డెలివరీ అయిన నాలుగు గంటల లోపు ప్రీమియం ఉత్పత్తుల ఇన్­స్టలేషన్

-ఎటువంటి ఎదురుచూపులు అవసరం లేకుండా జాగ్రత్త వహించేందుకుఇంటరాక్టివ్ మొబైల్ రిపెయిర్సౌకర్యంకృత్రిమ మేథస్సు (ఎఐ)ను ఉపయోగించుకునే చాట్­బాట్ అసిస్టెన్స్ మరియు రిమోట్ సహకారం

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆక్టోబర్ 17 ,గురుగ్రామ్ ,2019 – భారతదేశపు అతి పెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్­ఫోన్ బ్రాండ్ అయిన శామ్­సంగ్, ఈ పండుగ సీజన్­లో వినియోగదారులకు సంతోషాన్ని కలిగించేందుకు దేశంలో తన సర్వీస్ ఆఫరింగ్­లను పటిష్టం చేసింది. రిమోట్ సపోర్ట్ మరియు లైవ్ చాట్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శామ్­సంగ్ ఎఐ ఆధారిత చాట్­బాట్­ను వినియోగదారుల ఫిర్యాదుల సత్వరపరిష్కారానికి ఉపయోగిస్తోంది.

3,300లకు పైగా సర్వీస్ పాయింట్లతో కూడిన భారతదేశపు అతి పెద్ద సర్వీస్ నెట్­వర్క్­లో 535 కస్టమర్ సర్వీస్ వ్యాన్లు కూడా ఉన్నాయి. అవి దేశం నలుమూలలకు వెడుతూంటాయి. ప్రధాన నగరాల్లో, శామ్­సంగ్ టివిలు (55 అంగుళాలు, అంతకన్నా ఎగువ), 300 లీటర్లు మరియు అంతకన్నా ఎగువ శామ్­సంగ్ రెఫ్రిజిరేటర్లు, ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు మరియు ఫైవ్­-స్టార్ ఇన్వర్టర్ మరియు విండ్ ఫ్రీ ఎసిలను కొనుగోలు చేసే వినియోగదారులు, డెలివరీ అందుకున్న కొద్ది గంటల్లోనే ఇన్­స్టలేషన్ పొందగలుగుతారు.

ఈ పండుగ సీజన్­లో శామ్­సంగ్ విస్తృతశ్రేణి ప్రత్యేకమైన డీల్స్­ను, ఆఫర్లను మరియు తప్పకుండా లబించగల గిఫ్ట్­లను, తమ విశాలమైన ప్రోడక్ట్ పోర్ట్­ఫోలియోలోని ఉత్పత్తుల పై ప్రకటించింది, ఈ ఆఫర్ అక్టోబర్ 31, 2019 వరకు వర్తిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా శామ్­సంగ్, వినియోగదారులకు కోరుకున్న ఉత్పత్తులను మరింత చేరువకు చేర్చాలని సంకల్పించింది.

ఈ పండుగ సీజన్­లో మేము అత్యుత్తమ శ్రేణి సేవలను మా వినియోగదారులు అందరికీ, మా 3,300ల కస్టమర్ సేవా పాయింట్లు, వాటిలోని 535 కస్టమర్ సర్వీస్ వ్యాన్లతో సహా కల్పించాలని సంకల్పించాము. భారతదేశంలో పండుగల సీజన్ అంటే ప్రజలు తమ లైఫ్­స్టైల్­ను షాపింగ్ చేసే సమయం. మా వైవిధ్యభరితమైన ఉత్పత్తుల శ్రేణిలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి లభిస్తుంది. మా కొత్త సర్వీస్ ఆఫరింగ్, రిమోట్ సపోర్టుతో కూడిన లైవ్ చాట్, వినియోగదారులతో మా అనుబంధాన్ని మరియు బ్రాండ్ పట్ల అభిమానాన్ని మరింత పెంపొందించేందుకు మా వ్యూహంలో అంతర్భాగం. మీ అందరి పండుగ సుఖసంతోషాలతో, సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నాము.అని సునీల్ క్యుటినా, వైస్ ప్రెసిడెంట్, కస్టమర్ సర్వీస్, శామ్­సంగ్ ఇండియా అన్నారు.

