365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ : సెప్టెంబర్ 17, 2020: ప్రముఖ మానవతావాది సంస్థ సీడ్స్, హనీవెల్ తో భాగస్వామ్యం చేసి,  కరోనా మహమ్మారితో ప్రభావితమైన తొమ్మిది నగరాలలోని ప్రజలకు 10.7 మిలియన్ ఆహార పదార్థాలు అందజేసే ఫుడ్ కిట్స్ పంపిణీ చేసింది. వీరిలోరోజువారీ వలస కూలీలు, కాంట్రాక్ట్ వర్కర్లు,లాక్ డౌన్ కారణంగా స్థాన మార్పిడి కలిగిన ప్రవాస కార్మికులు ఉన్నారు.ఫేజ్-1 డిస్ట్రిబూషన్ ఉద్యమంలో అయిదు నగరాలకు సుమారు 3.7 మిలియన్ల ఆహార ప్యాకెట్లు అందజేయబడినవి. ఫేజ్-2 లో, భాగస్వామ్య లక్షం అదనపు 7 మిలియన్ల మీల్స్ తౌమ్మిది నగరాలకు అందజేయుట,ఆ నగరాలు: ఢిల్లీ, గురుగ్రామ్, బెగుళూరు, పుణె, మదురై, హరిద్వార్, డెహరాడూన్, చెన్నై, మరియు హైదరాబాద్. మొత్తం మీద ఈ మల్టీసిటీ అందుబాటు ద్వారా ప్రయోజనం అందుకునేవారు 1.78 లక్షల మంది.దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభంలో, స్థానచలనం,సదుపాయాలు లేని వారికి అత్యధికసహకారం అందుతూ ఉండేది. దేశం మళ్లీ పునరుజ్జీవనంపొంది, తిరిగి ప్రారంభం కావటంతో ఈ సహకారాలు తగ్గిపోయాయి.అయినప్పటికి,అనేక మంది ముఖ్యంగా వలసకూలీలు పనులు లేక,దాచుకున్న పొదుపు ధనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఎజ్ దాని రహమాన్, ప్రొగ్రామ్స్ చీఫ్, సీడ్స్ ఇలా అన్నారు, “కోవిడ్-19 మహమ్మారి ప్రారంభం అయిన తరుణం నుంచి అవసరాలకు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నవారికి సహకరించటానికి సీడ్స్ వద్ద మేము ఎల్లప్పుడు  సిద్ధంగా ఉన్నాము. సంక్లిష్టత మరింత పెరుగుతున్న ఈ తరుణంలో, జీవించటానికి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ,ఇలా ఛాలెంజ్ తో పోరాటం చేస్తున్నవారికి అండదండగా ఉండుటకు మేము దృఢంగా ఉన్నాము. హనీవెల్ నుండి అందుతున్న సహకారంతో మేము మా రెండవ ఫేజ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా, ఇంతకు ముందుహకారం అందించిన దాని కంటె ఎక్కువగా సంబంధిత ఫ్యామిలీలకు సహకారం అందించుటకు మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రతి ఫుడ్ కిట్ లో బియ్యం, గోధుమ పిండి. పంచదార, పప్పులు, వంట నూనె,ఉప్పు ఉంటాయి.ఈ పంపిణీ ఉద్యమం మియాపూర్, చందానగర్, బొల్లారం, గౌలిదొడ్డి, పటాన్ చెరువు, గచ్చిబౌలి,ఫిల్మ్ నగర్ ప్రాంతాలలో కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.

SEEDS and Honeywell partner to provide more than 10 million meals across 9 cities
SEEDS and Honeywell partner to provide more than 10 million meals across 9 cities

శివి.సి. సజ్జనర్, కమిషనర్ ఆఫ్ పోలిస్, సైబరాబాద్ ఇలా అన్నారు, దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా, అనేక మంది స్థానచలనం కలిగిన పనివారు జీవనాధార వృత్తిని కోల్పోయారు. త్వరగా కరిగిపోతున్న పొదుపు ధనం కారణంగా వారు జీవన నిత్యాసవరాల కొరకు పోరాడుతున్నారు. హనీవెల్, వారి ఎన్.జి.ఒ భాగస్వామి సీడ్స్, రేషన్ ,ఆహారం పంపిణీ ద్వారా ప్రశంసనీయమైన పని చేస్తున్నారు. మిగతా సంస్థలు కూడా ముందుకు వచ్చి, ప్రస్తుత  మహమ్మారి పరిస్థితిలో సమాజానికి సహకారం అందించవలసిందిగా నేను వారికి విన్నవించుకుంటున్నాను ,బాధితులకు పంపిణీ ప్రక్రియలో  అవసరమైన అన్ని సాధ్యమైన సహకారాలను మేము అందించగలము.”శివకుమార్ రామచంద్రన్, సైట్ లీడర్, హనీవెల్ ఇండియా ఇలా అన్నారు, ఒక బాధ్యతాయుత కార్పొరేట్ పౌరుడిగా, దేశవ్యాప్తంగా అత్యంత ఇబ్బందులు ఎదుర్కుంటున్న అభాగ్యులకు మేము ఫుడ్ ,రేషన్ కిట్లతో ఆదుకుంటున్నాము. మేము అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని, రేషన్ పంపిణీ సమయంలో దూరాన్ని పాటిస్తున్నాము. ఈ ఇనీషియేటివ్ ద్వారా స్థానచలనం కలిగిన కార్మకులకు మేము మా సహాయం అందజేయుట కొనసాగించబోతున్నాం. సీడ్స్ రాబోయే వారాలలో  సోషల్ వాలంటీర్లు , ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ పంపిణీ ఉద్యమంలో నిమగ్నమై ఉంటుంది.