December 16, 2019
  • December 16, 2019
Breaking News
  • Home
  • woman oriented news
  • స్విట్జర్లాండ్ లో సేదతీరుతున్న టీవీ తారలు

స్విట్జర్లాండ్ లో సేదతీరుతున్న టీవీ తారలు

By on September 12, 2019 0 107 Views

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 12,హైదరాబాద్:వెలుగుజిలుగుల నటనారంగంలో ఉన్నవారెంతో మంది స్విట్జర్లాండ్ తో ఎంతో కాలంగా ప్రేమానుబంధాలను కలిగిఉన్నారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ ఆల్పైన్ దేశం మన టీవీ తారలను కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. ఇటీవల భారతీయ టీవీ తారలు ముగ్గురు స్విట్జర్లాండ్ కు వెళ్ళి సేదతీరారు.

హడావుడి నగర జీవితం, ఊపిరి సలపనివ్వని షూటింగ్ షెడ్యూల్స్ నుంచి కాస్తంత ఆహ్లాదం కోసం స్విట్జర్లాండ్ వెళ్ళారు. ఇలా వెళ్ళిన వారిలో ఎరికా ఫెర్నాండెజ్, సురభి చందన, సురభి జ్యోతి ఉన్నారు. ఏళ్ళుగా స్విట్జర్లాండ్ టీవీ తారలను అలరిస్తూనే ఉంది. నియా శర్మ, అనితా హస్సానందని, సాన్యా ఇరానీ, దివ్యాంక, త్రిపాఠి, శివాంగి జోషి లేదా హీనా ఖాన్…. లాంటి వారెందరి జాబితాల్లో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటుంది. స్విట్జర్లాండ్ లో ఈ తారలు చేసే సందడి వారి అభిమానులను కూడా అలరిస్తుంటుంది.