ప్రారంభమైన 11వ ఎడిషన్‌ క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022

Business Featured Posts Life Style political news Technology TS News
Spread the News

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, 29 ఏప్రిల్‌ 2022: దేశంలో ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌తో ఏర్పడిన అపెక్స్‌ బాడీ కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌), నేడు 11వ ఎడిషన్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022ను నగరంలో ప్రారంభించింది. క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022 మాదాపూర్‌లోనిహైటెక్స్‌లో 29 ఏప్రిల్‌ 2022 నుంచి 01 మే 2022 తేదీ వరకూ జరుగనుంది.ఈ ప్రోపర్టీ షోను గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖామాత్యులు కె టీ రామారావు ప్రారంభించా రు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎంఎల్‌ఏ అరికెపూడి గాంధీ ; క్రెడాయ్‌ నాయకత్వ బృందం – అధ్యక్షుడు పీ రామకృష్ణారావు ; జనరల్‌ సెక్రటరీ వి రాజశేఖర్‌ రెడ్డి; ఉపాధ్యక్షులు– జి ఆనంద్‌ రెడ్డి, కె రాజేశ్వర్‌, ఎన్‌ జైదీప్‌ రెడ్డి ; బి జగన్నాధ్‌ రావు ;ట్రెజరర్‌ ఆదిత్య గౌర ; జాయింట్‌ సెక్రటరీలు శివరాజ్‌ ఠాకూర్‌, కె రాంబాబు తో పాటుగా ఈసీ సభ్యులు, సభ్య డెవలపర్లు,సరఫరాదారులు,ఆర్ధిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు జరిగే క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో హైటెక్స్‌ ప్రాంగణం వద్ద జరుగుతుంది. హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ శ్రేణి డెవలపర్లు, మెటీరియల్‌ వెండార్లు, బిల్డింగ్‌ మెటీరియల్‌ మాన్యుఫాక్చరర్స్‌, కన్సల్టెంట్స్‌ ,ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఒకే దరికి రావడంతో పాటుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో పాటుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అభివృద్ధిని ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్స్‌కు తగినట్లుగా డెవలపర్లు ప్రోపర్టీలను ప్రదర్శిస్తున్నారు. వినియోగదారులకు జంట నగరాల్లో అత్యుత్తమ గృహ పరిష్కారాలను పొందే అవకాశం కల్పిస్తూ 15వేలకు పైగా అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్స్‌, వాణిజ్య ప్రాంగణాలను ప్రదర్శిస్తున్నారు. ఇవి వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఉన్నాయి.

ఈ సందర్భంగా శ్రీ పీ రామకృష్ణా రావు, ప్రెసిడెంట్‌, క్రెడాయ్‌ హైదరాబాద్‌ మాట్లాడుతూ ‘‘ కోవిడ్‌–19తో మనం అసాధారణ పరిస్థితులను ఎదుర్కొన్నాము. దీనికి తోడు ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి పదార్థాల ధరలు గణనీ యంగా పెరిగాయి. అయితే, ఈ సవాళ్ల పరిస్ధితుల్లో కూడా హైదరాబాద్‌ నగరంలో స్ధిరంగా వృద్ధిని చూడటంతో పాటుగా రియల్‌ ఎస్టేట్‌ పరంగా పలు విభాగాలలో డిమాండ్‌నూ చూసింది. ఇదే వేగం 2022–23 సంవత్సరంలో కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నాము. గృహ విక్రయాల పరంగా వేగం కనిపించనుందని ఆశిస్తున్నాము. రాష్ట్రంలో ప్రభుత్వం నిలకడగా ఉండటం, నగరంలో స్థిరంగా పెట్టుబడులు రావడం, విస్తృత స్ధాయిలో ఉపాధి కల్పన, ఆఫీసు ప్రాంగణ స్వీకరణకు తోడ్పడుతుంది. అధిక శాతం మంది వినియోగదారులు పెట్టుబడి మార్గంగా
గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఆస్తుల ధరలు గణనీయంగా పెరుగుతుండటం చేత అత్యుత్తమ రిటర్న్స్‌ వస్తాయని ఆశిస్తున్నారు. కొంతమంది హైబ్రిడ్‌ పని వాతావరణంలో హోమ్‌ ఆఫీస్‌గా కోసం తగిన అవకాశంగా ఎంచుకుంటున్నారు.

