365తెలుగు డాట్ కాం ఆన్లైన్ న్యూస్, జూన్ 23 , హైదరాబాద్ : తారకరత్న హీరోగా నటించిన ‘కాకతీయుడు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. వి.సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ముగించుకుంది. సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రాన్ని జులై మొదటి వారంలో విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత తెలియజేశారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ఈ చిత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుందని నిర్మాత తెలియజేస్తున్నారు. వి.సముద్ర దర్శకత్వంలో గతంలో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. తాజాగా జైసేన చిత్రం కూడా ఆయన దర్శకత్వంలో రూపొందుతోంది. కాగా, కాకతీయుడు చిత్రం తారకరత్న బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథ, కథనాలతో రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలియజేస్తున్నాడు. సెన్సారైన చిత్రానికి సభ్యులు ప్రశంసలు దక్కడం విశేషం.  ఇదే అభిప్రాయాన్ని ప్రేక్షకులనుండి కూడా పొందుతామని చిత్ర యూనిట్‌ ఆశిస్తోంది.

కాకతీయుడు