శామ్­సంగ్ వారి సర్వీస్ కేంద్రాలలో 10,000లకు పైగా స్పెషలిస్టు ఇంజనీర్లు ఉన్నారు. వీరు శామ్­సంగ్ వారి ఇన్-హౌస్ శిక్షమ అకాడమిక్స్ శిక్షణ పొంది ఉన్నారు. తమ వినియోగదారుల అవసరాలకు సహాయసహకారాలను అందించేందుకు శామ్­సంగ్ వద్ద 24X7ప్రీమియం కాల్ సెంటర్లు ఉన్నాయి. అవి తొమ్మిది భాషల్లో సహాయాన్ని అందిస్తుంటాయి. వినియోగదారులు, ఆన్­లైన్ అపాయింట్­మెంట్ బుక్ చేసుకోవటం ద్వారా కూడా ప్రాధాన్యతా సేవలను కోరి, తమ సమీపంలోని సర్వీస్ సెంటర్­ను తమకు అనువైన రోజు మరియు సమయానికి సందర్శించేందుకు సమయాన్ని నిర్ధారించుకోవచ్చు.

అంతే కాక, శామ్­సంగ్ వారి 535 కస్టమర్ సర్వీస్ వ్యాన్లు దేశంలో మూలమూలలకు ప్రయాణించి, శామ్­సంగ్ సర్వీస్ నెట్­వర్కును, భారతదేసంలో ఈ పరిశ్రమలో అతి పెద్ద నెట్­వర్కుగా మార్చి, భారతదేశంలోని పట్టణ మరియు పల్లె ప్రాంతాలు రెండింటిలోనూ నాణ్యమైన కస్టమర్ సేవలను కల్పించాలన్న తమ సంకల్పాన్ని మరింత పటిష్టపరుచుకుంది.  సర్వీసు వ్యాన్లలో పలురకాల నైపుణ్యాలను కలిగిన ఇంజనీర్లు, ముఖ్యమైన విడిభాగాలు, ఒక జనరేటర్ సెట్ మరియు కీలకమైన జిగ్స్/ ఫిక్స్చర్లు, సత్వర ప్రతిస్పందనను, తక్షణ పరిష్కారాన్ని అందించేందుకు కలిగి ఉంటాయి.

ఈ పరిశ్రమలో మొట్టమొదటిసారి శామ్­సంగ్ ఇంటరాక్టివ్ రిపెయిర్ కేంద్రాలను, మా మొబైల్ ఫోన్ల కోసం, భారతదేశంలోని అన్ని సర్వీసు సెంటర్లలోనూ కల్పిస్తోంది. కస్టమర్ ఎట్టఎదుటే మొబైల్­ను రిపెయిర్ చేయటం వలన రిపెయిర్ ప్రక్రియలో పారదర్శకత ఏర్పడుతుంది. అంతే కాక, కస్టమర్ సంతృప్తి కోసం శామ్­సంగ్ తమ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఉపయోగిస్తుంది. వాటిలో కొన్ని ఇవి:

·         రిమోట్ సపోర్టు-ఈ సపోర్టును అన్ని శామ్­సంగ్ స్మార్ట్­ఫోన్లు మరియు స్మార్ట్ టివిల వాడకందార్లకు కల్పించటం జరుగుతోంది. ఒక శామ్­సంగ్ కాల్ సెంటర్ ఏజెంట్, ఒక కస్టమర్ యొక్క స్మార్ట్ ఫోన్ లేదా స్మార్ట్ టివి పై సుదూరంగా ఉండి, ఇంటర్నెట్ ద్వారా పని చేసి, సమస్యను ఆన్­లైన్లో గుర్తించి, తక్షణ పరిష్కారాన్ని అందించగలుగుతారు.

