November 18, 2019
  • November 18, 2019
Breaking News
  • Home
  • TS News
  • ప్రయాణీకులకు ఆటంకం కల్గకుండా ప్రత్యేక వాహనాల వినియోగం

ప్రయాణీకులకు ఆటంకం కల్గకుండా ప్రత్యేక వాహనాల వినియోగం

By on October 10, 2019 0 46 Views


 365 తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, అక్టోబర్ 10, హైదరాబాద్: మరింత దృష్టి  సారిస్తున్న అధికార యంత్రాంగం. సమ్మె కాలంలో ప్రయాణీకులు ఎలాంటి అవస్థలకు గురికాకుండా ఉండాలని, ఈ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం మరింత దృష్టి సారిస్తోంది. బుధవారం రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఖమ్మం నుంచి, టి.ఎస్‌.ఆర్టీసీ ఎం.డి, టి.ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ హైదరాబాద్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్స్‌, రీజినల్‌, డివిజినల్‌ మేనేజర్స్‌లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.  గత నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులతో పాటు వివిధ వాహనాలను తిప్పి ప్రయాణీకులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చగలిగింది. అదే మాదిరిగా దసరా ముగియడంతో మళ్లీ తిరుగు ప్రయాణంలో ఆటంకాలు ఎదుర్కోకుండా ఉండడానికి అవసరమైన మేరకు ప్రత్యేక సర్వీసుల సేవల్ని వినియోగించుకుంటోంది.  రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు దిశానిర్ధేశంలో మంత్రి, ఎం.డిలు ప్రజా రవాణా స్థితిగతుల్ని నిరంతరం పరిశీలిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సూచనలు ఇస్తూ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ సమ్మె కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రయాణీకులకు రవాణా సదుపాయాలు కల్పించే విషయంలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు తెలిపారు.

అయితే, బుధవారం నడిపిన సంస్థ బస్సులు మొత్తం 5049 (ఇందులో 3116 ఆర్టీసీ, 1933  అద్దె బస్సులు, (48.27శాతం)లతో పాటు  సుమారు  6000 ప్రైవేట్‌ వాహనాలను తిప్పగలిగారు. సమ్మె జరగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎం.ఎం.టి.ఎస్‌ రైళ్ల రాకపోకలను పెంచడంతో ప్రయాణీకులకు కొంత ఊరట లభించింది.