టప్‌ల కొరకు 91స్ప్రింగ్‌బోర్డ్, గూగుల్‌ సహకారంతో ఎంచుకున్న పరిశ్రమ నిపుణుల ద్వారా వర్క్‌షాప్‌లు, రౌండ్‌టేబుల్ చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్ల శ్రేణిని నిర్వహిస్తుంది.

91స్ప్రింగ్‌బోర్డ్ సీఈఓ ఆనంద్ వేమూరి ఇలా అన్నారు, ‘’ మా యువ వ్యాపారవేత్తలు , కొత్త వ్యాపార వర్గాల కోసం భారతదేశంలో స్టార్టప్ స్ప్రింట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. 91స్ప్రింగ్‌బోర్డ్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడంలో , సమృద్దిగా వున్న అభ్యాస అవకాశాల ద్వారా దాని వృద్ధిని పెంపొందించడాన్ని విశ్వసిస్తుంది. స్టార్టప్‌ల కోసం గూగుల్‌తో ఈ భాగస్వామ్యం స్టార్టప్‌లు , వ్యాపారాలు డిజిటల్‌లోకి మారడం ద్వారా వారి కార్యకలాపాలను అనుకూలపరుచుకోవడానికి అనుమతిస్తుంది. రీబూట్ చేయడానికి, కొనసాగించడానికి , వారి వెంచర్లను వృద్ది చెందించడానికి నిబద్దత గల పరిశ్రమ ప్రముఖుల నుంచి విలువైన సలహాలతో ఈ మహమ్మారి సమయంలో వ్యాపారాలు కొనసాగించడానికి మేము సహాయం చేస్తున్నాము. ”

“కోవిడ్-19 మహమ్మారి మన జీవితాన్ని తీవ్రంగా మార్చివేసింది. భారతదేశంలో ,ప్రపంచవ్యాప్తంగా, వ్యవస్థాపకులు కొత్త ,ఊహించని సవాళ్లను పరిష్కరించడానికి – వారు ఎప్పటిలాగే చురుకుదనం, వినూత్న సాంకేతికతతో, ధృడంగా ముందుకు కొనసాగుతున్నారు. వృద్ధి చెందుతున్న స్టార్టప్‌ను మరింత అభివృద్ధి చేయడానికి అధిక సహాయం అవసరం” అని APAC, స్టార్టప్స్ గూగుల్ హెడ్ మైఖేల్ కిమ్ వ్యాఖ్యానించారు. “భారతదేశం స్టార్టప్‌లు వృద్ధి చెందుతున్నాయని , వేగంగా మారుతున్న ప్రస్తుత వ్యాపార వాతావరణానికి అనుగుణంగా మారేలా చేసే ఈ ప్రయత్నంలో 91స్పింగ్‌బోర్డ్‌తో భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషంగా వుంది. స్టార్టప్‌లు విజయవంతం అయినప్పుడు, మన సమాజం,ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రయత్నాలకు గూగుల్ అడుగడుగునా మద్దతును అందిస్తుందని మేము తెలియజేస్తున్నాము. ”
కార్యక్రమ వివరాలు
Interested startup/Entrepreneurs can apply online: http://bit.ly/gfsstartupsprint
ప్రారంభ తేదీ: 18 జూన్ నుంచి
ప్రవేశం: అందరికి ఆహ్వానం…