·         లైవ్ చాట్– కస్టమర్లు శామ్­సంగ్­ను, కంపెనీ వెబ్­సైట్ www.samsung.com/in/support వద్ద సునాయాసంగా చేరుకోగలుగుతారు. అక్కడ శిక్షణ పొందిన ఏజెంట్లు, కృత్రిమ మేథస్సు (ఎఐ) ఆధారిత చాట్ బాట్, ప్రశ్నలు/సందేహాలకు తక్షణం, ఖచ్ఛితమైన సమాధానాలను,ఎటువంటి ఎదురుచూపులు అవసరం లేకుండా, 24*7అందిస్తుంది.

·         శామ్­సంగ్ వెబ్­సైట్ మరియు యూ ట్యూబు పై వీడియో టిప్స్  –  ఈ సామాజిక మీడియా యుగంలో, సామాన్య సమస్యలకు, ట్యుటోరియల్ వీడియోల ద్వారా సమాధానాలను కల్పించటం, యూ ట్యూబు వంటి వేదికల ద్వారా అందించటం లాభదాయకం. వినియోగదారులు, అద్భుతమైన టిప్స్­ను మరియు స్వయంగా చేసి చూడగల వీడియోలను యూ ట్యూబులో పొందగలుగుతారు. వారు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇవి ఉపయోగపడగలుగుతాయి. ఈ బోధనా వీడియోలతో, కాన్సెప్టులు, ఆలోచనలు, వాస్తవ అనుభవాల రూపాలను సంతరించుకోగలుగుతాయి.

ఈ కృషిలో భాగంగా, శామ్­సంగ్ వద్ద ఒక సమగ్రమైన యాప్ శామ్­సంగ్ మెంబర్స్ ఉన్నది. ఇది కస్టమర్లకు లైవ్ చాట్, సర్వీస్ అభ్యర్ధనలు చేసే అవకాశం, రిపెయిర్ పురోగతిని ట్రాక్ చేయటం, రిమోట్ సపోర్టు మరియు ఫోన్ డయాగ్నోస్టిక్స్ వంటి ఆప్షన్లను అందిస్తుంది. కమ్యూనిటీ సెక్షన్­లో కస్టమర్లు, ఇతర శామ్­సంగ్ అభిమానులతో ముచ్చటించగలుగుతారు కూడా.

ఈ పండుగ సీజన్­లో శామ్­సంగ్ వారి టాప్ డీల్స్
ఉత్పత్తిపండుగ ఆఫర్
ఎంపిక చేసిన శామ్­సంగ్QLED TVలుఐఎన్ఆర్ 61,900 విలువ చేసే గెలాక్సీ ఎస్10 మరియు ఐఎన్ఆర్ 21,490 విలువ చేసే గెలాక్సీ ఎ50 వంటి తప్పకుండా లభించే బహుమతులు.
ఎంపిక చేసిన4K UHD TVలుఐఎన్ఆర్ 17,990 విలువ చేసే గెలాక్సీ ఎం30 మరియు ఐఎన్ఆర్ 4,999 విలువ చేసే గూగుల్ హోమ్ మినీ వంటి కాంప్లిమెంటరీ బహుమతులు.
ఎంపిక చేసిన శామ్­సంగ్ యాడ్­వాష్ వాషింగ్ యంత్రాల మోడళ్ళు23-లీటర్ల మైక్రోవేవ్ ఓవెన్ ఉచితం

Samsung India Newsroom Link: https://news.samsung.com/in/this-festive-season-samsung-offers-innovative-customer-service-experience-to-consumers-through-3300-service-points-across-india

శామ్­సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్­ను గురించి

శామ్­సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్­ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్­వర్క్ సిస్టమ్­లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్­సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్­సంగ్ ఇండియా న్యూస్­రూమ్­ను http://news.samsung.com/inవద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్­సంగ్ న్యూస్­రూమ్ భారత్­ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్­ పై అనుసరించవచ్చు.

Next Post

Celebrate Dhanteras with Amazon Fashion

October 18, 2019 0