ఆర్టీసీ కార్మికుల కు గుడ్ న్యూస్
ఆర్టీసీ కార్మికుల ను చేర్చుకుంటాము కేసీఆర్ఆర్టీసీ కార్మికులు అందరూ విధుల్లోకి చేరండి-సీఎం 5 నిమిషాల్లో ఆర్డర్స్ పాస్ చేస్తా, సీఎం ఆర్టీసీ కార్మికుల ను చేర్చుకుంటాము కేసీఆర్
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 28 హైదరాబాద్, 2019 :రేపు విధుల్లో జాయిన్ కండి ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాటలు నమ్మి దెబ్బతింటున్నారు-సీఎం కేసీఆర్ మాటలు చెప్పడం కాదు.. దేశంలోనే అత్యధికంగా జీతాలు పొందే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, హోంగార్డులు.. ఇలా చాలా మంది తెలంగాణలో ఉన్నారు-సీఎం కేసీ
ఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల పొట్టలు నిప్పాం.. కానీ ఎవరి పొట్టలూ కొట్టలేదు-సీఎం కేసీఆర్….
‘ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లోకి చేరండి’’

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి బాధ్యత యూనియన్లే వహించాలని స్పష్టం చేశారు. యూనియన్ల కారణంగానే అసంబద్ధ డిమాండ్లతో ఆర్టీసీ సమ్మె చేపట్టారని చెప్పారు. భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదన్నారు. విపక్షాల మాటలు నమ్మొద్దని, ఉద్యోగాల్లో చేరాలని తాను ఎంతో స్పష్టం చెప్పానని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు ఉంటాయో, లేదో తెలియని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. విపక్షాలు ఆర్టీసీ కార్మికులకు లేని ఆశలు కల్పించారని విమర్శించారు. రేపు పొద్దున్న చేరాలని ఆర్టీసీ కార్మికులకు సీఎం అవకాశం కల్పించారు.

సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీలు పెంపు: కేసీఆర్
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లోకి చేరండని సూచించారు. అందరూ ఉద్యోగాల్లో చేరండని, హాయిగా ఉండడని చెప్పారు. ఎటువంటి షరతులు పెట్టమని, ఉద్యోగాల్లో కార్మికుల చేరండన్నారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లోని ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ సంస్థకు అవసరమైతే రూ.100 కోట్లు ఇస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్లో 35వేల ప్రైవేట్ బస్సులకు పర్మిట్ ఇచ్చారని చెప్పారు. నాలుగైదు రోజుల్లో ప్రతీ డిపో నుంచి 5-7 కార్మికులను పిలిచి ప్రగతిభవన్లో మాట్లాడతానన్నారు. యూనియన్ల స్థానంలో ప్రతీ డిపోలో వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, మీరు బాధపడాలని తామెందుకు భావిస్తామని ప్రశ్నించారు. కార్మికులను కాదని తాము నిర్ణయం తీసుకోమని, కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రెస్ మీట్ హైలెట్స్

★ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త★
◆ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరండి
◆రేపు ఉదయం 10లోపు ఆర్టీసీ కి తక్షణ సాయం కింద 100 కోట్లు ఇస్తాం
◆ఆర్టీసి కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి కండిషన్లు పెట్టం
◆ఆర్టీసి కార్మికులంతా మా బిడ్డలే
★ఇక నుండి కార్మికులను నేరుగా సంప్రదిస్తాం…యూనియన్ నాయకులను సంప్రదించం…ఈరోజు వీరివల్లే ఆర్టీసి కార్మికులు నష్టపోయారు
◆కార్మికులు యూనియన్ కోసం కాదు సంస్థ కోసం పని చెయ్యాలి…సంస్థ లేకపోతే యూనియన్లు ఎక్కడివి
◆ఈ సమ్మెలో చనిపోయిన కార్మికుల కుటుంబం నుండి ఒకరికి ఆర్టీసి లో కానీ ప్రభుత్వంలో గాని ఉద్యోగం ఇస్తాం
◆టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ప్రజల పొట్టలు నింపినం…కాని ఎవరి కడుపు కొట్టలేదు
◆యూనియన్లను ఎట్టి పరిస్థితుల్లో క్షమించం..కార్మికులను కాదని ఏ నిర్ణయం తీసుకోం
◆ప్రతి డిపోకు వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెడతాం
★ఈ సమావేశంలో రెండు విషయాల పైన ప్రధానంగా చర్చించినం★
◆రాష్ట్రంలో ఇటీవల బాగా వర్షాలు కురిసినయి
◆వర్షాలకు రోడ్లు బాగా దెబ్బ తిన్నయి
◆ఆర్ అండ్ బి అధికారులను పిలిచి రోడ్ల గురించి మాట్లాడినం
◆రోడ్ల మరమ్మతులు కు 571 కోట్లు కేటాయించినం…వీలైనంత తొందరలో టెండర్లకు పిలుస్తాం
★వందశాతం నూతన రెవెన్యూ చట్టం తీసుకోస్తాం
రాష్ట్రంలో ని హైవేలను రోడ్లను మూడు నెలల్లో మరమ్మత్తులు చేస్తాం