365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,మే 6,2021: కోవిడ్ మీద పొరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధినిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా టీకాల మీద ప్రత్యేక దృష్టిసారించింది.

మే 1వ తేదీ నుంచి మూడో దశ వేగవంతం చేయటం మొదలైంది. అర్హులైన కొత్త వయోవర్గపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 28న ప్రారంభంకాగా కోవిన్ పోర్టల్ (cowin.gov.in) లోను, ఆరోగ్య సేతు యాప్ ద్వారా నమోదవుతున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు దాదాపు 17.02 కోట్ల (17,02,42,410) కోవిడ్ డోసులు

ఉచితంగా అందజేసింది. ఇందులో రాష్ట్రాల వాడకం, వృధా కలిపి 16,07,94,796 డోసులు ఉన్నట్టు ఈ ఉదయం 8 గంటల వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రాష్ట్రాల దగ్గర ఇంకా 94.47 లక్షల (94,47,614) టీకా డోసులు అందుబాటులో ఉండగా మరో 36 లక్షల (36,37,030) టీకా డోసులు వచ్చే 3 రోజుల్లో కేంద్రం పంపనున్నది.

India’s Cumulative Vaccination Coverage exceeds 16.24 Cr doses
India’s Cumulative Vaccination Coverage exceeds 16.24 Cr doses