సూపర్‌ బాటమ్స్‌ డ్రైఫీల్‌ నాపీలు వచ్చేశాయ్

By on March 19, 2020 0

365 తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, మార్చి19హైదరాబాద్‌: అగ్రగామి సర్టిఫైడ్‌ క్లాత్‌ డైపర్‌ బ్రాండ్‌ ‘సూపర్‌ బాటమ్స్‌’ సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణకు సూపర్‌బాటమ్స్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చిన్నారులకు సేంద్రీయ నాపీలు అందించేందుకు సంస్థ ముందుకొచ్చింది. ప్లాస్టిక్‌ రహిత ఉత్పత్తులనే అందించనున్నట్లు సంస్థ యాజమాన్యం ఈ సందర్భంగా తెలిపింది. చిన్నారులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పూర్తి స్థాయి సేంద్రియ ఉత్పత్తులను వినియోగించి ఈ నాపీలను తయారు చేశామని సూపర్‌ బాటమ్‌ సీఈఓ పల్లవి ఉటగి పేర్కొన్నారు. 

   Super Bottoms Dryfeel Nappies
Super Bottoms Dryfeel Nappies
   Super Bottoms Dryfeel Nappies
Super Bottoms Dryfeel Nappies

చిన్నారుల తల్లిదండ్రుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ప్రత్యేక సాంకేకతతో వీటిని రూపొందించామని, దీంతో చిన్నారులకు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తవని ఆమె తెలిపారు. సూపర్‌ నాపీలు.. అమేజాన్‌, బేబీకేర్‌ స్టోర్‌, సూపర్‌ బాటమ్స్‌ డాట్‌ కామ్‌ వంటి వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. మూడు నాపీల ప్యాక్‌ ధర రూ. 420, ఆరు నాపీల ప్యాక్‌ ధర రూ. 780, డజను నాపీల ప్యాక్‌ ధర రూ.1380లలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.