అలా్ట్ర మోడ్రన్‌ వసతులతో తమ జీవనశైలి మెరుగుపరుచుకోవాలనుకోవడం కూడా చాలామంది తమ రెండవ ఇంటిని ఎంచుకోవడానికి కారణమవుతుంది. ఈ డిమాండ్‌ ను మరింత వృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మాత్రమే గాక విదేశాల నుంచి కూడా ప్రతిభావంతులను నగరం ఆకర్షిస్తోంది. విలాసవంతమైన గృహాలకు అధిక మొత్తంలో చెల్లించడానికి సైతం వీరు వెనుకాడటం లేదు’’ అని అన్నారు.ఆయనే మరింతగా మాట్లాడుతూ ‘‘ దాదాపు 1500కు పైగా ఐటీ/ఐటీఈఎస్‌ మరియు 800 ఫార్మా, బయోటెక్‌
కంపెనీలకు నిలయంగా హైదరాబాద్‌ నగరం నిలిచింది. అంతేకాదు, పలు ప్రధానమైన పరిశ్రమ విభాగాలు అయినటువంటి ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఏరోస్పేస్‌, రక్షణ, టెక్స్‌టైల్‌ మొదలైన రంగాలు కూడా ఇక్కడ అభివృద్ధి చెందాయి. భారతదేశ వ్యాప్తంగా మదుపరులు నగరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. రాబోయే 10 సంవత్సరాల కోసం తమ పెట్టుబడుల కేంద్రంగా నగరాన్ని మలుచుకుంటున్నారు.
అదీగాక, తెలంగాణా ప్రభుత్వ పాలసీలు అయినటువంటి 2020లో గ్రిడ్‌ పాలసీ, 2014లో టీఎస్‌ ఐపాస్‌, 2020లో టీఎస్‌ బీపాస్‌ వంటివి నగరానికి ఓ ఆకృతి అందించడంతో పాటుగా మదుపరులకు అత్యంత ఆకర్షణీయమైన కేంద్రంగా
మలిచాయి.

దీనికి తోడు మదుపరులకు అత్యంత అనుకూలమైన వాతావరణం, తగిన మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు నగరమంతా లభిస్తున్నాయి. ఈ నగరంలో వేర్‌హౌసింగ్‌, ఏవియేషన్‌, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు వస్తున్నాయి ఈ కారణంగా మరిన్ని ఉద్యోగాలూ లభిస్తున్నాయి. తద్వారా వాణిజ్య, గృహ,రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌కు డిమాండ్‌ను పెంచుతుంది. మా దగ్గర అతి తక్కువ ఇన్వెంటరీ ఉంది. అయినప్పటికీ భారీ స్ధాయిలో నూతన ప్రాజెక్టులు ప్రారంభం కావడమన్నది ఇక్కడి డిమాండ్‌ను సూచిస్తుంది. వినియోగదారులకు తగిన అవకాశాలను అందించడంతో పాటుగా పలు పెట్టుబడి అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు మేము క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022ను నిర్వహిస్తునాము. కేవలం టీఎస్‌–రెరా నమోదిత ప్రాజెక్టులు మాత్రమే ఈ ప్రోపర్టీ షోలో కనబడనున్నాయి. ఈ ప్రోపర్టీ షోలో అత్యంత ఆకర్షణీయమైన, వాస్తవ ప్రోపర్టీలను మాత్రమే ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్‌ అవకాశాలతో ఒకే చోట అందిస్తున్నాము. ఈ ప్రోపర్టీ షోను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మా

వినియోగదారులను కోరుతుండటంతో పాటుగా ధరలు పెరగక మునుపే మీ ప్రాధాన్యతా గృహం కొనుగోలు చేయాల్సిందిగా సూచిస్తున్నాము’’ అని అన్నారు.
శ్రీ వీ రాజశేఖర్‌ రెడ్డి, జనరల్‌ సెక్రటరీ, క్రెడాయ్‌ హైదరాబాద్‌ మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌ నగరంలో ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నాను, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అత్యంత ప్రాధాన్యతా కేంద్రంగా హైదరాబాద్‌ నిలుస్తుంది. మరీ ముఖ్యంగా భారీ ఎంఎన్‌సీలు ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆసక్తి
చూపుతున్నాయి. దీనికి తోడు ప్రకాశవంతమైన, వేగంగా వృద్ధి చెందుతున్న స్థానిక వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థ ఈ వృద్ధికి తోడ్పాటునందించడంతో పాటుగా నగరంలో ఉపాధి కల్పన కూడా చేస్తుంది. భారతదేశంలో అతి సులభంగా వ్యాపార నిర్వహణ పరంగా మూడవ ర్యాంకును తెలంగాణా సాధించింది, అంతేకాకుండా
హాలీడిఫై డాట్‌ కామ్‌ చేత నివసించడానికి అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ నెంబర్‌ 1 ర్యాంకు సాధించింది. స్మార్ట్‌ సిటీస్‌ పరంగా అత్యుత్తమ రోడ్‌ మ్యాప్‌ కలిగిన నగరాలలో ఒకటిగా హైదరాబాద్‌ నగరాన్ని మొదటి నాలుగు నగరాలలో ఒకటిగా వరల్డ్‌ ఎనకమిక్‌ ఫోరమ్‌ గుర్తించింది. అలాగే మేజర్‌ స్టేట్స్‌ విభాగంలో ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో 4వ ర్యాంకును నీతి ఆయోగ్‌ చేత అందుకుంది.

