August 13, 2020
  • August 13, 2020
Breaking News
  • Home
  • TV Shows
  • బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై దాడి

బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై దాడి

By on March 5, 2020 0 199 Views

365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్,మార్చి5, హైదరాబాద్ : గాయకుడు, బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దాడి జరిగింది. బీరు సీసాలతో కొట్టడంతో చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి వచ్చారు. కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. రాహుల్‌ను బీరు సీసాలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాహుల్‌ చికిత్స పొందుతున్నారు.