365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 5, హైదరాబాద్:  2019: ఆప్ట్రోనిక్స్ ఇండియా అనేది తమను తాము చాటుకునే ఉత్పత్తుల శ్రేణితో  విని యోగదారు అనుభవాలకు పర్యాయపదంగా ఉంది. శ్రీ సుతీందర్ సింగ్ మరియు ఆయన కుమార్తె   మేఘనా సింగ్ దీనికి సారథ్యం వహిస్తున్నారు. విఆర్ చెన్నైలో భారతదేశపు అతిపెద్ద ఎపిఆర్ స్టోర్ ప్రారంభించడం మరియు ముంబైలోని హై స్ట్రీట్ ఫియోనిక్స్ లో భారతదేశ  మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ ఆపిల్ ప్రీమియం రీసెల్లర్ దుకాణాన్ని ప్రా రంభించిన మైలురాళ్లను దాటిన తరువాత, ఈ రెండు అద్భుతమైన విజయాలు సాధించిన తరువాత, ఈ బ్రాండ్ ఇప్పుడు, హైదరాబాద్ లోని కొండపూర్ లోని శరత్ క్యాపిటల్ సిటీ మాల్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఎపిఆర్ స్టోర్స్  ప్రారంభించడం ద్వారా ప్రపంచస్థాయిలో రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా తమ 8 సంవత్సరాల విజయవంతమైన ప్రభావాన్ని ఏర్పరచడం ద్వారా ఈ స్టోర్ తన వినియోగదారులకు సరికొత్త ఉత్పత్తులు మరియు సేవలను పొందేందుకు  హామీ ఇచ్చింది.  పూర్తిగా కొత్త స్టోర్ డిజైన్, ప్రీమియం బ్యాంక్ టై-అప్స్, మునుపెన్నడూ లేని విధంగా అనేక రకాల ఉపకరణాలతో ఇది ఆపిల్ అభిమానులకు, బీస్పోక్ సేవలకు ప్రత్యేక  సభ్యత్వం అయిన ‘క్లబ్ ఆప్ట్రోనిక్స్ మెంబర్‌షిప్’కు  కమ్యూనిటీ స్థలం.

 హైదరాబాద్ లోని శరత్ క్యాపిటల్ సిటీ మాల్ వద్ద గ్రౌండ్ ఫ్లోర్‌లో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ ఆధునిక ఆకర్షణను కలిగి ఉంది. నలుపు, తెలుపు, వెండి రంగులతో ఈ స్టోర్ సుపరిచితమే అయినప్పటికీ  విలక్షణమైన డిజైన్ మరియు లేఅవుట్ ను అందిస్తుంది.   ఆపిల్ వినియోగదారుల కోసం ‘హౌస్ ఆఫ్ క్రియేటివిటీ’ కావడాన్ని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్ క్రియేషన్, ఆర్ట్, డిజైన్ లలో వర్క్ షా పులకు హాజరయ్యే అవకాశం కూడా సందర్శకులకు లభిస్తుంది. ప్రతి ఒక్కరిలోని సృజనాత్మకత నిజమైన సా మర్థ్యాన్ని వెలికితీయడాన్నే ఇది లక్ష్యంగా చేసుకుంది*. విస్తృతమైన ఉత్పత్తులు, ఉపకరణాలతో తిరుగులేని అను భవాన్ని అందించడం ఈ స్టోర్ లక్ష్యం.

????????????????????????????????????

ఆప్ట్రోనిక్స్ దేశంలో ఆపిల్ అతిపెద్ద భాగస్వామి కావడంతో, ఈ బ్రాండ్ 31 దుకాణాలు, 11 సేవా కేంద్రాలతో, 300 మందికి పైగా ఉద్యోగులతో ప్రతి సందర్శకుడికి ఆపిల్ అనుభవాన్ని అందించే దిశగా పనిచేస్తోంది. స్టోర్ ప్రారంభిం చిన సందర్భంగా, ఆప్ట్రోనిక్స్ ఇండియా (ప్రీమియం లైఫ్ స్టైల్ & ఫ్యాషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) వ్యవస్థాపకుడు శ్రీ సుతీందర్ సింగ్ మాట్లాడుతూ “ఆప్ట్రోనిక్స్ లో మేం ఆపిల్ ను ప్రేమిస్తున్నాం. మేం ఈ బ్రాండ్‌ను అర్థం చేసుకు న్నాం. అన్ని నగరాల్లోని మా వినియోగదారులందరికీ ఆపిల్‌ అందించే ఉత్తమమైన దాన్ని అందించడానికి మేం ఎ ల్లప్పుడూ ప్రయత్నిస్తాం. బ్రాండ్ తన కస్టమర్లతో ఉన్న సంబంధాన్ని మేం విలువైనదిగా భావిస్తాం. ఆపిల్ అనుభ వాన్ని ఆస్వాదించడం నిజంగా జీవితాన్ని మార్చేదిగా ఉంటుందని మేం అర్థం చేసుకున్నాం’’ అని అన్నారు.

 స్టోర్ ప్రారంభం  గురించి ఆప్ట్రోనిక్స్ ఇండియా (ప్రీమియం లైఫ్ స్టైల్ & ఫ్యాషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) డైరెక్టర్  మేఘనా సింగ్ మాట్లాడుతూ “ఈ కొత్త స్టోర్ ను మా స్టోర్స్ జాబితాలో చేర్చుకునేందుకు సంతోషిస్తున్నాం. ఆపిల్ నుంచి ఈ సంవత్సరం ఎన్నో  ఉత్పత్తులు రానున్నాయి. ఊహించలేని స్థాయిలో డిమాండ్లు ఉండనున్నాయి  ఆపి ల్‌తో మా భాగస్వామ్యానికి మేము ఎంతగానో కట్టుబడి ఉన్నాం. భారతదేశం అంతటా భారీ స్టోర్ల   ప్రారంభానికి మేం ఎదురుచూస్తున్నాం. హైదరాబాద్ ఈ అనుభవాన్ని ఆనందిస్తుందని మేము ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

 అభిమానుల ఫాలోయింగ్ కారణంగా పరిచయం అవసరం లేని బ్రాండ్‌గా ఇది ప్రతీ ఒక్కరికీ  ఏదో ఒకదాన్ని అంది స్తుంది. కస్టమర్ అనుభవం సగర్వంగా తిరుగులేనివిధంగా ఉంటుంది మరియు హైదరాబాద్ ఇప్పుడు తన స్వంత ఆపిల్ కలిగి ఉంది !

స్టోర్ చిరునామా: ఆప్ట్రోనిక్స్, శరత్ క్యాపిటల్ సిటీ మాల్, కొండాపూర్, హైదరాబాద్ : 500084

స్టోర్ వేళలు: ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు  వారంలో 7 రోజులు