September 17, 2019
  • September 17, 2019
Breaking News
  • Home
  • Trending
  • ‘ఆనందం కోసం యోగ – సద్గురు తో సంభాషణ లో నాని’

‘ఆనందం కోసం యోగ – సద్గురు తో సంభాషణ లో నాని’

By on June 24, 2019 0 57 Views

365telugu.com online news హైదరాబాద్, june 24 :5 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 23 న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలుగు నటుడు  నాని సద్గురుతో సంభాషిచడం జరిగింది. ఆనందం కోసం యోగ – ఇన్ కాన్వర్సేషన్ విత్  ది మిస్టిక్ కార్యక్రమానికి  4000 మందికి పైగా జనులు హాజరయ్యారు.

 నాని “నా జీవితంలో ఒక్క ప్రశ్న కు కూడా సరిగ్గా సమాధానం చెప్పని నేను అన్ని ప్రశ్నలకూ సమాధానం తెలిసిన వ్యక్తికి ప్రశ్నలు వేయబోతున్నాను ” అని చమత్కరిస్తూ ప్రారంభించారు.ప్రేక్షకుల నవ్వుల మధ్య నాని అడిగిన మొదటి ప్రశ్న ఆనందం గురించి.ఈ  లైవ్లీ సెషన్లో, అతను మొదట ఆనందకరమైన యువకుడిననీ , కాని తనకు విజయం విశ్వసనీయంగా ఆనందాన్ని కలిగించలేదు అని ఫిర్యాదు చేసారు. దానికి సద్గురు ఒకవేళ మీరు ఆనందంగా ఉంటే , ప్రతిదీ అద్భుతమైనదిగా ఉంటుంది అన్నారు. స్మశాన కళ ఉట్టిపడే కొందరు మనుషుల గురించి మాట్లాడుతూ “మీరు దానిని సాధన చేయనవసరంలేదు. మరణం విషయానికి వస్తే అందరూ నాచురల్ స్టార్లే! పూర్తిగా సజీవంగా ఉండి , చనిపోవడం మంచిది, కానీ సగం సజీవంగా ఉండడం  హింస. ” అని సద్గురు అన్నారు. ఈ సంభాషణలో  దృష్ఠ్టి తియ్యడం వంటి భావనల దగ్గర నుండి డిప్రెషన్,పిల్లల పెంపకం వంటి ఎన్నో అంశాలను గురించి చర్చించడం జరిగింది.

 ముందుగా సాయంత్రం, సద్గురు రచించిన అంతర్జాతీయ బెస్టసెల్లర్ “ఇన్నర్ ఇంజనీరింగ్  – ఎ యోగిస్ గైడ్ టు జాయ్ ” పుస్తక తెలుగు అనువాదం “ఇన్నర్ ఇంజనీరింగ్ – యోగం ఆనంద మార్గం” ను  నాని ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఆంగ్లంలో 3 లక్షలకు పైగా కాపీలు అమ్ముడైంది మరియు 20 పైగా భాషలలో అనువదించబడింది. ఉత్సాహభరితమైన జనం సద్గురు గైడెడ్ మెడిటేషన్ ఆనందం కోసం యోగ లేదా నాద యోగ లో పాల్గొన్నారు.

వీడియో లింక్ : https://drive.google.com/drive/folders/1KhKxsr4ch_gJGbkl3Hbvv_jO1rwPwg41?usp=sharing