June 25, 2019
  • June 25, 2019
Breaking News
  • Home
  • Trending
  •  మై గెలాక్సీ యాప్ పై వినియోగదారుల కోసం కె-డ్రామా, కె-పాప్ కంటెంట్­ను తెచ్చిన శామ్­సంగ్

 మై గెలాక్సీ యాప్ పై వినియోగదారుల కోసం కె-డ్రామా, కె-పాప్ కంటెంట్­ను తెచ్చిన శామ్­సంగ్

By on April 2, 2019 0 81 Views


ప్రవేశపెడుతున్నారు మూడు ప్రత్యేకమైన కె-డ్రామా సిరీస్ , బిటిఎస్, ఎక్సో, బిటిఒబి, మోన్­స్టా-ఎక్స్, తదితర రకాల బ్యాండ్లు

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, గురుగ్రామ్, ఏప్రిల్ 2, 2019– తన యూజర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందించాలన్న సంకల్పంలో అంతర్భాగంగా శామ్­సంగ్ ఇండియా ఈ రోజు, విస్తృత శ్రేణి ప్రఖ్యాతి చెందిన కొరియన్ కంటెంట్­ను, శామ్­సంగ్ వాడకందారుల కోసం ఉద్దేశించిన వినోదాత్మక హబ్ అయిన తన మై గెలాక్సీ యాప్ పై ప్రకటించింది. అంతర్జాతీయ బ్లాక్­బస్టర్ కె-డ్రామా శీర్షికలు జగ్లర్స్, క్వీన్ ఫర్ సెవెన్ డేస్ మరియు మ్యాన్­హోల్ ఇప్పుడు మై గెలాక్సీ యాప్ లో భారతదేశంలోని శామ్­సంగ్ వినియోగదారుల కోసం, కెబిఎస్ మీడియా వారి భాగస్వామ్యంలో, ప్రత్యేకంగా లభిస్తుంది. అంతే కాదు, శామ్­సంగ్ వినియోగదారులకు, 750కి పైగా అగ్రశ్రేణి కళాకారులు మరియు బిటిఎస్, ఎక్సో, బిటిఒబి, మోన్­స్టా-ఎక్స్, తదితర రకాల బ్యాండ్లకె-పాప్ మ్యూజిక్ వీడియోలు కూడా లభిస్తాయి.“మా వినియోగదారుల ఆసక్తులు, అభిరుచులకు మేము విలువనిస్తాము. భారతదేశంలో కె-పాప్ సంస్కృతికి ప్రజాదరణ పెరుగుతోదనటంలో ఎటువంటి సందేహము లేదు. భారతదేశంలో సహస్రాబ్దియువత యొక్క ఆవిర్భవిస్తున్న వినోదావసరాలను దృష్టిలో ఉంచుకుని మా మై గెలాక్సీ యాప్­ పై కె-కంటెంటును అందుబాటులోకి తేవటం మాకు ఆనందదాయకము. శామ్­సంగ్ కస్టమర్లు ఇప్పుడు కె-పాప్ మ్యూజిక్ మరియు ప్రత్యేకమైన కె-డ్రామాను తాము మెచ్చిన శామ్­సంగ్ స్మార్ట్­ఫోన్ పై అందుకోగలుగుతారు. మా యువ వినియోగదారులకు పేరుమోసిన ఈ కె-కంటెట్ ఆకర్షణీయం కాగలదని మేము విశ్వసిస్తున్నాము,”అని శామ్­సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ప్రమోద్ ముంద్రా, భారతదేశంలో నవసహస్రాబ్దిలో జన్మించినవారిలో కొరియన్ కంటెంట్ వినియోగం పట్ల పెరుగురుతున్న ఆసక్తిని గురించి వ్యాఖ్యానిస్తూ అన్నారు. కె-పాప్ మరియు కె-డ్రామాలు, అంతర్జాతీయంగా కొరియా సంస్కృతి పట్ల ఆసక్తిని పెంచేందుకు దోహదం చేస్తున్నాయి. భారతదేశంలో కూడా, కొరియా పట్ల పెరుగుతున్న అభిమానం భారతదేశంలో కూడా, ప్రత్యేకించి నవసహస్రాబ్దిలో జన్మించిన వారిలో, ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. 18-24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న మెట్రోవాసులు, 1వ శ్రేణి పట్టణాల్లో నివసించే యువతరంలో కొరియా సంస్కృతి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నది. మై గెలాక్సీ యాప్, భారతదేశంలోని శామ్­సంగ్ వినియోగదారులకు అత్యంత విలక్షణమైన కంటెంటును, పెరుగుతున్న వారి వినోదాత్మక అవసరాలకు తగిన విధంగా అందించటం కొనసాగిస్తోంది.మై గెలాక్సీ యాప్ పై స్ట్రీమ్ చేయబడుతున్న కొరియన్ కంటెంటులో ఇవి లభిస్తున్నాయి. జగ్లర్స్ఒక రొమాన్స్-కామెడీ డ్రామా, ఒక సెక్రటరీకి, ఆమె బాస్­కి మధ్య అవగాహనకు, ఆఫీసు బయటకు అది పూర్తిగా పొక్కిపోయే పద్ధతిని గురించిన కథ ఇది.

క్వీన్ ఫర్ 7 డేస్– ఒక చారిత్రాత్మక డ్రామా, ఏడు రోజులు సింహాసనాన్ని అధిష్టించిన ఒక రాణి కథను, రాజు లీ ఇయోక, లీ యంగ్­తో ఆమె ప్రేమ కథలను చూపుతుంది.మ్యాన్­హోల్–పిల్ అనే వ్యక్తి ప్రస్థానాన్ని ఈ కొరియన్ డ్రామా చూపుతుంది. ఇందులో కథానాయకుడు కాలంలో ప్రయాణిస్తూ, 28 ఏళ్ళ తన చెలి వివాహం చేసుకోకుండా ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. కె-పాప్– బిటిఎస్, ఎక్సో, బిటిఒబి, మోన్­స్టా-ఎస్  వంటి అగ్రశ్రేణి కళాకారుల 750కి పైగా (45 గంటలకు పైగా కంటెంట్) కొరియన్ పాప్ మ్యూజిక్ వీడియోలు.డ్రామా ధారావాహికలను చూసేందుకు, మ్యూజిక్ బ్యాంకును యాక్సెస్ చేసేందుకు, మై గెలాక్సీ యాప్ (www.tinyurl.com/hvfdx2d)ను డౌన్లోడ్ చేసుకోవాలి. కె-కంటెంట్ మాత్రమే కాక, వీడియోలు, మ్యూజిక్, గేమ్స్, వార్తలు, వ్యక్తిగతీయమైన ఆఫర్­లు మరియు అప్­డేట్లతో మై గెలాక్సీ యాప్, విలక్షణమైన ఆల్-ఇన్-వన్ అనుభవాన్ని ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో 20 మిలియన్ల మందికి పైగా మై గెలాక్సీ యాప్ వాడకందారులు ఉన్నారు.

Samsung Newsroom Link – https://news.samsung.com/in/samsung-brings-famed-k-drama-and-k-pop-content-for-indian-consumers-on-its-my-galaxy-app