Fri. Mar 29th, 2024
minister-dayakarrao

• ప్రైవేట్ రంగంలో 17 లక్షల ఉద్యోగాలు

• కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పోయేలా ప్రైవేటీకరణ చేస్తోంది..రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర పన్నుతోంది.

• విద్యార్థులు బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించాలి

• గ్రూప్స్, ఎస్సై అభ్యర్థుల కోచింగ్ సెంటర్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు…

minister-dayakarrao

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వరంగల్,డిసెంబర్ 6,2022:దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ కాలంలో దేశంలో ఇచ్చినన్ని ఉద్యోగాలు మరెక్కడా ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోందని, రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తోందని విమర్శించారు.

మంగళవారం వరంగల్లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నాయకత్వములో ఎన్.ఎన్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గ్రూప్స్, ఎస్సై అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని అభ్యర్థులకు కోచింగ్ మెటీరియల్ అందచేశారు.

minister-dayakarrao

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాటల్లోనే …

• ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మంచి కార్యక్రమం తీసుకున్నారు.

• కేటీఆర్ ఆదేశాల మేరకు వాళ్ల నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టి ఈ పని చేస్తున్నందుకు అభినందిస్తున్నాను.

• ఎవరు ఏమి చేస్తున్నారు అనేది మనం కూడా ఆలోచించాలి.

• అందరినీ తృప్తి పర్చడం భగవంతుని వల్ల కూడా కాదు.

• మన ఇంట్లో ఇద్దరు పిల్లల జీవితాలనే సమానంగా సంరక్షించలేము.

• సీఎం కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయినా ఎన్నో అడ్డకుంకులు వస్తున్నాయి.

• కానీ నిజంగా రాష్ట్రంలో సీఎం కేసిఆర్ గారు ఎన్ని చేశారు అనేది చూడాలి.

• నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను.

• కేసిఆర్ గారు చేసినన్ని మంచి పనులు, సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు.

minister-dayakarrao

• నేను ఇతర రాష్ట్రాల్లో కూడా తిరిగాను. ఎక్కడా మనన్ని స్కీమ్స్ లేవు.

• గుజరాత్, ఇతర రాష్ట్రాల్లో 500 రూపాయాల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు.

• 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే.

• ముసళ్లోల్లకి ఈ పెన్షన్ ఎంతో ఉపయోగపడుతుంది.

• గతంలో కుండలు, బిందెలు పట్టుకుని మంచి నీళ్ళ కోసం ఎంతో ఇబ్బంది పడ్డాము.

• ఈ ఇబ్బందిని సమూలంగా దూరం చేసేందుకు సీఎం కేసిఆర్ గారు 40 వేల కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ తెచ్చారు.

• కాళేశ్వరం నీళ్ళ వల్ల జిల్లా సస్య శ్యామలం అయ్యింది.

• గ్రూప్ -1, ఎస్సై, గ్రూప్స్ కి కోచింగ్ తీసుకునే మీకు ఏ రాష్ట్రం ఏమి చేస్తుంది తెలువాలి.

• గతంలో కరెంట్ లేక జెనరేటట్లు పెట్టుకునే వాళ్ళం.

• ఈరోజు 24 గంటలు కరెంట్ వస్తుంది.

minister-dayakarrao

• తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన కేంద్రం…ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.

• ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేసి, రిజర్వేషన్లు ఎత్తి వేయాలని కేంద్రం కుట్ర పన్నుతోంది.

• కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ నెరవేర్చింది ఏమి లేదు.

• ప్రైవేట్ రంగంలో 17 లక్షల ఉద్యోగాలు కల్పించాం.

• సంగెం మండలంలో టెక్స్టైల్ పార్క్ వల్ల ఇక్కడే లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి.

• ఈ కోచింగ్ సెంటర్ నుంచి 200 మంది ఇప్పటి వరకు ఎంపిక అయ్యారు.

• మీరంతా రాబోయే పరీక్షల్లో సెలెక్ట్ కావాలని భగవంతున్ని కోరుకుంటున్నాను.

• పట్టుదలతో ఉండాలి. ఆషామాషీగా ఉండొద్దు.

• నాకు పెళ్ళి అయ్యింది..పరిస్ఠితి ఇంతే అనుకున్నా… కానీ ఈ కోచింగ్ సెంటర్ వచ్చింది. ఇక్కడకు వచ్చాక నాకు ధైర్యం వచ్చింది అని ఒక అభ్యర్థి అన్నది. ఆమెను అభినందిస్తున్నాను.

minister-dayakarrao

• నేను కూడా తొర్రూరులో కోచింగ్ పెట్టాను. ఎంత అవస్థ ఉంటుందో నాకు తెలుసు.

• కోచింగ్ పెట్టి ఎంతో మందికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పిస్తున్న ఎమ్మెల్యే నరేందర్ కుటుంబ చల్లగా ఉండాలి.

• ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు అభినందిస్తున్నాను.

• నా పిల్లలు ఉద్యోగం సంపాదించాలి అని అందరు తల్లిదండ్రులు కోరుకుంటారు.

• మీకు ఉద్యోగం వస్తే చాలు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు.

• మా నాన్న రాజకీయాల్లోకి రాలేకపోయారు. నేను ఛాలెంజ్ గా తీసుకుని వచ్చాను. సక్సెస్ అయ్యాను.

• నరేందర్ కూడా రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఇకపై నా ఆశీర్వాదం కూడా ఉంటుంది.

• మీరు సోషల్ మీడియాలో చెడు జోలికి వెళ్లోద్దు. మంచి కోసం సెల్ ఫోన్లు ఉపయోగించుకోవాలి.

• చెడుకు తొందరగా బానిస అవుతాం. కొద్దిగా ఓపిక పట్టి ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి.

minister-dayakarrao

• మీ భవిష్యత్ మీద మీ కుటుంబాలు ఆధార పడి ఉన్నాయి.

• అందరూ సెలెక్ట్ కాకపోవచ్చు..కానీ ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది.

• సెలెక్ట్ కాకపోతే ప్రైవేట్ లో మీకు జాబ్స్ పెట్టే ఏర్పాటు చేస్తాను

• కేసిఆర్ గారు మంచి అవకాశం ఇచ్చారు. కేటీఆర్ గారు మంచి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు.

• ఇంకా ఈ ప్రాంతంలో ఎవరైనా పిల్లలు ఉంటే వారికి కూడా కోచింగ్ ఇవ్వండి. భవిష్యత్ తీర్చి దిద్దండి.

ఈ కార్యక్రమంలో ట్రస్టు ఛైర్ పర్సన్ వాణీ దేవి, స్థానిక కార్పొరేటర్ గందే కల్పన నవీన్, కార్పొరేటర్లు దిడ్డి కుమార స్వామి, గుండెటి నరేందర్, మసూద్, రమేష్ బాబు, సురేష్ జోషి, మస్కుమల్ల అరుణ, కావేటి కవిత, పోషాల పద్మ, వెల్పుకొండ సువర్ణ, చింతాకుల అనిల్, వోని భాస్కర్, వోని స్వర్ణ లత, వస్కుల బాబు, మరుపల్లి రావు, బైరబోయిన దామోదర్, సోమిషెట్టి ప్రవీణ్, ప్రొఫెసర్ జయశంకర్ కోచింగ్ సెంటర్ సత్యనారాయణ చారి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.