July 23, 2019

సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, జులై 23 , హైదరాబాద్: సమాచార భవన్ లో మహిళా ఉద్యోగులు భక్తి శ్రద్దలతో కనకదుర్గ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, తొట్టెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి గుడిలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, అదనపు సంచాలకులు నాగయ్య, సమాచార శాఖ చీఫ్ ఇంజనీర్ కిశోర్ బాబు, అకాడమీ కార్యదర్శి ఎస్. విజయ్ గోపాల్, జాయింట్ డైరెక్టర్ జగన్, తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే బోనాల పండుగను ఈ ప్రాంతం పెట్టింది పేరని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్దిగా కురియాలని కోరుకున్నారు. తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టి.జి.ఓ. అధ్యక్షులు సత్యనారాయణ, టి.ఎన్.జి.ఓ. అధ్యక్షులు కారం రవీందర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కృష్ణయాదవ్, బి.టి. ఎన్.జి.ఓ. అధ్యక్షులు సత్యనారాయణ, సమాచార శాఖ అధికారులు విజయ్ భాస్కర్ రెడ్డి, రాధా కిషన్, శ్రీనివాస్, పవన్ కుమార్, హష్మి, శ్రీమతి యామిని, శ్రీమతి వనజ, మీనాక్షి, శైలేష్ రెడ్డి, బాజ్ పాయ్, అనిల్, జితెందర్, తదితరులు పాల్గొన్నారు.