December 10, 2019
  • December 10, 2019
Breaking News
  • Home
  • Top Stories
  • జనవరి 12న విడుదల కానున్న ‘సరిలేరు నీకెవ్వరు’

జనవరి 12న విడుదల కానున్న ‘సరిలేరు నీకెవ్వరు’

By on October 16, 2019 0 55 Views

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్ , అక్టోబర్ 16, హైదరాబాద్:సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం  ‘సరిలేరు నీకెవ్వరుస‌. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలోసీనియర్‌హీరోయిన్‌విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా…సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ  –  “ఈ సంక్రాంతి పండుగ నాకు బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ స్పెషల్”అన్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ దిల్‌రాజు మాట్లాడుతూ  – “సంక్రాంతి కానుకగా జనవరి 12న  ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.అన్నారు.

అగ్ర నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ  –  “జనవరి 12 నుండి  ‘సరిలేరు నీకెవ్వరు’  మీ హృదయాలను జయించి మీలో నవ్వుల్ని పూయిస్తుంది. యాక్షన్‌తో  మిళితమైన 100 పర్సెంట్ ఎంటర్టైన్మెంట్‌ను మేము ప్రామిస్ చేస్తున్నాము” అన్నారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “సరిలేరు నీకెవ్వరు’ చూసి  వచ్చే సంక్రాంతికి  మీరంతా నవ్వకుండా, చప్పట్లు కొట్టకుండా, ఈలలుతో గోల చేయకుండా ఉండలేరు” అన్నారు. హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ  – “క్యాలెండర్‌లో  డేట్ మార్క్ చేసుకోండి. జనవరి 12న థియేటర్స్ లో కలుద్దాం ‘అన్నారు.సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.