April 4, 2020
  • April 4, 2020
Breaking News

ప్రేమజంట రివ్యూ

By on June 29, 2019 0 424 Views


నటీనటులు : రామ్ ప్రణీత్ , సుమయ
సంగీతం : నిఖిలేష్
నిర్మాత : మహేష్ మొగులూరి
దర్శకత్వం : నిఖిలేష్ తోగరి
రేటింగ్ : 3/5

365తెలుగుడాట్ కామ్, జూన్ 29,హైదరాబాద్ : తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ప్రేమజంట . రామ్ ప్రణీత్ , సుమయ జంటగా నటించిన ఈ చిత్రానికి నిఖిలేష్ దర్శకత్వం వహించగా మహేష్ నిర్మించాడు . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే .

కథ : నందిని ( సుమయ ) ని టెన్త్ క్లాస్ లోనే ప్రేమించిన చందు (రామ్ ప్రణీత్ ) ప్రేయసిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా ఫస్ట్ వస్తాడు . దాంతో ఐ ఐ టి లో సీటు వచ్చినప్పటికీ తన పేదరికం వల్ల అలాగే తాను ప్రేమించిన అమ్మాయి కాలేజ్ లో జాయిన్ కావడంతో తాను కూడా ఎంపీసీ క్లాస్ లో జాయిన్ అవుతాడు . అయితే తన ప్రేమ విషయం నందిని కి చెప్పడానికి సంశయిస్తుంటే నందిని చొరవ తీసుకొని ప్రేమిస్తే చెప్పుమని అంటుంది చందుతో . సరిగ్గా ఇదే సమయంలో వీళ్ళ ప్రేమ పెద్దలకు తెలియడంతో ఆదిలాబాద్ నుండి పారిపోయి హైదరాబాద్ వస్తారు ఈ మైనర్ ప్రేమికులు . హైదరాబాద్ వచ్చాకా ఈ మైనర్ ప్రేమికులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

పెర్ఫార్మెన్స్ : సుమయ అందంగా ఉంది , అంతకంటే బాగా అందంగా నటించింది . రామ్ ప్రణీత్ కూడా తన పాత్రకు న్యాయం చేసాడు . ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన టిక్ టాక్ దినేష్ తనదైన కామెడీ టైమింగ్ తో , డైలాగ్స్ తో అలరించాడు . ఇక మిగిలిన పాత్రల్లో షఫీ , స్వాతి నాయుడు , రాజా రవీంద్ర , ఉత్తేజ్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు .

టెక్నీకల్ టీమ్ : మైనర్ బాలబాలికల ప్రేమ వ్యవహారాన్ని అలాగే పరువు హత్యల నేపథ్యాన్ని ఎంచుకొని మంచి ప్రయత్నం చేసాడు దర్శకుడు . అందుకు తగ్గ నటీనటులను కూడా ఎంచుకొని భేష్ అనిపించుకున్నాడు . వినసొంపైన పాటలతో ఆద్యంతం రక్తికట్టించారు . డైలాగ్స్ బాగున్నాయి . నిర్మాణ విలువలుకూడా బాగున్నాయి . మంచి అంశమే ఎంచుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది .