December 16, 2019
  • December 16, 2019
Breaking News
  • Home
  • Top Stories
  • హీరోస్ బిహైండ్ ది హీరోస్‌తో వేడుక చేసిన సోనీ YAY!

హీరోస్ బిహైండ్ ది హీరోస్‌తో వేడుక చేసిన సోనీ YAY!

By on September 12, 2019 0 96 Views

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్12 ,హైదరాబాద్:నేటితరం ప్రసిద్ధ వ్యక్తుల వెనుక చోదక శక్తిగా నిలిచిన వారి శ్రమను, తోడ్పాటును గుర్తించడం కోసం డివైన్, రెమో డిసౌజా, దినేశ్ ల్యాడ్, దిలీప్ వెంగ్‌సర్కార్, పుల్లెల గోపీచంద్, అఫ్రాజ్ షా, రియా శర్మ లాంటి ప్రసిద్ధ వ్యక్తులను ఈ ఛానెల్ సత్కరించింది

నిజమైన హీరోలు ఎల్లప్పుడూ తెరముందుకు రాకపోవచ్చు. బదులుగా ఇతరులు వారి అత్యుత్తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడంలో వారికి బోధించడానికి, వారికి గురువుగా నిలవడానికి , వారికి అవసరమైన సాయం అందించడానికి సిద్ధపడవచ్చు. వారి జ్ఞానం, లోతైన ఆలోచన ద్వారా మనల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి టీచర్లు కూడా ఈ పనే చేస్తుంటారు. అందుకోసం అసంఖ్యాకమైన గంటలను మన కోసం కేటాయిస్తుంటారు. వారి శ్రమను , ప్రేమను మనకోసం పంచడం ద్వారా మన జీవితాల్లోని అతిగొప్ప హీరోల్లో ఒకరుగా నిలిచిపోతుంటారు. విభిన్న రంగాల్లో అత్యంత విజయవంతంగా నిలిచిన ప్రసిద్ధ వ్యక్తులను మనం చూస్తున్నామంటే, వారు ఆ విధమైన విజయం సాధించడం వెనుక వారికి అండగా నిలిచిన వారి టీచర్ల కఠోర శ్రమ సైతం దాగి ఉంటుందంటే అందులో సందేహమేమీ లేదు. ఈ ఏడాది, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, అలాంటి హీరోలను తమ హీరోస్ బిహైండ్ ది హీరోస్ ద్వారా సత్కరించడానికి సోనీ YAY! సిద్ధమైంది.

భారతదేశంలో గురువు స్థానం ఎల్లప్పుడూ అగ్రపీఠంగానే ఉంటోంది. అందుకే, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వార్షిక వేడుకలు నిర్వహించే క్రమంలో అలాంటి గురువులను సత్కరించడానికి సోనీ YAY వారి హీరోస్ బిహైండ్ ది హీరోస్ సిద్ధమైంది. ఎందుకంటే, వారు విభిన్న రంగాల్లోని ప్రపంచ-శ్రేణి వ్యక్తులను తీర్చిదిద్దడం మాత్రమే కాకుండా, సరికొత్త నైపుణ్యాలు మొగ్గ తొడగడంలో వారి ప్రోత్సాహం సైతం మరువలేనిది. అందుకే, పిల్లలకు వారి టీచర్లు, మెంటర్లు ,మార్గదర్శకులతో ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా సోనీ YAY ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.