December 16, 2019
  • December 16, 2019
Breaking News
  • Home
  • TS News
  • వెనుకబడిన తరగతుల కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రగతిపై సమీక్ష సమావేశం

వెనుకబడిన తరగతుల కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రగతిపై సమీక్ష సమావేశం

By on December 1, 2019 0 29 Views

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్1,2019 హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మాత్యులు గంగుల కమలాకర్ , క్రీడలు , యువజన సర్వీసుల శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ సంక్షేమ భవన్ లో రాష్ట్ర రాజధానిలో నిర్మించ తలపెట్టిన వెనుకబడిన తరగతుల కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాల కాలంలో సమైక్యాంద్ర ప్రభుత్వంలో వెనుక బడిన తరగతుల సంక్షేమం విషయంలో సవతి ప్రేమ చూపెట్టింది అనేది వాస్తవం. మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెనుకబడిన తరగతుల కులాల కు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.. అందులో భాగంగా రాష్ట్ర రాజధానిలో వెనుకబడిన తరగతుల కులాల కు నగరానికి కూతవేటు దూరంలో రంగారెడ్డి ,మేడ్చల్ జిల్లాల చెందిన సుమారు 80 ఎకరాల భూమిని కేటాయిస్తూ 40 కులాల ఆత్మగౌరవ భవనములు నిర్మించుటకు 80 కోట్ల నిధులు మంజూరు చేసినారు.. ఇట్టి భవనాల నిర్మాణం త్వరితగతిన చేపట్టుటకు సంబంధిత రెవెన్యూ హద్దులు హద్దులు ఏర్పాటు చేసి రెవెన్యూ భూకేటాయింపు చేయుచు హద్దులు ఏర్పాటు చేసి వారి వారి కుల సంఘ బోర్డులు ఏర్పరచుట ఆదేశించారు.

గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెడ్డి సంఘం నిర్మాణం, వైశ్య సంఘ నిర్మాణం చేపట్టి విషయంలో ఆ సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల మాదిరిగానే ఈ వెనుకబడిన తరగతుల కులాల తో కూడా అటువంటి ఒప్పందాలు కుదుర్చు కొనుటకు కోరినారు.. తదుపరి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలు సిద్ధం చేయుటకు, మూడు నాలుగు రోజులలోనే గౌరవ మంత్రివర్యులు, ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు, సంఘ ప్రతినిధులతో స్థలాలను పరిశీలించుటకు వెళ్ళుటకు నిర్ణయించినారు.. ఈ సందర్భంగా బలహీన వర్గాల విషయంలో ముఖ్యమంత్రి దార్శనికతను , ముందు చూపును దృష్టి యందు ఉంచుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ అనితారామచంద్రన్ , అదనపు కార్యదర్శి సైదా, మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ కుమార్ తదితరులు హాజరయ్యారు.