Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 1, హైదరాబాద్‌: కరోనా నిర్ధారణ పరీక్ష కిట్లు హైదరాబాద్‌ చేరుకున్నాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అనుమానిత రోగుల రక్త నమూనాలను వైద్యులు పుణెకు పంపించారు. దీంతో రాష్ట్రంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యశాఖ అన్ని రకాలుగా సమాయత్తమైంది. వైద్యశాఖ అధికారులు నాలుగు ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్‌ వార్డులు ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కరోనా కిట్లతో పాటు కొన్ని రక్త నమూనాలను కూడా పంపించింది. కేంద్రం పంపిన నమూనాలతో గాంధీ వైద్యులు ప్రాథమికంగా పరీక్షలు చేయనున్నారు. రిపోర్టులను తిరిగి కేంద్ర వైద్య బృందానికి పంపనున్నారు. పరీక్షలు జరిగిన పద్ధతిని పరీక్షించిన తర్వాతే కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీలో అందుబాటులోకి రానున్నాయి.