365తెలుగుడాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, సెప్టెంబర్ 20,ముంబై, 2019: ఎరోస్ నౌ,  గ్లోబల్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఎరోస్ ఇంటర్నేషనల్ పి.ఎల్.సి యొక్క సౌత్ ఏషియన్ ఎంటర్టైన్మెంట్ ఒటిటి (ఓవర్-ది-టాప్) వీడియో ప్లాట్ పార్మ్ మరియు వినియోగదారులకు ఆకర్శణీయమైన కంటెంట్ అందించే ఇంటర్నెట్ జనరేషన్ అల్టిమేట్ వన్ స్టాప్ డెస్టినేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులను ఉద్దేశించి, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మీద ఆధారపడే తరవాత తరం ఆన్ లైన్ వీడియో ప్లాట్ ఫార్మ్ తయారు చేయుటకు నేడు మైక్రోసాఫ్ట్ తో సరికొత్త సహకార సంబంధాన్ని ప్రకటించింది. ఇండియాలో ఆన్ లైన్ వీడియో క్షేత్రంలో మైక్రోసాఫ్ట్ కి ఇది ఒక విశిష్ట సహకార సంబంధం అవుతుంది.  

తమ నూతన కల్పనల చరిత్ర నిర్మాణంలో మరో ముందడుగు వేస్తూ ఎరోస్ నౌ, టెక్నాలజీ మరియు అభివృద్ధి కి సంబంధించిన క్రింది మూడు రంగాలలో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ తో సహకార సంబంధాలు కలిగి ఉంటుంది:

  1. ఇన్ట్యూటివ్ ఆన్లైన్ వీడియో ప్లాట్ ఫార్మ్: మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మరియు అజ్యూర్ మీడియీ సర్వీసెస్ ని ఉపయోగించుకుని, ఎరోస్ ఒక సరికొత్త, ఇన్ట్యూటివ్ ఆన్లైన్ వీడియో ప్లాట్ ఫార్మ్ ని అభివద్ధి చేస్తుంది. ఈ కొత్త ప్లాట్ ఫార్మ్ వివిధ ప్రాంతాలలోని వివిధ భాషల వినియోగదారులకు,  అజ్యూర్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సిడిఎన్) తో సహా, ఒక రోబస్ట్ ఇన్ప్రాస్ట్రక్చర్ సహకారంతో నిరంతరంగా కంటెంట్ డెలివరీ చేస్తుంది.
  2. ఇంటరాక్టివ్ వాయిస్ ఆఫరింగ్స్: ఎరోస్ తమ వినియోగదారుల కొరకు, అజ్యూర్ ఎఐ టూల్స్ సామర్థ్యంతో, 10 భారతీయ భాషలలో ఒటిటి యాప్ వీడియో సెర్చ్ అనుభవం మరియు వీడియో కంటెంట్ కొరకు వాయిస్ సెర్చ్ తో సరికొత్త ఇంటరాక్టివ్ వాయిస్ ఆఫరింగ్స్ తయారు చేయుటకు పని చేయబోతున్నది.
  3. పెర్సనలైజ్డ్ రికమండేషన్ ఇంజిన్: వినియోగదారుని సంతృప్తి మరియు విశ్వసనీయత పెంచుట కొరకు, ఎరోస్ తమ సొంత డేటాని అజ్యూర్ ఎఐ, అనలిటికల్స్, క్లౌడ్ డేటా వేర్ హౌసింగ్ సొల్యుషన్స్ మరియు అజ్యూర్ మీడియా సర్వీసెస్ తో సమ్మిళితం చేసి, తమ వినియోగదారులకు విశిష్టమైన పెర్సనలైజ్డ్ కంటెంట్ రికమండేషన్ ఇచ్చే ఓక ఇంజన్ ని తయారు చేయబోతున్నది.

