365 తెలుగు డాట్ కామ్,ఆన్లైన్ న్యూస్,బెంగ‌ళూరు,12 ఆగ‌స్టు 2020:జైనుల క్యాలెండ‌ర్ లో అతి ముఖ్య‌మైన పండుగ అయిన ప‌ర్యూష‌న్ వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ఒక ప్ర‌త్యేక డిజిట‌ల్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్టు  జైన మ‌తం మౌలిక విలువ‌ల‌ను ప్ర‌చారం చేసే లాభాపేక్ష ర‌హిత సంస్థ జైన్ ఫౌండేష‌న్ ప్ర‌క‌టించింది. జైనులు ఉప‌వాసం, ప్రార్థ‌న‌లు, ధ్యాన మార్గాల ద్వారా త‌మ‌లోని ఆధ్యాత్మిక‌త‌ను ఉద్దీపింప‌చేసుకునే ప‌విత్ర‌మైన ప‌ర్యూష‌న్ వార్షిక వేడుక‌ల సంద‌ర్భంగా 2020 ఆగ‌స్టు 15 నుంచి 22 తేదీల మ‌ధ్య‌న జైన్ ఫౌండేష‌న్ యాప్ ద్వారా ఈ కార్య‌క్ర‌మం వీక్షించ‌వ‌చ్చు.ఈ వేడుక‌లు జ‌రిగే 8 రోజులూ ఉద‌యం 7 గంట‌ల‌కు ప్ర‌త్య‌క్ష ద‌ర్శ‌నం ద్వారా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంది.9 గంట‌ల‌కు, మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు దీప‌క్ భాయ్ బార్డోలి ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మాలుంటాయి. 8.30 గంట‌ల‌కు భ‌క్తి కార్య‌క్ర‌యం, 9.45 గంట‌ల‌కు ఆర‌తి కార్య‌క్ర‌మం ఉంటాయి. అదానీ శాంతిగ్రామ్ జైన దేవాల‌యం నుంచి ఈ వేడుక‌లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతాయి.ఆర్ కె గ్రూప్ కు చెందిన దాతృత్వ సంస్థ ఆర్ కె ట్ర‌స్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు ర‌మేష్ కుమార్ షా, స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, ఔరా వ్య‌వ‌స్థాప‌కుడు,చెన్నైకి చెందిన ఎస్ పిఆర్ క‌న్ స్ర్ట‌క్ష‌న్స్ ఎజిఎం నీల్ షా మాన‌స పుత్రిక జైన్ ఫౌండేష‌న్‌. జైన మ‌త వ్య‌వ‌స్థాత్మ‌క విలువ‌ల‌ను ప్ర‌చారంలోకి తెచ్చి ప్ర‌స్తుత త‌రానికి వాటిని ఆ విలువ‌ల ఆవ‌శ్య‌క‌త తెలియ‌చేయ‌డం ఈ ఫౌండేష‌న్ ప్ర‌ధాన ల‌క్ష్యం. మూడు నెల‌ల క్రితం దాన్ని ప్రారంభించిన నాటి నుంచి జైన్ ఫౌండేష‌న్ త‌త్వ శాస్త్రం, మ‌తం, ఆచారాలు, భ‌క్తి, విద్య‌, క‌ళ‌లు, ఆర్కిటెక్చ‌ర్ వంటి విస్తార‌మైన అంశాల‌పై 60కి పైగా వెబినార్లు నిర్వ‌హించింది. 

Jain Foundation to host exclusive digital event to celebrate Paryushan
Jain Foundation to host exclusive digital event to celebrate Paryushan

తాము చేప‌ట్టిన ఈ చొర‌వ‌పై ర‌మేష్ కుమార్ షా మాట్లాడుతూ “ప్ర‌పంచంలోని భిన్న దేశాల్లో నివ‌శిస్తున్న జైనులంద‌రూ ప‌ర్యూష‌న్ వేడుక‌ల్లో పాలు పంచుకునేలా చేయ‌డానికి ఈ ప్ర‌త్యేక డిజిట‌ల్ కార్య‌క్ర‌మం మీ ముందుకు తీసుకురావ‌డం మాకెంతో ఆనందంగా ఉంది. జైన మ‌తం ప‌విత్ర ల‌క్ష‌ణాల‌ను రాబోయే త‌రాల‌కు విస్త‌రించేలా చేయ‌డం నా ప్ర‌య‌త్నం. ప్ర‌త్యేకించి ఈ కోవిడ్‌-19 స‌మ‌యంలో అధ్య‌య‌న స్ఫూర్తి, స్వీయ‌ అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డానికి ఒక ఆన్ లైన్ వేదిక‌ను ఏర్పాటు చేయ‌డం స‌రైన చ‌ర్య‌గా మేం భావించాం” అన్నారు. www.jainfoundation.in ను సంద‌ర్శించి అందులో నుంచి జైన్ ఫౌండేష‌న్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.