July 6, 2020
  • July 6, 2020
Breaking News
  • Home
  • TS News
  • రాయల్ స్టాగ్ బారెల్ సెలెక్ట్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ డిస్కషన్

రాయల్ స్టాగ్ బారెల్ సెలెక్ట్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ డిస్కషన్

By on December 1, 2019 0 179 Views

అనిల్ కపూర్, ఫరా ఖాన్ , ఆదా శర్మ

  • భారతదేశంలో షార్ట్ ఫిల్మ్స్ , సినిమాటిక్ ఉత్కృష్టత పై చర్చించేందుకు దర్శకులతో ప్యానెల్ డిస్కషన్ నిర్వహణ

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్1,2019 హైదరాబాద్ : షార్ట్ ఫిల్మ్స్ కోసం ప్రభావవంతమైన , ప్రసిద్ధ వేదిక అయిన రాయల్ స్టాగ్ బారెల్  సెలెక్ట్ లార్జ్  షార్ట్ ఫిల్మ్స్ నేడిక్కడ షార్ట్ ఫిల్మ్స్, ఇండియన్ సినిమా మరియు ‘వాట్ మేక్స్ ఫిల్మ్స్ పవర్ ఫుల్’ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ ను నిర్వహించింది. అనుపమ చోప్రా దీనికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రముఖ ప్యానెలిస్టులు అనిల్ కపూర్, ఫరా ఖాన్, అదా శర్మ, టిన్ను ఆనంద్, దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్ సీమా దేశాయ్ ఇందులో పాల్గొన్నారు.

శక్తివంతమైన కథ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలంటే, సినిమా నిర్మాణంలో పాల్గొనే ప్రతి ఒక్కరి నుండి నిబద్ధత , నైపుణ్యం అవసరం. రాయల్ స్టాగ్ బారెల్ సెలెక్ట్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ అనేది ఒక సినిమాను శక్తివంతం చేసే పరిపూర్ణ అంశాన్ని అర్థంచేసుకోవడానికి సినిమా ప్రపంచానికి చెందిన నటులు, దర్శకులను ఒకచోటుకు తీసుకువచ్చింది. ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన హైదరాబాద్, కోల్‌కతా, పుణే, గుర్గావ్, ఢిల్లీ & జలంధర్ అనే 6 నగర పర్యటనలలో, ఈ వేదిక అనిల్ కపూర్, ఫరా ఖాన్, జిమ్మీ షీర్‌గిల్, రాకీష్ ఓం ప్రకాష్‌మెహ్రా, రణదీప్‌ హూడా, వినయ్ పాథక్ , జోయా అక్తర్ వంటి సినిమా మాస్ట్రోలను ఆహ్వానించింది..

ఈ సందర్భంగా పెర్నోడ్ రికార్డ్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ మహింద్రా మాట్లాడుతూ “రాయల్ స్టాగ్ బారెల్ సెలెక్ట్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ అనేది శక్తివంతమైన  ఒరిజినల్ సినిమాకు పర్యాయపదంగా మారింది. షార్ట్ ఫిల్మ్ కళా ప్రక్రియ పెరుగుతున్న కొద్దీ, ఈ శక్తివంతమైన కథలను , వాటి సృష్టికర్తలను మరింతగా ముందుభాగంలోకి  తీసుకు వచ్చేందుకు మేము మా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం. ఈ బ్రాండ్  తాత్వికత, పరిపూర్ణత తో మిళితమయ్యే ఇటు వంటి సినీ ప్రపంచ ప్రముఖ కథకులకు ఆతిథ్యం ఇవ్వడం ఒక గౌరవంగా భావిస్తున్నాం” అని అన్నారు.రాయల్ స్టాగ్ బారెల్ సెలెక్ట్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ లో జరిగిన ఆకర్షణీయమైన చర్చ అంతా కూడా ‘డబ్స్, రీమేక్‌లు, వెబ్ సిరీస్ అధికం కావడం ప్రాంతీయ , హిందీ సినిమా  మూతపడేలా చేస్తుందా’ అనే అంశం ప్రధానంగా సాగింది.  ఇక్కడ ప్యానెలిస్టులు ముఖ్యంగా నటులు, దర్శకులు ఈ అంశంపై తమ దృక్పథాలనుపంచుకున్నారు. భౌగోళికంగా మంచి కంటెంట్ ఎలా ప్రశంసించబడుతుందో వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్రాండ్ ను ప్రజలకు చేరువ చేసే ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్ లో ప్రసారం చేయబడతాయి.

రాయల్ స్టాగ్ బారెల్ సెలెక్ట్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ ఫిల్మ్ మేకింగ్ రంగంలో ఒక విప్లవానికి మార్గదర్శకత్వం వహిం చింది. శక్తివంతమైన లఘు చిత్రాల ద్వారా, ఈ బ్రాండ్ సినీప్రియుల కోసం చలనచిత్ర వీక్షణను విజయవంతం గా పునర్నిర్వచించింది. ప్రేక్షకులకు , చిత్రనిర్మాతలకు ఒక రియాలిటీ చెక్ ఇచ్చింది.  అసలుసిసలైన, శక్తివంతమైన , వినోదాత్మక కంటెంట్‌తో, ఇది చాలా తక్కువ వ్యవధిలో  ఔత్సాహికుల విశ్వసనీయ సమూహాన్ని విజయవంతంగా నిర్మించింది.