బెంగళూరు, జనవరి 11,2021 ః భారతదేశంలో అతిపెద్ద అభ్యాస వేదిక యుఎన్‌ అకాడమీ నేడు, దేశంలో గేట్‌ పరీక్ష విద్యావేత్తలలో సుప్రసిద్ధులైన రవీంద్రబాబు రావులను తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేకంగా బోధించేందుకు ఒప్పందం చేసుకుంది.భారతదేశంలో గేట్‌ పరీక్ష కోసం ఎక్కువ మంది కోరుకునే విద్యావేత్తలలో ఒకరు రవీంద్రబాబు రావుల. టాప్‌ ర్యాంకర్లను సృష్టించిన  అద్భుతమైన ట్రాక్‌  రికార్డు ఆయన సొంతం. ప్రతి సంవత్సరం గేట్‌ పరీక్షలలో టాప్‌1000 మంది ర్యాంకర్లలో కనీసం 300 మంది ఈయన విద్యార్థులే ఉంటారు.ఆయన యూట్యూబ్‌ ఛానెల్‌కు 6లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. తద్వారా భారతదేశంలో గేట్‌ పరీక్షల కోసం అతిపెద్ద యూట్యూబ్‌ ఛానెల్‌గా నిలిచింది.యుఎన్‌ అకాడమీలో చేరిన తరువాత ఈ అనుభవజ్ఞులైన విద్యావేత్తతో తొలి సదస్సు జనవరి 10, ఆదివారం యూట్యూబ్‌పై జరిగింది. దీనికి అపూర్వమైన స్పందన వచ్చింది.ఇకనుంచి  ఔత్సాహికులు జనవరి 14, గురువారం నుంచి యుఎన్‌ అకాడమీ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేకంగా రావుల ,ఉచిత లెక్చర్స్‌కు హాజరుకావొచ్చు,జనవరి 18 నుంచి ప్లస్‌ కోర్సులకు హాజరుకావొచ్చు. ఈ భాగస్వామ్యం గేట్‌ ,ఈఎస్‌ఈ విభాగంలో యుఎన్‌ అకాడమీ నాయకత్వ స్థానం బలోపేతం చేయడంతో పాటుగా టెస్ట్‌ ప్రిపరేషన్‌ మార్కెట్‌లోనూ యుఎన్‌ అకాడమీ స్ధానాన్ని బలోపేతం చేయనుంది.

India’s Leading GATE Exam Educator Joins Unacademy
India’s Leading GATE Exam Educator Joins Unacademy

‘‘భారతదేశంలో విద్యను ప్రజాస్వామ్యీకరించాలనేది మా లక్ష్యం. దీనిలో భాగంగా అత్యుత్తమ విద్యావేత్తలను మా అభ్యాసకులకు అందుబాటులో ఉంచుతామనే భరోసా అందిస్తున్నాం. పలు పరీక్షా విభాగాల వ్యాప్తంగా, తమ రంగాలలో అసాధారణ ప్రభావం చూపిన విద్యావేత్తలతో భాగస్వామ్యాల చేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అభ్యాసకులందరికీ అందుబాటులో విద్యను అందించాలనే మా లక్ష్యాలను ఈ విద్యావేత్తలు ప్రతిఫలిస్తుంటారు. రవీంద్రబాబు కూడా ఈ తరహా విద్యావేత్తలలో ఒకరు. గేట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆయనమెరుగైన బోధన అందిస్తున్నారు. ఆయనను యుఎన్‌ అకాడమీపై స్వాగతించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని రోమన్‌ సైనీ, కో–ఫౌండర్‌, యుఎన్‌ అకాడమీ అన్నారు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన రవీంద్రబాబు,  ప్రతి సంవత్సరం అత్యంత పోటీ కలిగిన గేట్‌ పరీక్షలలో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తోన్న 10వేల మందికి పైగా విద్యార్థులకు బోధన చేశారు. వీరిలో 3వేల మందికి పైగా టాప్‌ ర్యాంక్‌ హోల్డర్లు ఉన్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్‌ డిగ్రీ చేసిన ఆయన రెండు సందర్భాలలో గేట్‌ పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. తన పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ తరువాత కార్పోరేట్‌ సంస్థలో కొన్నాళ్లు పనిచేసిన ఆయన తన అభిరుచి మేరకు బోధనా వృత్తిలోకి రావడంతో ఆటుగా రౌద్ర ఎడ్యుసర్వీసెస్‌ను ప్రారంభించారు. గేట్‌ పరీక్షల సంసిద్ధత కోసం సుప్రసిద్ధ వేదికగా ఇది నిలిచింది.

India’s Leading GATE Exam Educator Joins Unacademy
India’s Leading GATE Exam Educator Joins Unacademy

‘‘మనం అభ్యసిస్తోన్న విధానాన్ని సాంకేతికత సమూలంగా మార్చింది,విద్యను అందుబాటులో ప్రతి ఒక్కరికీ చేరువ కూడా చేసింది. నేడు ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌ సైన్స్‌ బేసిక్స్‌ నేర్చుకోవచ్చు,తమ సొంత కంపెనీలు ఆరంభించడానికి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను వినియోగించుకోవచ్చు. ఓ విద్యావేత్తగా, నేను ఔత్సాహికుల కోరికలను తీర్చడంలో సహాయపడాలనుకున్నాను. యుఎన్‌ అకాడమీలో భాగం కావడం ద్వారా, వేలాది మంది విద్యార్ధుల కలలను సాకారం చేయడంలో సహాయపడగలను’’ అని రవీంద్రబాబు రావుల, ఫౌండర్‌ అండ్‌ చీఫ్‌ ఎడ్యుకేటర్‌, రౌద్ర ఎడ్యుసర్వీసెస్‌ అన్నారు.గేట్‌ , ఈఎస్‌ఈ పై ఔత్సాహికుల కోసం 10600 కోర్సులను యుఎన్‌ అకాడమీ అందిస్తుంది. కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, కెమికల్‌  విభాగాలలో ఈ కోర్సులు ఉంటాయి. ఈ ప్లాట్‌ఫామ్‌పై యుఎన్‌అకాడమీ కంబాట్‌ సైతం పరిచయం చేశారు. ఇది భారతదేశపు అతిపెద్ద కాంపిటీటీవ్‌ గేమిఫైడ్‌ పోటీ. దీనిలో గేట్‌, ఈఎస్‌ఈ ఔత్సాహికులు ప్రతి పక్షమూ వేలాది మంది అభ్యాసకులతో పోటీపడే అవకాశం కలుగుతుంది.