September 24, 2020
  • September 24, 2020
Breaking News
  • Home
  • TS News
  • పోర్టియా ఆధ్వర్యం లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

పోర్టియా ఆధ్వర్యం లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

By on September 30, 2019 0 404 Views
????????????????????????????????????

365తెలుగు.కామ్ ఆన్లైన్ న్యూస్, సెప్టెంబర్ , హైదరాబాద్,2019 : అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని, భారతదేశంలో అగ్రశ్రేణి కన్స్యూమర్ హెల్త్ బ్రాండ్ పోర్టియా మెడికల్ నేడు వెల్‌నెస్ మరియు హ్యాపినెస్ కార్యక్రమాన్ని ‘వియ్ కేర్’ శీర్షికన హైదరాబాద్‌లోని ఫాతిమా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, మొత్తంమ్మీద 500 మందికి పైగా సీనియర్ సిటిజన్లను బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లో కవర్ చేశారు. బెంగళూరుతో పాటుగా ఈ సెషన్లును కళైవాణి ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ చారిటబల్ ట్రస్ట్, చెన్నై ; గాంధీ ఓల్డేజ్ హోమ్, బెంగళూరు మరియు గురు విశ్రామ్ వృద్ధ్ అశ్రమం, న్యూఢిల్లీలో నిర్వహించారు. సీనియర్ సిటిజన్లు తమకు తాము ప్రత్యేకం అని భావించడంతో పాటుగా సంతోషంగా ఉంటూనే ఈ కార్యక్రమాలను ప్రశంసించాలనే లక్ష్యంతో చేశారు. ఈ కార్యక్రమాన్ని పోర్టియా మెడికల్ యొక్క కేర్ మరియు కంపాషన్ అనే మౌలిక విలువలకనుగుణంగా తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమం ఆసక్తికరమైన ఐస్‌బ్రేకర్ సెషన్‌తో ఆరంభమైంది. అనుసరించి సంగీతం, సరళమైన వ్యాయామాలను నిర్వహించారు. అనంతరం 10 నిమిషాల పాటు మెడిటేషన్ సెషన్ నిర్వహించారు. పోర్టియా మెడికల్ నుంచి సానుభూతి మరియు అభిరుచి కలిగిన వ్యక్తులు పెద్దలతో సానుకూల సంభాషణలు జరుపడంతో పాటుగా వారి ఆలోచనలు మరియు భావాలను పంచుకోవాల్సిందిగా ప్రోత్సహించారు. తమతో సంభాషించడంతో పాటుగా వారి కథల పట్ల ఆసక్తిని కనబరుస్తూనే, వారి ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల ఆసక్తిని కనబరచడమే వారికి ప్రత్యేకం. హాజరైన ప్రతి ఒక్కరికీ లంచ్ అందించడంతో ఈ కార్యక్రమం ముగిసింది.

దీని గురించి శ్రీమతి మీనా గణేష్, కో-ఫౌండర్ అండ్ సీఈవో, పోర్టియా మాట్లాడుతూ “గత ఐదు సంవత్సరాలుగా పోర్టియా మెడికల్ 3లక్షల మందికి పైగా వయసు మీద పడిన రోగులకు సేవలను అందించింది మరియు మేమెప్పుడూ కూడా ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన జీవితం అందించాలని కోరుకుంటుంటాం. ఆ దిశగా ప్రారంభించిన ప్రయత్నం వియ్ కేర్ ప్రోగ్రామ్. వయసు మీద పడిన వారికి కేరింగ్ ఇవ్వడమంటే కేవలం వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం మాత్రమే కాదు వారి సంపూర్ణావసరాలను తీర్చడం. ఈ కార్యక్రమం ద్వారా, ఎన్‌జీవోలోని సీనియర్ సిటిజన్లు కేవలం వ్యాయామాలు మరియు మెడిటేషన్ కార్యక్రమాలు చేయడం మాత్రమే కాదు, తమను తాము వ్యక్తీకరించుకుంటూనే తమ ఆందోళనలను సైతం వలెంటీర్లతో తెలుపుతున్నారు. పోర్టియా హెల్త్ ప్రైమ్‌లో ఇది భాగం, కీలక నగరాలలో వృద్ధి చెందుతున్న ఎల్డర్ కమ్యూనిటీస్‌ను చేతనం చేసే లక్ష్యంతో దీనిని చేస్తున్నాం” అని అన్నారు

సీనియర్ సిటిజన్ విభాగంలో అధికశాతం మంది ప్రజలు చేరుతున్నారు. 2030 నాటికి అంతర్జాతీయంగా సీనియర్ సిటిజన్ల సంఖ్య 1.4 బిలియన్ ఉండొచ్చని అంచనా.2050 నాటికి దేశ జనాభాలో ఐదవ వంతు పెద్ద వయసు వారు ఉండొచ్చు. అయినప్పటికీ వారి ప్రత్యేక మానసిక, శారీరక, పౌష్టికాహార అవసరాల మీద పెద్దగా అవగాహన లేదు. పోర్టియా యొక్క వీ కేర్ ప్రోగ్రామ్‌ను పెద్దవయసు వారి నాణ్యమైన జీవనం మెరుగుపరిచేందుకు లక్ష్యంగా చేసుకున్నాం. వ్యాయామాలు మరియు ఇతర సామాజిక అనుసంధానిత కార్యక్రమాలు వంటివి పెద్దవయసు ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇవి సెరోటోనిన్ విడుదలకు తోడ్పడతాయి; శరీరంలో విడుదలయ్యే ఈ రసాయనం వల్ల సాధారణ సంతోషం, ఆరోగ్యంగా ఉన్నామన్న భావన కలుగుతుంది. ఈ నేపథ్యంలో వీ కేర్ ప్రోగ్రామ్ ను సీనియర్ సిటిజన్ల శరీరం, మనసు, ఆత్మ సంక్షేమం కోసం తీర్చిదిద్దాం. ధాన్యం మరియు సులభమైన రీతిలో చేసేటటువంటి వ్యాయామాల ద్వారా వారితో అనుసంధానించడాన్ని లక్ష్యంగా చేసుకుంది.

హోమ్ హెల్త్‌కేర్ విభాగంలో అగ్రగామిగా, పోర్టియా ఇప్పుడు రోగికి అన్ని రకాల క్లీనికల్ అవసరాలకు ఒన్ స్టాప్ షాప్‌గా ఉంది. ల్యాబ్ సేవలు, ఫార్మా డెలివరీ మరియు యంత్రసామాగ్రి/పరికరాల రెంటల్స్ మరియు అమ్మకాలు, రోగి ఇంటి వద్ద వైద్య సిబ్బందిని నియమించడం వరకూ అన్నీ చేస్తుంది. ప్రారంభం నాటినుంచి భారతదేశంలో 16 నగరాలలో 3.5 మిలియన్ల పేషంట్ విజిట్స్‌ను పోర్టియా పూర్తి చేసింది. ఈ నగరాల్లో బెంగళూరు, ఎన్‌సీఆర్, ముంబై, పూణె, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, లక్నో, చండీఘడ్, జైపూర్, ఇండోర్ ఉన్నాయి. ఈ కంపెనీ 150000కు పైగా పేషంట్ విజిట్స్‌ను ప్రతి నెలా నిర్వహించడంతో పాటుగా 70కు పైగా సుప్రసిద్ధ హాస్పిటల్ భాగస్వాములు, 15 ఫార్మా మేజర్స్, సుప్రసిద్ధ భీమా కంపెనీలతో భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.