365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ , అక్టోబర్ 24, హైదరాబాద్: ఎగ్జిక్యూటివ్ షెఫ్ – రాకేష్ ఘాయ్ అందిస్తున్న ఆశీర్వాద్ ఆటా వంటకాలు
1. గోధుమ హల్వా

పదార్ధాలు పరిమాణం
ఆశీర్వాద్ గోధుమ పిండి   2 కప్పులు
పంచదార    1.25 కప్పులు
జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్‌లు
ఎండు ద్రాక్ష     1 టేబుల్ స్పూన్‌లు
యాలుకలు      1/2 టీ స్పూన్‌లు
నెయ్యి 1.5 కప్పులు

తయారీ విధానం:

 1. వేడిగా ఉన్న లోతు గల పెనంలో ఒక కప్పు నెయ్యి పోయండి
 2. దీనికి ఆశీర్వాద్ సుపీరియర్ ఎంపీ గోధుమ పిండిని జత చేయండి
 3. గోధుమ పిండి మరియు నెయ్యి బాగా కలిసే వరకు ఒక స్పూన్‌తో కలియబెట్టండి
 4. మిగిలిన అర కప్పు నెయ్యిని ఈ మిశ్రమంలో వేయండి
 5. సన్నని సెగపై వేయించండి మరియు ఈ మిశ్రమం బాగా మెత్తగా అయ్యే వరకూ బాగా కలపండి, అలాగే పెళుసుగా మారకుండా చూసుకోండి
 6. ఇప్పుడు నీటితో పాటు పంచదారను కూడా కలపండి
 7. ఈ మిశ్రమం యొక్క రంగు లేత వర్ణం నుంచి ముదురు గోధుమ రంగుకు మారే వరకు సన్నని మంటపై ఈ మిశ్రమాన్ని కలపడం కొనసాగించండి
 8. ముందుగా యాలుకల పొడి, తరువాత జీడిపప్పు పొడి మరియు ఎండు ద్రాక్షలను జోడించండి
 9. ఎలాంటి గడ్డలు కనిపించనంత వరకూ కలియబెట్టండి మరియు హల్వా మొత్తంలో డ్రైఫ్రూట్స్ సమానంగా విస్తరించేలా చూడండి
 10. వేడిగా ఉన్నప్పుడే బౌల్‌లో వేసి వడ్డించండి మరియు ముక్కలు చేసిన పిస్తా పప్పుతో అలంకరించండి

2. గోధుమ చుర్మా

JD42BH Traditional Rajasthani Food Daal Baati churma. Indian Food.
పదార్ధాలు పరిమాణం
ఆశీర్వాద్ గోధుమ పిండి 250 గ్రా.
నెయ్యి 500 గ్రా.
పంచదారు 200 గ్రా.
ఆకుపచ్చ యాలుకలు 1 టీస్పూన్
కుంకుమ పువ్వు ½ గ్రా.
బాదం పప్పు 10 గ్రా.
పిస్తా 10 గ్రా.
జీడి పప్పు 10 గ్రా.

తయారీ విధానం:

 1. శుభ్రంగా ఉన్న కలియబెట్టే గిన్నెలో ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుని, నీరు కలపండి & పిండిగా మారే వరకు కలియబెట్టండి, ఈ పిండికి తడి వస్త్రంతో మూత పెట్టి 20 నిమిషాల పాటు నాననివ్వండి
 2. ఈ పిండిని చిన్న బంతుల (20 గ్రా.) ఆకారంలోకి విభజించండి
 3. పెనంపై నెయ్యిని వేడి చేయండి (మరీ ఎక్కువ వేడి వద్దు) ఈ పిండి బంతులను సన్నని మంటపై లేత గోధుమ రంగు వచ్చేవరకూ బాగా వేయించండి
 4. చల్లారే వరకు వేచి ఉండండి, ఆ తరువాత ముక్కలుగా చేయండి
 5. ఈ ముక్కలను క్రమంగా గ్రైండ్ చేయండి. పొడి చేయబడిన పంచదార, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు ,నెయ్యిని ఈ మిశ్రమం పై వేయండి
 6. ఈ మిశ్రమం బాగా కలపండి , చుర్మాను నెయ్యితో కలిపి వడ్డించండి

3. బొబ్బట్లు

పదార్ధాలు పరిమాణం
ఆశీర్వాద్ గోధుమ పిండి 200 గ్రా.
నెయ్యి 50 గ్రా.
శనగ పప్పు 250 గ్రా.
బెల్లం 250 గ్రా.
నెయ్యి 250 గ్రా.
కుంకుమ పువ్వు ½ గ్రా.
ఆకుపచ్చ యాలుకలు 2 గ్రా.

తయారీ విధానం:

కూరే పదార్ధం:

 1. శనగ పప్పు/శనగలు మరీ మెత్తగా అయిపోకుండా పూర్తిగా ఉడికే వరకు వెలిగించిన పొయ్యిపై ఉంచండి. అదనపు నీటిని పారబోయండి.
 2. బాగా మెదిపి ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా తయారు చేయండి.
 3. పెనంపై నెయ్యిని వేడి చేయండి, దీనికి పిండి ముద్దను జోడించి, ఆ తరువాత సన్నని మంటపై లేత గోధుమ రంగు వచ్చే వరకు ఉడికించండి. చల్లారే వరకు వేచి ఉండండి.
 4. బెల్లం, యాలుకల పొడి మరియు కుంకుమ పువ్వును ఈ పిండి మిశ్రమానికి జోడించండి
 5. ఈ మిశ్రమం గట్టిగా మారే వరకు ఉడికించండి.

పిండి:

 1. శుభ్రమైన కలియబెట్టే గిన్నెలో ఆశీర్వాద్ గోధుమ పిండి వేసి, నీటిని జోడించండి & ముద్దగా మారేవరకు కలియబెట్టండి, తడి వస్త్రంతో దీనికి మూత వేయండి , 20 నిమిషాల పాటు నాననివ్వండి
 2. చిన్న ఉండలు (20 గ్రా.)గా ముద్దను విభజించండి , పూరీలో ఈ బంతులను చుట్టండి
 3. మిశ్రమంతో పూరీని కూరండి మరియు అవసరమైన పరిమాణం వచ్చేందుకు పూరీని చుట్టండి
 4. పెనం వేడి చేయండి మరియు రెండు వైపులా బంగారు వర్ణపు చుక్కలు వచ్చే వరకూ వేడి చేయండి
 5. వేడి వేడి బొబ్బట్లపై నెయ్యిని చల్లండి , వేడిగా వడ్డించండి.