August 20, 2019
  • August 20, 2019
Breaking News
  • Home
  • Trending
  • యూత్ ఎంటర్టైనర్ “కెఎస్ 100” మూవీ

యూత్ ఎంటర్టైనర్ “కెఎస్ 100” మూవీ

By on July 16, 2019 0 46 Views

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, జులై 16 , హైదరాబాద్:  మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్ లుగా షేర్ దర్శకత్వం లో  జులై 12 న విడుదలై విజయం  సాధించిన చిత్రం  “కెఎస్100”. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి ఈ సినిమా ను నిర్మించారు.. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతాన్ని, భాష్య శ్రీ సాహిత్యాన్ని అందించారు..  చిత్ర యూనిట్  సక్సెస్ మీట్ ఏర్పాటు చెసారు 

ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాము. యూత్ ఎక్కువగా మా సినిమాను ఇష్టపడుతున్నారు.నటుడిగా నాకు ఈ చిత్రం గుడ్ బిగినింగ్ అన్నారు. ‌నన్ను,నా సినిమాను  ఆదరించినందుకు ధన్యవాదాలన్నారు. చిత్ర దర్శకుడు షేర్  మాట్లాడుతూ ” కెఎస్100″ సినిమా వెనుక మా కష్టం చాలా ఉంది. విడుదలై మా కష్టానికి  తగ్గ ప్రతిఫలం‌ లభించింది. చిన్నగా విడుదలై సైలెంట్ హిట్ అయింది. మా టీమ్ అందరు మంచి పొజిషన్స్ కు వెళ్లాలన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “కెఎస్100” చిత్రం  జులై 12  న  దాదాపు 200 థియేటర్స్ లో  రిలీజ్ అయి యూత్ ను ఆకట్టుకుంటొంది…  అన్నింటిలోనూ ఆడుతోంది. ఒక మంచి ట్రెండీ  సినిమా తీస్తే ఎలా ఉంటుందొ మా సినిమా నే ఉదాహారణ. డైరెక్టర్ షేర్ మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు   మెసేజ్ మా సినిమా ద్వారా ఇచ్చారన్నారు. నవనీత్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడిగా నా వర్క్ కమంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.
సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫారూఖ్ మాట్లాడుతూ.. ఐదు సినిమాల మధ్య విడుదలై ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఆడుతోందన్నారు.

నటీనటులు :  అక్షిత, అషి,పూర్వి, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు : మాటలు- కథ- కధనం -దర్శకత్వం: షేర్నిర్మాత : వెంకట్ రెడ్డికెమెరా: వంశీమ్యూజిక్: నవనీత్ చారిఎడిటర్: లొకెష్ చందు, నాగార్జునసాహిత్యం: భాష్య శ్రీ, కొరియోగ్రఫీ: జొజొయాక్షన్: మాలేష్నేపథ్యసంగీతం :రామ్ మోహన్ చారిఅసొషియెట్ డైరెక్టర్: రవితేజఆర్ట్: సుదర్శన్.