January 29, 2020
  • January 29, 2020
Breaking News
  • Home
  • Trending
  • అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం సగం రేటుకే

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం సగం రేటుకే

By on July 13, 2019 0 198 Views

యువత కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించిన అమెజాన్


వార్షిక ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న18-24 వయస్సుకస్టమర్లకు  క్యాష్‌బ్యాక్

జూలై 15-16   ఈ అద్భుతమైన ఆఫర్ తో ప్రైమ్ డే ఆనందించండి

365తెలుగు డాట్ కామ్  ఆన్ లైన్ న్యూస్ , జూలై 13, 2019 బెంగళూరు: – INR 999   వార్షిక ప్రైమ్ సభ్యత్వంలో చేరడం ద్వారా 18-24 వయస్సు కస్టమర్లు ఇప్పుడు 50 శాతం (INR 500) క్యాష్‌బ్యాక్ పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. ప్రైమ్ కోసం సైన్ అప్ చేయడం ద్వారా, Amazon.in లో వారి వయస్సును ధృవీకరించడం ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. సంవత్సరం మొత్తం, Amazon.in లో ప్రైమ్  సభ్యులు పదిలక్షల వస్తువులపై ఉచిత ఒక రోజు  లేక  రెండు రోజుల డెలివరీని పొందవచ్చు, డీల్స్,  అమ్మకం సంఘటనలకు శీఘ్రమైన ప్రత్యేకమైన యాక్సిస్; అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌లోని అలెక్సాలో డౌన్‌లోడ్లతో ఎప్పుడైనా అపరిమిత ప్రకటన-రహిత సంగీతం, ప్రస్తుత ఇంకా ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, పాపులర్ ఇండియన్ ఇంకా హాలీవుడ్ చిత్రాలు, యుఎస్ టీవీ సిరీస్, ఇండియన్, ఇంటర్నేషనల్ పిల్లల ప్రదర్శనలు  అతి పెద్ద సంకలనం, అమెజాన్ ఒరిజినల్ సిరీస్, ప్రైమ్ వీడియోలో ప్రకటన-రహితంగా లభిస్తుంది, ప్రపంచ స్థాయి కస్టమర్ అనుభూతి, ప్రైమ్ రీడింగ్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే ఈ -బుక్స్‌కు అపరిమిత యాక్సిస్. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, అందానికి సంబంధించిన ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసరాలు ఇంకా ఎన్నో అతి తక్కువ ధరలకు వేలాది డీల్స్ ను అందించే జూలై 15 – 16 తేదీలలో ప్రైమ్ డేకి ముందు, ఈ ఆఫర్‌ను పొందడానికి మంచి సమయం; బ్లాక్ బస్టర్ వీడియో టైటిల్తో పాటు, సెలబ్రిటీలు క్యూరేటెడ్ అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ప్లేలిస్టులు ఇంకా ఎన్నో.

ప్రైమ్ సభ్యత్వాలపై యువత కోసం ఆఫర్ పొందటానికి, మీరు చేయాల్సిందల్లా సైన్ అప్ చేయడం, ధృవీకరించడం ఇంకా నగదు తిరిగి పొందడం! 18-24 సంవత్సరాల వయస్సు గల కస్టమర్లు అమెజాన్ యాప్లో www.amazon.in/prime ని సందర్శించి ప్రైమ్ సభ్యత్వం ఒక సంవత్సరానికి సైన్ అప్ చేయవచ్చు. ఏదైనా ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతి (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్‌బ్యాంకింగ్ లేదా అమెజాన్ పే బ్యాలెన్స్) తో Rs. 999 చెల్లించడం ద్వారా ‘యువత కోసం ఆఫర్’ బ్యానర్ నుండి సభ్యత్వం పొందవచ్చు. కస్టమర్లు వారి పాన్ కార్డు, మెయిలింగ్ చిరునామా మరియు ఫోటోను అప్‌లోడ్ చేయడం ద్వారా వారి వయస్సును ధృవీకరించాలి. ధృవీకరించిన తర్వాత, INR 500 కస్టమర్ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ ఖాతాకు 10 రోజుల్లో జమ అవుతుంది. అమెజాన్ పే క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లు తమకు ఇష్టమైన అన్ని కొనుగోళ్లు, బిల్ చెల్లింపులు ఇంకా రీఛార్జిలపై వేలాది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ భాగస్వామి వ్యాపారులతో బుక్‌మైషో, స్విగ్గి, డొమినోస్, రెడ్‌బస్ ఇంకా ఎక్కడైనా అమెజాన్ పే అంగీకరించిన చోట ఉపయోగించవచ్చు.

“18-24 సంవత్సరాల వయస్సు గల కస్టమర్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ పొందడానికి స్వేచ్ఛను కోరుకుంటున్నారని మేము గుర్తించాము. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వంపై 50 శాతం క్యాష్‌బ్యాక్‌తో, కస్టమర్లు ప్రైమ్ ద్వారా ఉత్తమమైన షాపింగ్ ఇంకా వినోదాన్ని ఆస్వాదించవచ్చు, అదే సమయంలో షాపింగ్, ఫుడ్ డెలివరీ, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, మరెన్నో తమ అభిమాన కార్యకలాపాల కోసం ఖర్చు చేయడానికి 500 రూపాయలు ఆదా చేస్తారు.” అని భారతదేశం యొక్క అమెజాన్ ప్రైమ్ డైరెక్టర్, హెడ్ అక్షయ్ సాహి అన్నారు. “2019 ప్రైమ్ డే సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రారంభించటానికి మేము ఆనందిస్తున్నాము, ప్రైమ్ సభ్యులకు గొప్ప డీల్స్, కొత్త లాంచ్‌లు ఇంకా బ్లాక్‌బస్టర్ వినోదం సంబందించిన ప్రత్యేకమైన యాక్సిస్ను అందించే 48 గంటల వేడుకను మా యువ కస్టమర్లు ఆనందిస్తారని ఆశిస్తున్నాము.”

ప్రైమ్ డే పై అత్యుత్తమ షాపింగ్ ,వినోదం 

ప్రతి రోజూ మీ జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రైమ్­ను డిజైన్ చేయటం జరిగింది. 100 మిలియన్ ప్రైమ్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్  లాభాలను ఆనందంగా పొందుతున్నారు. వాటిలో, ప్రైమ్ డే పై అత్యుత్తమ షాపింగ్ ,వినోదం ఉన్నాయి. భారతదేశంలో ఇందులో, ఉచిత ఒక-రోజు, రెండు-రోజుల డెలివరీ, అవార్డులు గెలుచుకున్న చలనచిత్రాలు, టివి ఎపిసోడ్లును ప్రైమ్ వీడియో పై పరిమితులేవీ లేకుండా యాక్సెస్ చేయగలగటం; ప్రైమ్ మ్యూజిక్­కు అపరిమితమైన యాక్సెస్, ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకాలకు ప్రైమ్ రీడింగ్ ద్వారా అపరిమిత యాక్సెస్, ఎంపిక చేసిన లైట్నింగ్ డీల్స్­కు సత్వర యాక్సెస్, ఇంకా మరెన్నో ఉన్నాయి. ఢిల్లీ ఎన్­సిఆర్, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై  నగరాల్లోని సభ్యులు అల్ట్రా-ఫాస్ 2-గంటల డెలివరీని అమెజాన్ ఉపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ , నిత్యావసరాల పై ప్రైమ్ నౌ పై పొంది ఆనందించగలుగుతారు. లాగ్ ఆన్ అవ్వండి www.amazonin/Prime పై, నేడే ప్రైమ్ సభ్యులు అవ్వండి.