365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్, జనవరి 21, 2021: బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా కు దరఖాస్తు గడువును 2021 జనవరి 25 నుంచి 2021 ఫిబ్రవరి 8 వరకు  రెండు వారాల పాటు బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్ టీఏ) పొడిగించింది.నెట్ ఫ్లిక్స్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా దరఖాస్తుల వెల్లువను సృష్టించింది. దీంతో దర ఖాస్తుల తుదిగడువును రెండు వారాల పాటు పొడిగించక తప్పలేదు. బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా అనేది భారత్ లోకి బీఏఎఫ్ టీఏ రాకకు సంకేతంగా నిలుస్తుంది. సినిమా, గేమ్స్, టెలివిజన్ లలో యూకే, యూఎస్ ఏ, చైనాలకు తోడుగా రాబోయే తరాల నుంచి ప్రతిభావంతుల ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా వారిని తీర్చి దిద్దుతుంది.ప్రముఖ సంగీత దర్శకుడు, బీఏఎఫ్ టీఏ ప్రచారకర్త ఏ.ఆర్ రెహమాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా కు దేశవ్యాప్తంగా లభిస్తున్న స్పందన నాకెంతో గర్వకారణం. దేశం నలుమూలల నుం చి మేం దరఖాస్తులు స్వీకరించాం. దేశం నలుచెరుగులా ప్రతిభను కనుక్కోవచ్చునని ఇది నిరూపిస్తోంది. దర ఖాస్తుల దాఖలుకు తుదిగడువును బీఏఎఫ్ టీఏ ఫిబ్రవరి 8 సోమవారం దాకా పెంచడం నాకెంతో ఆనందం కలి గిస్తోంది. సినిమా, గేమ్స్, టెలివిజన్ లలో ప్రతిభావంతులైన భారతీయులు దీంతో ప్రమేయం కలిగిఉండేలా, త మ దరఖాస్తులను సమర్పించేలా వారిని నేను ప్రోత్సహిస్తున్నాను. ఇది వారి జీవితాలను మార్చివేసే అవకా శం’’ అని అన్నారు.

BAFTA Breakthrough India announces two week deadline extension, following surge of nationwide applications
BAFTA Breakthrough India announces two week deadline extension, following surge of nationwide applications

 ‘‘బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ అనేది ఎంతగానో విజయవంతమైన బ్రేక్ త్రూ కార్యక్రమానికి అంతర్జాతీయ వెర్షన్. యూకే లో ఇది 2013 నుంచి నిర్వహించబడుతోంది. చైనాలో ఇది 2019లో ప్రారంభమైంది.  అమెరికా, భారత్ లలో 2020 లో ప్రారంభమైంది. ఇప్పటి వరకూ 160 మంది వర్ధమాన కళాకారులకు ఇది అండగా నిలిచింది. ఈ దేశాల్లో సినిమా, గేమ్స్, టెలివిజన్ లలో ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహిస్తోంది,ఆ దేశాల మద్య కల్చరల్ ఎక్స్ ఛేంజ్ కు అవకాశం కల్పిస్తోంది,  ఇక ఇప్పుడు భారత్ లో కూడా.   టామ్ హాలండ్, లెటిటియా రైట్, ఫ్లోరెన్స్ పగ్, జెస్సీ బక్లే, జోష్ ఒ కొనర్, కలుమ్ టర్నర్ వంటి వ్యక్తులు ఈ కా ర్యక్రమానికి అండగా నిలిచారు. ఇటీవలి కాలంలో నటులు ఒలివా కోల్ మాన్, టిల్డా స్వింటన్, నటుడు, నిర్మా త బ్రాడ్ పిట్, దర్శకులు టామ్ హార్పర్, బారీ జెన్ కిన్స్, గేమ్ డిజైనర్లు బ్రెండా రొమెరొ, టిమ్ షాఫెర్, నటు లు, రచయితలు షరాన్ హార్గన్, అమీ షుమెర్ సైతం ఈ కార్యక్రమానికి ఇటీవలి కాలంలో అండగా నిలిచారు.

BAFTA Breakthrough India announces two week deadline extension, following surge of nationwide applications
BAFTA Breakthrough India announces two week deadline extension, following surge of nationwide applications

బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ ఇండియా లో కింద ఎంపికైన వారు ఏడాది కాలం మెంటరింగ్, గైడెన్స్ కార్యక్రమం లో పా ల్గొనే అవకాశం పొందుతారు. ఎంపికైన వారు వన్ టు వన్ మెంటరింగ్, గ్లోబల్ నెట్ వర్కింగ్ అవకాశాలను పొం దగలుగుతారు. బీఏఎఫ్ టీఏ కార్యక్రమాలకు, స్ర్కీనింగ్ లకు 12 నెలల పాటు ఉచిత యాక్సెస్ ఉంటుంది. పూ ర్తిస్థాయి వోటింగ్ బీఏఎఫ్ టీఏ సభ్యత్యం ఉంటుంది. ఎంపికైన ప్రతిభావంతులు బ్రిటిష్, భారతీయ పరిశ్రమ ల్లోని కొంత మంది ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశాలను, ప్రపంచవ్యాప్తంగా తమ లాంటి వారితో తమ నైపు ణ్యాలను పంచుకునే అవకాశాలను పొందుతారు. భౌగోళిక సరిహద్దులకు అతీతంగా అవకాశాలను పొందగలు గుతారు. బీఏఎఫ్ టీఏ బ్రేక్ త్రూ కళాకారులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయబడుతారు.దరఖాస్తు చేసుకునేందుకు www.bafta.org/supporting-talent/breakthrough/bafta-breakthrough-india చూడగలరు.దరఖాస్తు దాఖలు నాటికి దరఖాస్తుదారులు 18 ఏళ్ళకు పైబడిన వయస్సు కలిగిఉండాలి. భారతదేశంలో కనీ సం 2 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలి. ఇంగ్లీషులో మాట్లాడడంలో ప్రావీణ్యం ఉండాలి. సినిమా, గేమ్స్, టీవీలలో భి న్న సంస్కృతుల మధ్య సంబంధాలను పెంచాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంలో అభ్యర్థులు త మ నైపుణ్యాలను యూకే వారితో పంచుకోవాలి లేదా యూకే వీక్షకుల కోసం కంటెంట్ ను రూపొందించాలి.