April 20, 2019
  • April 20, 2019
Breaking News
  • Home
  • Trending
  • కొత్త “మేక్ ఫర్ ఇండయా” గెలాక్సీ యాప్స్ ను విడుదల చేసిన శామ్సంగ్

కొత్త “మేక్ ఫర్ ఇండయా” గెలాక్సీ యాప్స్ ను విడుదల చేసిన శామ్సంగ్

By on April 1, 2019 0 61 Views

— 


స్టోర్ను 12 భారతీయ భాషలలో ప్రారంభించింది

గెలాక్సీ యాప్స్ స్టోర్, ఇప్పుడు ఆఫర్ చేస్తోంది, శామ్సంగ్ వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన సిఫార్సులను ఆఫర్ చేస్తోంది, మరియు తప్పనిసరి సైన్ ఇన్ లేకుండా డౌన్ లోడ్లను అనుమతిస్తోంది

గురుగ్రామ్, భారతదేశం – ఏప్రిల్ 1, 2019 –  పటిష్టమైన వాడకందారుల బలగంతో తన అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ శామ్­సంగ్ ఇండియా, తాను ఇండస్ యాప్ బజార్­తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు, ఇందువలన తమ వాడకందారులు, 12 భారతీయ భాషల్లో తమకు నచ్చిన మొబైల్ అప్లికేషన్లను కనుగొని, పొందగలుగుతారని సంస్థ ఈ రోజు ప్రకటించింది. భారతదేశవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో యాప్ డౌన్లోడ్­లు కుప్పలుతెప్పలుగా పెరుగుతున్న తరుణంలో సంస్థ ఈ ప్రకటన వెలువరించింది.

2వ శ్రేణి మరియు 3వ శ్రేణి మార్కెట్లలో స్మార్ట్­ఫోన్లు మరియు మొబైల్ అప్లికేషన్ల వినియోగం విశేషంగా పెరిగింది. ఈ వైఖరి కీలకమైన మార్కెట్లలో మాకు కనిపించి, భాషాపరమైన అప్లికేషన్లకు పెరుగుతున్న గిరాకిని అందుకునేందుకు ఇండస్ యాప్ బజార్­తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాము. అమూల్యమైన మా వినియోగదారులు, ఈ భాగస్వామ్యం కారణంగా తమకు నచ్చిన యాప్­లను, ఆంగ్లంతో సహా మరో 12 భారతీయ భాషల్లో, గెలాక్సీ యాప్స్­స్టోర్­లో పొందగలుగుతారు. దీనితో, దేశవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్లకు గెలాక్సీ యాప్ స్టోర్ మరింత ప్రయోజనకరంగానూ, వినియోగదారులకు-అనుకూలమైనదిగానూ ఉపకరించగలదని మేము విశ్వసిస్తున్నాము,” అని శామ్­సంగ్ ఇండియా సర్వీసెస్ మేనేజ్­మెంట్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ రజ్­దాన్ చెప్పారు.

శామ్­సంగ్ వారి తాజా మేక్ ఫర్ ఇండియా, గెలాక్సీ యాప్స్ స్టోర్­లో లక్షలాదిమంది భారతీయులు, తమ స్థానిక భాషలో లెక్కలేనన్ని యాప్­ల శ్రేణిని చూడగలిగేందుకు ఉపకరించగలదు. గెలాక్సీ యాప్స్ స్టోర్, ఇంగ్లీషు మరియు మళయాళం, తెలుగు, తమిళం, ఒడియా, అస్సామీ, పంజాబీ, కన్నడ, గుజరాతీ, హిందీ, ఉర్దూ, బెంగాలీ మరియు మరాఠీ భాషలలో లభిస్తోంది.

సైన్ ఇన్ చేయవలసిన అవసరం లేకుండా, ఎటువంటి అవాంతరాలు లేని, సౌకర్యవంతమైన పద్ధతిలో ఉచితమైన పలు అప్లికేషన్లను యూజర్లు డౌన్­లోడ్ చేసుకునేందుకు గెలాక్సీ యాప్స్ స్టోర్ వీలు కల్పిస్తుంది.

వాడకందార్లు తమ స్థానిక భాషలో సంభాషించుకోవడానికి డిమాండు నానాటికి పెరుగుతోందని మేము అర్ధం చేసుకున్నాము. ఈ కొత్త గెలాక్సీ యాప్స్ స్టోర్, ఆ దిశలో ఒక పెద్ద ముందడుగు. యాప్ స్టోర్­లో తప్పనిసరి అయిన సైన్ ఇన్ పద్ధతి, జాప్యాన్ని కలిగించే అదనపు ప్రక్రియ అని మేము గుర్తించిన కారణంగా, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోగల యాప్­లకు దానిని పూర్తిగా తొలగించటం జరిగింది. వాడకందారులకు అద్భుతమైన అనుభవాన్ని కలిగించటమే కాక, గెలాక్సీ యాప్స్ స్టోర్­లో బోలెడన్ని యాప్­లు అందుబాటులో ఉండే కారణంగా, గెలాక్సీ వినియోగదారులు ఈ సరికొత్త అనుభవాన్ని ఆస్వాదిస్తారని, దానిని తప్పక మెచ్చుకుంటారని మేము విశ్వసిస్తున్నాము,”అని రజ­దాన్ అన్నారు.

గెలాక్సీ యాప్స్ స్టోర్ ఒక పటిష్టమైన వ్యక్తిగతమైన సిఫార్సు ఇంజన్­ను అందించి, వినియోగదారుల అవసరాలకు చక్కగా అనువైన యాప్­లను డౌన్­లోడ్ చేసుకునే అవకాశాన్ని వారికి కలిగిస్తుంది. శామ్­సంగ్ స్మార్ట్­ఫోన్ వాడకందారులకు, భారత ప్రభుత్వంవారి స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఉన్న  భారతీయ ఆవిష్కరణలను అన్నింటిని ప్రత్యేకంగా చూపగల ప్రత్యేకమైన విభాగాలు గెలాక్సీ యాప్స్ లో ఉంటాయి.