ఈ ప్రకటనపై స్పందిస్తూ, రిషిక లుల్లా సింగ్, సి.ఇ.ఒ – ఎరోస్ డిజిటల్, ఇలా అన్నారు, “ఆన్లైన్ వీడియో మార్కెట్ టెక్నాలజీని వినియోగిస్తున్న తీరులో ఒక పరిపుష్టమైన నూతన మార్పుని సంతరించుకుంది మరియు ఇది వినియోగదారుని ప్రయాణం మరియు ప్రేక్షక అనుభవాన్ని పెంచబోతున్నది. ఎరోజ్ నౌ వద్ద మేము ఈ బ్రాండ్ కి ప్రధాన శక్తి అయిన ఒక సరికొత్త సాంకేతికతను తీసుకురావటంలో ముందడుగు వేశాం. మేము వీడియో వ్యాపారంలో ప్రముఖ రూపకర్తలుగా రూపొందుట మరియు ఇది దీనిని ఇతరులు అనుసరించుటకు ఒక స్వర్ణ ప్రమాణంగా మార్చుట ఈ కొలాబరేషన్ (సహకార అనుబంధం) యొక్క ప్రధాన ఉద్దేశం మరియు లక్ష్యం. మాకు సరికొత్త ప్రమాణాల నవీన అన్వేషణ మరియు తర్వాత తరం ఆన్ లైన్ వీడియోకి మార్గం తయారు చేయుటలో శక్తివంతమైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ పై మాకు అపారమైన విశ్వాసం ఉంది.”

పెగ్గీ జాన్సన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మైక్రోసాఫ్ట్ కార్ప్, ఇలా అన్నారు, “ ఆన్-డిమాండ్ వీడియో అన్వేషకులుగా, ఎరోస్ నౌ లక్షలాది ప్రజలు కంటెంట్ అందుకుని వినియోగించుకునేలా మార్గాన్ని సులభతరం చేస్తున్నది. టెక్నాలజీ మరియు మీడియాలో మా సంయుక్త ప్రావీణ్యాన్ని వినియోగించుకుని, ఆ ఫౌండేషన్ మీద ఆధారపడి ఇండియాలో అత్యంత వేగంగా పెరుగుతున్న డిజిటల్ గా కనెక్ట్ అయిన వినియోగదారుల కొరకు ఎంటర్టైన్మెంట్ ని తిరిగి సరికొత్తగా ఆలోచించి అందించటానికి మాకు ఒక సదవకాశం లభించింది.”

“ఇండియా, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆన్ లైన్ వీడియో కంటెంట్ అభివృద్ధి కలిగిన డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ మరియు మీడియా మార్కెట్. ఎఐ మరియు ఇటలిజంట్ క్లౌడ్ టూల్స్ మీడియా వ్యాపారంలో తర్వాత డ్రైవర్స్ కాబోతున్నవి. ఇవి కంటెంట్ తయారు చేయుట మరియు వినియోగదారుని సంతృప్తి విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రభావం చూపబోతున్నవి. వినియోగదారుల ఆన్ లైన్ వీడియో వాచింగ్ అనుభవాన్ని రీడిఫైన్ చేయుటకు ఎరోస్ నౌ తో పనిచేయటం మాకు చాలా సంతోషం కలిగిస్తూ ఉంది,” అన్నారు అనంత్ మహేశ్వరి, ప్రెసిడెంట్, మైక్రోసాఫ్ట్ ఇండియా.

మైక్రోసాఫ్ట్ తో ఎరోస్ పనిచేయుట వలన, తమ వినియోగదారులకు స్ట్రీమింగ్ సేవలు ఎలా అందించాలన్న దానిలో ఎరోస్ కు పరివర్తనలో సహాయం లభించుట మాత్రమే కాక, అందించే విధానాన్ని తిరిగి ఆలోచించే సదవకాశం కూడా లభిస్తుంది. ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ అనుభవం మరింతగా పెంచుటకు మరియు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించుటకు ఈ డిజిటల్ ట్రాన్సఫార్మేషన్ యుగంలో ఇది ఒక ముందడుగు.