ఇటీవలనే హైదరాబాద్‌ నగరం నెంబర్‌ 1 ర్యాంకును ఎఫ్‌డీఐ (ఫైనాన్షియల్‌ టైమ్స్‌ విభాగం) ఏరోస్పేస్‌ సిటీస్‌ ఆఫ్‌ ద ఫ్యూచర్‌ విభాగంలో టాప్‌1– ఏరోస్పేస్‌ సిటీస్‌ ఇన్‌ కాస్ట్‌ ఎఫెక్టివ్‌నెస్‌ పరంగా సాధించింది. ఎన్నో రకాలుగా అత్యంత సురక్షితమైన నగరంగా మదుపరులు దీనిని భావిస్తున్నారు. అంతేకాదు,ప్రపంచపు కోవిడ్‌ వ్యాక్సిన్‌ రాజధానిగా నిలువడమూ దీనికి ఓ ఉదాహరణగా నిలుస్తుంది’’ అని అన్నారు.
ఆయనే మరింతగా మాట్లాడుతూ‘‘ గచ్చిబౌలి వద్ద మూడు మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో భవంతిని నిర్మించడానికి పనులను గుగూల్‌ ప్రారంభించింది. ఈ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ క్లస్టర్‌ను 7.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. యుఎస్‌కు వెలుపల గుగూల్‌కు ఉన్న అతిపెద్ద క్యాంపస్‌ ఇది. సమీప భవిష్యత్‌లో ఈ నగరంలో 3 డాటా సెంటర్లు రానున్నాయి. దాదాపు 20,761 కోట్ల రూపాయల పెట్టుబడులను అమెజాన్‌డాటా సర్వీసెస్‌ ,నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ) ఓ స్మార్ట్‌ డాటా సెంటర్‌ను ; గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ చేత
గ్లోబల్‌ షేర్డ్‌ సర్వీసెస్‌ సెంటర్‌ అలాగే 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో నగరంలో గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను పెట్టడంతో పాటుగా 1000 ఉద్యోగాలను సృష్టించనుంది.వీటితో పాటుగా సైబర్‌ సెక్యూరిటీ లక్ష్యిత సంస్థలైన కొటెల్లిజెంట్‌– టెక్‌ డెమోక్రసీ కంపెనీ సైతం నూతన సైబర్‌ వారియర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను 1000 మంది సైబర్‌ వారియర్స్‌ను హైదరాబాద్‌ నుంచి శిక్షణ అందించడం

కోసం ఎంచుకోనుంది. అలాగే నగరంలో ఫార్మాసిటీ, జినోమ్‌ వ్యాలీ వద్ద ఫార్మాస్యూటి కల్స్‌, హెల్త్‌కేర్‌ కంపెనీలు రానున్నాయి. వీటితో పాటు ఉపాధి అవకాశాలను కల్పించే మరెన్నో కంపెనీలు నగరంలో కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఇవన్నీ కూడా హౌసింగ్‌కు డిమాండ్‌ గణనీయంగా పెంచుతాయి.దీనికి తోడు రాష్ట్రం ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్‌ పాలసీ ఎన్నో స్టార్టప్స్‌ను ఆకట్టుకుంది. దేశంలో లభ్యమవుతున్న
అత్యుత్తమ పర్యావరణ వ్యవస్ధ చేత వీరు ప్రయోజనం పొందుతున్నారు. అంతేకాదు రాష్ట్రపు రెండవ ఐసీటీ విధానం 2021–2026 వంటి వాటి ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటుగా 2026 నాటికి 10 లక్షల మంది ఉద్యోగులు కలిగిన పరిశ్రమగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం
అంతర్జాతీయంగా సంక్షోభం నడుస్తున్నప్పటికీ, ముడి పదార్థాల ధరలు పెరిగి ఆస్తుల ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, హైదరాబాద్‌లో ధరలు మాత్రం సహేతుకంగానే ఉన్నాయి. అయితే ఇదే రీతిలో ధరలు కొనసాగడం మాత్రం లేదు.

త్వరలోనే వీటి ధరలు గణనీయంగా పెరగనున్నాయి. అందువల్ల సంభావ్య గృహ కొనుగోలుదారులు ప్రస్తుత తక్కువ ధరలను సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా తమ మనసుకు నచ్చిన గృహాలను కొనుగోలు చేయవచ్చు.అత్యంత విశ్వసనీయమైన క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రోపర్టీ షో 2022 కేవలం టీఎస్‌ రెరా నమోదిత ప్రాజెక్టులను సభ్య డెవలపర్ల నుంచి నిర్వహిస్తోంది. అందువల్ల సంభావ్య కొనుగోలుదారులు తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా తమ కలల ఇంటిని కొనుగోలు చేయాల్సిందిగా సూచిస్తున్నాము. లేదంటే అంతర్జాతీయ వాతావరణ పరిస్థితుల కారణంగా ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి’’ అని అన్నారు.