Thu. Mar 28th, 2024

365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 2, హైదరాబాద్: 1571 మంది బాలురు, 412 మంది బాలికలు మొత్తం 1982 మందిని వారి తల్లితండ్రులు,బందువులకు అప్పగించారు.1349 మంది బాలురు, 269 మంది బాలికలు మొత్తం 1618 పిల్లలను పునరావాస కేంద్రాల్లో చేర్పించారు.రక్షించిన వారిలో ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన పిల్లలు 1292 మంది ఉండగా, వీరిలో 1015 మంది బాలురు, 277 మంది బాలికలున్నారు. నేపాల్ కుచెందిన 13 మంది, మయాన్మార్ నుండి 4 , ఆంధ్ర ప్రదేశ్ నుండి 140 , బీహార్ కుచెందిన 166 మంది, ఛత్తీస్గఢ్ 97 ,గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ ల నుండి ఒకరు చొప్పున, జార్ఖండ్ 30, కర్ణాటక 56, కేరళ 2, మధ్య ప్రదేశ్ల 58, మహారాష్ట్ర నుండి 145, రాజస్థాన్ నుండి 76, తమిళనాడు కు చెందిన 8, ఉత్తరప్రదేశ్ కు చెందిన 134, పశ్చిమ బెంగాల్ కు చెందిన 44 మంది ఉండగా అత్యధికంగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 304 మంది ఉన్నారు.1972 మంది వీధి బాలలను రక్షించగా వీరిలో 1599 మంది బాలురు, 373 మంది పిల్లలున్నారు. బాలికలున్నారు. వెట్టిచాకిరి నుండి 1133 మంది బాలురు, 123 మంది బాలికలు మొత్తం 1306 మందిని రక్షించారు.ఇటుక బట్టి కార్మికులుగా ఉన్న 142 మందిని, యాచకులుగా ఉన్న 180 మందిని రక్షించారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహాల్లో ఉన్న పిల్లల డాటాను డిజిటలైజ్ చేయడం తో తప్పిపోయిన, దొరికిన, రక్షించిన పిల్లల ఫోటోలను పోల్చిచూడడానికి సులభంగా మారింది. దర్పణ్ యాప్ ద్వారా కల్వకుర్తి పోలీస్ స్టేషన్, కుషాయిగుడా పోలీస్ స్టేషన్ లో తప్పిపోయిన ఇద్దరు పిల్లలను గుర్తించడం జరిగింది.
ఆపరేషన్ ముస్కాన్ – 5 లో 411 కేసుల నమోదు
ప్రతీ సంవత్సరం జూలై మాసం లో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా 5 వ విడత ముస్కాన్ లో 411 కేసులను పోలీస్ శాఖ నమోదు చేసింది. బాల కార్మిక నిషేధ చట్టం, జువైనల్ జస్టిస్ యాక్టుల క్రింద నమోదైన ఈ కేసులలో సైబరాబాద్ లో 182 , నల్గొండ జిల్లాలో 37 , ఖమ్మం కమిషనరేట్ లో 34 , భద్రాద్రి కొత్తగూడెం లో 32 , హైదరాబాద్ కమిషనరేట్ లో 27 నమోదయ్యాయి. ఈ కేసులను ట్రాఫికింగ్, నాన్ ట్రాఫికింగ్ విభాగాలుగా విభజించి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
ఆపరేషన్ స్మైల్ ఆరవ దశలో కొన్ని ప్రాధానాంశాలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడాలో ఉన్న శైల్ఫుడ్ కంపెనీ లో బాల కార్మికులుగా ఉన్న పన్నెండేళ్ల నుండి 17 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న 12 మందిని రక్షించారు.పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడి పల్లి గ్రామంలోవున్న డీ.ఎస్.స్క్రాప్ గోదాములో బాల కార్మికులుగా ఉన్న11 మందిని రాచకొండ ఆపరేషన్ స్మైల్ బృందాలు రక్షించాయి.

స్మైల్-6 లో 404 మందిని రక్షించి అగ్ర స్ఠానంలో నిలిచిన సైబరాబాద్
2020 జనవరి ఒకటవ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-6 లో సైబరాబాద్ పోలీస్ స్మైల్ బృందాలు 404 మంది పిల్లలను రక్షించి 182 కేసులను నమోదు చేయడం ద్వారా రాష్ట్రం లో అగ్రభాగాన నిలిచాయి. 387 మంది.పిల్లలను రక్షించి 27 కేసులను పెట్టి హైదరాబాద్ స్మైల్ బృందాలు ద్వితీయ స్ఠానం లో నిలిచాయి. కాగా, ఆపరేషన్ స్మైల్ లో ఉత్తమ ఫలితాలను సాధించడం పట్ల డీ.జీ.పీ మహేందర్ రెడ్డి అభినందించారు.