June 25, 2019

డయాలసిస్ పేషెంట్లూ మామిడిపండ్లు తినవచ్చు: డైటీషియన్, మృణాల్ పండిట్, నెఫ్రోప్లస్

365తెలుగు డాట్ కాం ఆన్లైన్ న్యూస్, జూన్ 25, హైదరాబాద్ : మార్కెట్‌లో నడిచి వెళ్తున్న సమయంలో మామిడిపళ్ల సువాసన మిమ్మల్ని ఆకర్షించే కాలం మళ్లీ వచ్చేసింది. విపరీతమైన ఎండలతో ఇబ్బందిపెట్టే వేసవిలో ఏకైక ఆనందం మామిడిపండ్లు అందుబాటులోకి రావడమే. అన్ని వయసులవారు ఇష్టపడే మామిడిపండ్లు ప్రకాశవంతమైన పసుపు రంగుతో , తీయటి జ్యూసీ రుచితో ఈ వేసవిని అద్భుతంగా మార్చేస్తాయి.

మామిడిపండ్లు రుచిగా ఉండడమే కాదు, ఇవి అత్యంత ఆరోగ్యకరమైనవి కూడా. ఇందులో శక్తిమంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు, సంవృద్ధమైన కేలరీలు ఉన్నాయి. ఇందులోని మ్యాంగీఫెరిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనాన్ని ‘ప్రకృతిసిద్ధ అద్భుత ఏజెంట్’గా చెబుతారు. గుండె జబ్బులు, క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం లాంటి డీజనరేటీవ్ వ్యాధులతో పాటు ఇతర జీవనశైలి రుగ్మతల నుంచి కూడా మామిడిపండ్లు ప్రభావవంతమైన రక్షణ అందిస్తాయి.

పూర్తి ఫినాలిక్ సమ్మేళనాలు, కెరటనాయిడ్లు మరియు ఆస్కారబిక్ ఆమ్లం లాంటి శక్తిమంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఆక్సిడేటివ ఒత్తిడి కారణంగా ఏర్పడే నష్టం నుంచి కూడా శరీరానికి రక్షణ అందిస్తుంది. మామిడి పండు మాత్రమే కాకుండా దీని తోలు, విత్తనం , గుజ్జు సైతం యాంటీ-మైక్రోబల్, యాంటీ-డయాబెటిక్, యాంటీ-క్యాన్సర్, కొలెస్ట్రాల్ తగ్గించే గుణం, ఇమ్యూనోమాడ్యులేటరీ లాంటి అనేక ఆరోగ్యకర సుగుణాలు కలిగి ఉంటాయి.

నోరూరించే మామిడిపండ్లు చూస్తే చాలామంది ఆగలేరు. అయితే, ఇందులోని అత్యధిక పొటాషియం నిల్వల కారణంగా డయాలసిస్ పేషెంట్లు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పొటాషియం అనే ఖనిజలవణం నాడీ మరియు కండర చర్యలను నియంత్రిస్తుంది. శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ సమతౌల్యం pH స్థాయిల నిర్వహణకు ఇది అత్యవసరం. మామిడిపండ్లలో అత్యధిక స్థాయిలో పొటాషియం ఉంటుందనే మాట నిజమే అయినప్పటికీ, మామిడి రకాన్ని బట్టి అందులో తేడా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల మామిడిలో దాదాపు 100 మి.గ్రా నుంచి దాదాపు 220 మి.గ్రా వరకు పొటాషియం ఉండే అవకాశముంది. 100 మి.గ్రా కంటే తక్కువ పొటాషియంతో ఉండే ఆహారాన్ని తక్కువ పొటాషియం కలిగిన ఆహారంగా చెబుతారు. డయాలసిస్ చేయించుకునే వారు అలాంటి ఆహారం తీసుకోవచ్చు.

మార్కెట్లో లభించే కొన్ని మామిడి రకాల్లోని పొటాషియం లభ్యత

మామిడి రకంప్రతి 100 గ్రా.ల్లో పొటాషియం మి.గ్రా.ల్లో
బంగినపల్లి144
గులబ్‌ఖాస్115
హిమసాగర్137
కేసర్142
నీలమ్137
పహేరి153
తోతాపురి160

*ఆధారంఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ (IFCT), 2017

తక్కువ పొటాషియం కలిగిన రకాలను ఎంచుకోవడం ద్వారా ఈ సీజన్‌లో మామిడిపండ్ల రుచిని చక్కగా ఆస్వాదించవచ్చు. తీసుకునే పొటాషియం పరిమాణం తగ్గాలంటే దానికి తగ్గట్టుగా మామిడిపండ్లు తినాలి. 75 గ్రాములు లేదా 2 పలచటి మామిడి ముక్కలను నిరభ్యంతరంగా తినవచ్చు. సీరమ్ పొటాషియం స్థాయిలు పెరిగిపోతాయనే ఆందోళన అవసరం లేదు. అయితే, ఒకరోజులో ఒకసారి మాత్రమే ఇలా తినొచ్చనే విషయం మర్చిపోకూడదు. కాబట్టి, వేసవి సమయంలో అత్యధిక పొటాషియం కలిగిన ఇతర ఆహారాలు తినడం నియంత్రించడం ద్వారా ఆ స్థానంలో మామిడిపండ్ల రుచిని ఆస్వాదించవచ్చు.